BigTV English

SSMB29 : జక్కన్న ప్లానింగ్ అదిరింది, ముందు మ‌హేష్ బాబు.. వెనుక డైనోసార్స్‌…

SSMB29 : జక్కన్న ప్లానింగ్ అదిరింది, ముందు మ‌హేష్ బాబు.. వెనుక డైనోసార్స్‌…

SSMB29 : కొన్నిసార్లు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని చూస్తే అనిపిస్తుంది. అసలు ఈయన డైరెక్టర్ ఆ లేకుంటే డాక్టర్ అని. ఎందుకంటే ఆడియన్స్ పల్స్ తెలియాలి అంటారు. అలా 100% ఆడియన్స్ పల్స్ తెలిసిన వ్యక్తి కాబట్టే వరుసగా సక్సెస్ లు కొట్టాడు రాజమౌళి. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మొదలైన రాజమౌళి ప్రయాణం టాలీవుడ్ కే నెంబర్ వన్ దర్శకుడు అనిపించుకునే వరకు ఎదిగింది. తాను ఎదగడమే కాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీని శిఖరం మీద కూర్చోబెట్టాడు. బాహుబలి లాంటి సినిమాను ఊహించడమే కష్టం అనుకునే తరుణంలో ఆ సినిమాను వెండితెరపై ఆవిష్కరించాడు. ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేశాడు. ఇక తర్వాత చేసిన ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇద్దరు హీరోల్ని కలిపి ప్రపంచవ్యాప్తంగా షేర్ చేసి ఆస్కార్ అవార్డును తెలుగు చిత్ర సీమకు అందించాడు.


మహేష్ తో నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్

ప్రస్తుతం మహేష్ బాబుతో ఎస్ఎస్ రాజమౌళి సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. తన కెరియర్ లో మొదటిసారి ఒక స్టార్ హీరోతో పనిచేస్తున్నాడు రాజమౌళి. ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఎందుకంటే నేడు ఇండస్ట్రీలో స్టార్లుగా కొనసాగుతున్న ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలకు స్టార్డం వచ్చింది రాజమౌళి సినిమాల వలన, కానీ మహేష్ బాబుకి ముందు నుంచే స్టార్ట్ డం ఉంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుంది అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాలో అదిరిపోయే సీక్వెన్స్ ఒకటి ప్లాన్ చేశాడు జక్కన్న. ఇది లార్జ‌న్ దెన్ లైఫ్ కాదు.. ఇది లార్జ‌న్ దెన్ ఇండియ‌న్ సినిమా, ముందు మ‌హేష్ బాబు, వెనుక డైనోసార్స్‌.రాజ‌మౌళి మ‌హేష్ కోసం డిజైన్ చేస్తున్న ఓ యాక్ష‌న్ సీక్వెన్స్ ఇది. ఇండియ‌న్ స్క్రీన్‌పై న‌భూతో.. న భ‌విష్య‌త్ అనే రేంజ్‌లో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది.


భారీ ఎక్స్పెక్టేషన్స్

ఇక ఈ సినిమా మొదలైనప్పుడు నుంచే భారీ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి ముఖ్యంగా మహేష్ బాబు లుక్స్ చూస్తుంటే మతి పోతుందని చెప్పాలి. ఇంతకుముందు ఎప్పుడూ లేనివిధంగా పొడుగైన జుట్టుతో గుబురు గడ్డంతో మహేష్ బాబు కనిపిస్తున్నాడు. ఇప్పుడు స్మార్ట్ గా కనిపించే మహేష్ బాబుని ఇప్పుడు తన వెర్షన్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు రాజమౌళి. ప్రతిసారి కలెక్షన్స్ తో కొత్త రికార్డు సృష్టించే మౌళి. ఈసారి మహేష్ బాబు సినిమాతో నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ కూడా తీసుకురానున్నాడు అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎప్పుడు రాజమౌళి నుంచి ఒక సినిమాను ఎక్స్పెక్ట్ చేసిన అది నెక్స్ట్ లెవెల్ లోనే ఉంటుంది. ఈ సినిమా విషయంలో కూడా అదే జరుగుతుందనేది చాలామంది అభిప్రాయం.

Also Read : Tollywood celebrities: డబ్బుల కోసం ఏదైనా చేస్తారా… మీ డై హార్డ్ ఫ్యాన్స్‌పై మినిమం కన్సర్న్ లేదా..?

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×