BigTV English

Viral News: తాగుడుకు బానిసైన పిల్లి ఎంత బరువు పెరిగిందో తెలుసా..చూస్తే అవాక్కవుతారు

Viral News: తాగుడుకు బానిసైన పిల్లి ఎంత బరువు పెరిగిందో తెలుసా..చూస్తే అవాక్కవుతారు

Viral News: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో తరచూ జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇలా వైరల్ అయ్యే వీడియోల్లో కొన్ని సాధారణంగా జరిగే ఘటనలే అయినా కూడా మరికొన్ని వీడియోలు చూస్తే మాత్రం అందరినీ ఆకట్టుకుంటాయి. అయితే సోషల్ మీడియాలో ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఎన్నో ఘటనలు తరచూ ఇందులో దర్శనమిస్తుంటాయి. అయితే తాజాగా ఓ పిల్లికి సంబంధించిన వీడియో అందరినీ ఆశ్యర్యానికి గురిచేస్తుంది.


సాధారణంగా ఏ పిల్లి అయినా కూడా ఓ 7 నుంచి 8 కిలోల బరువుతో ఉండడం చూస్తుంటాం. అది ఎక్కడ అయినా సరే ఇంత కంటే బరువుగా ఉన్న పిల్లిని చూడడం అంటే సాధ్యం కాదు. అయితే తాజాగా ఓ పిల్లి తిండి, మద్యానికి అలవాటు పడి ఏకండా 17 కిలోల బరువు పెంచుకుంది. తినడానికి, తాగడానికి ఈ పిల్లి బాగా ఇష్టపడుతుంది. దీంతో ఏకంగా 17 కిలోల బరువుతో ఏకంగా నడవలేని స్థితిలోకి చేరింది.

ఈ ఘటన రష్యాలో వెలుగుచూసింది. ఓ ఇంటి సెల్లార్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ పిల్లిని వదిలి వెళ్లారు. ఈ తరుణంలో జంతువులను సంరక్షించడానికి పని చేసే ఓ ఎన్జీఓ ఈ పిల్లిని రక్షిస్తుంది. దీంతో నడవలేకుండా తయారైన పిల్లిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తుంది. అయితే ఈ పిల్లి తరచూ మద్యం తీసుకుంటుందట. అంతేకాదు మాంసం, జ్యూస్, సూప్, బ్రెడ్ వంటివి తీసుకుని ఇంత బరువు పెరిగిందట. అయితే పిల్లిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చినపుడు అల్ట్రాసౌండ్ చేయడానికి ట్రై చేస్తే సెన్సార్లు స్కాన్ చేయలేకపోయాయని వైద్యులు తెలిపారు.


ఈ పిల్లి మాన్స్టర్ క్యాట్ అనే పేరుతో కూడా ఫేమస్ అయింది. అయితే ఈ పిల్లి అసలు పేరు క్రోషిక్. దీనిని ఆసుపత్రిలో చేర్చడంతో కాస్త నడవగలిగే స్థితికి చేరింది. తన కాళ్లను కదిలిస్తూ నెమ్మదిగా నడుస్తుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Приют для Кошек Пермь (@matroskin_prm)

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×