Pink Moon 2025: సాధారణంగా చందమామ అంటే ఏ కలర్‌లో ఉంటుంది..? ఏ రంగు ఏముంది? తెలుపు రంగులోనే ఉంటుంది కదా..? ఏ కలర్ అని కొత్తగా అడగడం ఏంటని అనుకుంటున్నారా..? అయితే పింక్ మూన్‌ని ఎప్పుడైనా చూశారా..? చందమామ కలర్ మారితే కొన్ని సార్లు పసుపు కలర్‌లో కనిపిస్తుంది. మరీ ఏదైనా మ్యాజిక్ జరిగితే ఆరెంజ్ కలర్‌లో కనిపిస్తుంది. కొన్ని సార్లు మేఘాలు పింక్, పర్పుల్ కలర్‌లోకి మారతాయి. అంతేకానీ, ఈ పింక్ మూన్ ఏంటని ఆలోచిస్తున్నారా..? నిజంగా చందమామ పింక్ కలర్‌లో కనిపించబోతుందట. అది కూడా ఎప్పుడో కాదు. ఈ రాత్రికే చందమామ కొత్త రూపంలో కనిపించనుందని సోషల్ మీడియాలో నెటిజన్స్ తెగ పోస్ట్‌లు పెడుతున్నారు.
ఈ పింక్ మూన్ స్టోరీ ఏంటి..?
ప్రతి యేటా ఏప్రిల్ నెలలో వచ్చే పౌర్ణమి చంద్రుడిని పింక్ మూన్ అని పిలుస్తారట. ఈ సమయంలో వచ్చే చంద్రుడికి రకరకాల పేర్లు ఉన్నాయి. దీనికి మైక్రో మూన్ అనే మరో పేరు కూడా ఉంది. ఏప్రిల్ అంటే వసంతకాలానికి ప్రారంభంలో వస్తుంది. అయితే చందమామను వసంత కాలానికి ముందుగా వికసించే పువ్వు అని కూడా పిలుచుకుంటారట. ఈ రోజు వచ్చే చందమామను ఖగోళ భాషలో అపోజీ అని కూడా పిలుస్తారట. సాధారణంగా వచ్చే పౌర్ణమి చంద్రుడి కంటే ఈ రాత్రి వచ్చే చందమామ చాలా చిన్నగా కనిపిస్తుందట. అందుకే దీన్ని మైక్రో మూన్ అని పిలుస్తారు.
నిజంగా పింక్ మూన్ కనిపిస్తుందా..?
ఖచ్చితంగా పింక్ మూన్ వస్తుందని చెప్పలేమని ఖగోళ శాస్త్రవెత్తలు చెబుతున్నారు. వసంతకాలానికి ముందుగా ఈ వచ్చే పౌర్ణమి చంద్రుడు కాబట్టి పింక్ మూన్ అనే పేరు వచ్చిందట. అయితే రోజు కనిపించినట్లు కాకుండా కాస్త కొత్తగా మాత్రం కనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఒకవేళ నిజంగానే పింక్ మూన్ కనిపిస్తే మాత్రం కాలమానాల్లో వచ్చే వ్యత్యాసాల వల్ల ముందుగా అమెరికాలోనే ఈ మైక్రో మూన్ కనిపించే అవకాశం ఉంది. రాత్రి కాగానే కనిపించకపోతే ఆదివానం తెల్లవారు జామున 3 నుంచి 5 గంటల మధ్యలో పింక్ మూన్ దర్శనం ఇచ్చే ఛాన్స్ ఉందట.