BigTV English

Pay for Wedding Dinner: పెళ్లి భోజనం ప్లేటు రూ.15,000.. తిన్నవారు చెల్లించండి.. అతిథులకు షాకిచ్చిన వధువు

Pay for Wedding Dinner: పెళ్లి భోజనం ప్లేటు రూ.15,000.. తిన్నవారు చెల్లించండి.. అతిథులకు షాకిచ్చిన వధువు

Pay for Wedding Dinner| ఇండియాలో పెళ్లి అంటే సామన్యంగా ఉండదు. ప్రతీ పెళ్లి లోనూ ఏదో ఒక గొడవ, వింత జరగాల్సిందే. ఇటీవల ఒక పెళ్లి కార్యక్రమంలో అతిథుల పట్ల పెళ్లికూతురు వ్యవహారం అందరినీ షాక్ కు గురిచేసింది. ఈ ఘటన గురించి రెడ్డిట్ లో ఒకరు పోస్ట్ చేయగా.. అది బాగా వైరల్ అవుతోంది.


రెడ్డిట్ ప్లాట్‌ఫామ్ పై వైరల్ అవుతున్న పోస్ట్ లోని వివరాల ప్రకారం.. ఒక యువతి తన ఫ్రెండ్ పెళ్లి జరుగుతోందని ఆహ్వానం అందుకుంది. తన పెళ్లి జరుగుతున్నందుకు పెళ్లికూతురు ఎంతో సంతోషంగా ఉందని అందుకే తనతో పాటు చాలా మంది స్నేహితులు, ఆఫీసు ఫ్రెండ్స్ అందరికనీ పెళ్లికి ముందే ఒక పెద్ద రెస్టారెంట్‌లో ఫంక్షన్ కు ఆహ్వానించిందని తెలిపింది. సాధారణంగా అయితే పెళ్లికి ముందు ఇటీవల అందరూ హల్దీ, మెహందీ వంటి ఫంక్షన్లు చేస్తారు. కానీ ఈ పెళ్లి కూతురు మాత్రం బాగా ఖరీదైన రెస్టారెంట్ లో సెలెబ్రేషన్ పెట్టుకుంది.

ఆ రెస్టారెంట్ లో వెళ్లాక అక్కడి పార్టీ కోసం భారీగా ఏర్పాట్లు ఉన్నాయని.. అది చూసి అందరం బాగా ఎంజాయ్ చేశామని తెలిపింది. కానీ తమ సంతోషమంతా పార్టీ చివరిలో ఆవిరైపోయిందని రాసింది. తమకు ఏమాత్రం ముందస్తుగా చెప్పలేదని.. అంతా కలిసి సంతోషంగా విందు భోజనం ఆరగించిన తరువాత పార్టీ చివరితో అతిథులే భోజనానికి చెల్లించాలని హోటల్ యజమాన్యం కోరింది. ఇది విని అందరూ షాకై పోయారు. ఆ తరువాత తమను పార్టీకి ఆహ్వానించిన ఆ పెళ్లికూతురు ఫ్రెండ్ ని ఇదేంటని ప్రశ్నిస్తే.. తన వద్ద డబ్బులు లేవని.. అయినా తాను అంత పెద్ద మొత్తంలో తన వద్ద క్యాష్ వెంట తీసుకురాలేనని విచిత్రంగా చెప్పింది. తిన్నారుగా ఇక చెల్లించి వెళ్లండి అని చెప్పి వెళ్లిపోయింది.


Also Read: 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన బాలిక.. కష్టాలుపడి ఇంటికి తిరిగివస్తే షాకింగ్ దృశ్యం

అయితే ఆ పోస్ట లో తెలిపిన వివరాల ప్రకారం.. పార్టీలో ఫుడ్, డ్రింక్స్ అందించారు. డ్రింక్స్ అంటే మామూలు డ్రింక్స్ కాదు.. బాగా ఖరీదైన మద్యం, చాంపెయిన్ బాటిల్స్ అందుబాటులో పెట్టారు. అంతా వాటిని ఎంజాయ్ చేశాక.. బిల్లు చెల్లించమంటే అతిథులు ఒకరి ముఖాలు మరొకరు చూసుకుంటూ కూర్చున్నారు.

డబ్బులు లేనివారి పరిస్థితేంటి?

కాసేపు పార్టీలో అంతా నిశ్శబ్దంగా ఉంది. చివరికి అతిధుల్లో ఒకరు వచ్చి సరే ఒక్కో అతిథి ఎంత చెల్లించాలి అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ పెళ్లి కూతురు ఒక్కొక్కరు రూ.15,000 చెల్లించండి అని చెప్పింది. ఆ మొత్తం విన్నాక కొందరు తమ పర్సులు చూసుకున్నారు. కొందరు చెల్లించేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ మరికొందరు బిల్లు చెల్లించడానికి ఇబ్బంది పడ్డారని పేర్కొంది.

ఇదంతా తన పోస్ట్ లో రాసిన ఆ రెడ్డిట్ యూజర్.. “ఈ ఘటన జరిగి కొన్ని రోజులు అయింది. ఆ తరువాత నేను ఆలోచించాను. అది పార్టీ కాదు.. ఫ్రెండ్స్ గెట్ టు గెదర్ లాగా అనిపించింది. ఒకవేళ తమకు ముందే బిల్లు చెల్లించాలని తెలిసి ఉంటే అన్ని ఏర్పాట్లతో వెళ్లే వాళ్లం. పైగా మాకు నచ్చింది ఆర్డర్ చేసుకొని తినేవాళ్లం కదా? అని ప్రశ్నించింది. లేకపోతే ఆ కార్యక్రమానికి అసలు వెళ్లాలో? లేదో? ముందే నిర్ణియించుకునే వాళ్లం. ఒకవేళ్ల మా వద్ద రూ.15,000 లేకుంటే మా పరిస్థితి ఏంటి?” అని తన ఫ్రెండ్ చేసిన ఘనకార్యాన్ని విమర్శించింది.

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×