E-Paper
Advertisement

Ambani House Staff Salary: అంబానీ భవనంలో పని చేసే సిబ్బందికి అంత జీతమా? ఇక్కడ జాబ్ వస్తే లైఫ్ సెటిల్

Ambani House Staff Salary: అంబానీ భవనంలో పని చేసే సిబ్బందికి అంత జీతమా? ఇక్కడ జాబ్ వస్తే లైఫ్ సెటిల్
Advertisement

Ambani House Staff Salary: ఒకప్పుడు “అంబానీ” అనగానే మనకు షేర్ మార్కెట్, రిలయన్స్ కంపెనీ, బిజినెస్ సామ్రాజ్యం గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పేరు వినగానే అనేక మందికి ఆయన విలాస జీవనశైలి, అద్భుతమైన భవన నిర్మాణం, కొత్త టెక్నాలజీ వంటి అంశాలు గుర్తుకు వస్తున్నాయి. ఆయనకు ముంబై నగరంలో యాంటిలియా అనే 27 అంతస్తుల ఈ భవనం కూడా ఉంది.

భూకంపాలు వచ్చినా
ఇది ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నివాసాల్లో ఒకటిగా వెలుగొందుతోంది. దీని నిర్మాణం వెనుక ఉన్న వ్యయం? దాదాపు రూ. 15,000 కోట్లు. ఇది భూకంపాలు వచ్చినా పడకుండే ఉండేలా బలమైన నిర్మాణ శైలితో విలాసవంతమైన సౌకర్యాలతో నిర్మించారు. ఇవన్నీ యాంటిలియాను ఒక ప్రత్యేక స్థలంగా మార్చాయి. అయితే ఇలాంటి భవనంలో ఎంత మంది సిబ్బంది పనిచేస్తారు. వారికి జీతాలు ఎలా ఉంటాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

యాంటిలియా ఆకాశాన్ని తాకే కోట
నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ ఇంట్లో, కేవలం కుటుంబ సభ్యులు కాదు – దాదాపు 600 మంది సిబ్బంది కూడా పనిచేస్తారు. ఇక్కడ పనిచేసే అంబానీ ఇంటి వ్యక్తిగత డ్రైవర్లు నెలకు సుమారు రూ.2 లక్షలు సంపాదిస్తున్నారు. అంటే వార్షికంగా రూ.24 లక్షలు. ఇక చెఫ్‌లు, హౌస్ కీపింగ్ సిబ్బంది, ప్లంబర్లు మొదలైనవారు నెలకు రూ.1.5 నుంచి రూ.2 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ కోణంలో చూస్తే, యాంటిలియా ఓ పెద్ద కంపెనీలా కనిపిస్తుంది.

Read Also: Investment Tips: ఇందులో రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే.. …

Advertisement

అమెరికాలో కార్మికుల పిల్లలు
ఇక్కడ పని చేసే సిబ్బందికి బీమా, ఆరోగ్యపరమైన భద్రత, పిల్లల ట్యూషన్ రీయింబర్స్‌మెంట్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. అంతేకాదు కొందరి సిబ్బంది పిల్లలు అమెరికాలో చదువుతున్నారు. అంబానీ కుటుంబం అందుకు ఆర్థికంగా సహాయం చేస్తోంది.

భద్రతకే కోట్ల రూపాయల ఖర్చు
ఒక వ్యాపారవేత్త భద్రత కోసం ఇంత ఖర్చు చేస్తాడని ఎవరు ఊహించగలరా. కానీ ముఖేష్ అంబానీ విషయంలో ఇది సాధారణం. 2022లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు Z+ భద్రతను ఆమోదించింది. ఇది దేశంలో అత్యంత ప్రీమియమ్ భద్రతా కవరేజీ. ఇందులో NSG కమాండోలు, ముంబై పోలీసులు, CRPF సిబ్బంది సహా మొత్తం 55 మంది ప్రత్యేకంగా అంబానీ కోసం పనిచేస్తున్నారు. ఈ భద్రతా బృందాన్ని నిర్వహించేందుకు నెలకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అంబానీ ఖర్చు చేస్తున్నారు. అంటే సంవత్సరానికి కనీసం రూ.2 కోట్లకు పైగా ఖర్చవుతోంది. ఇదే భారతీయ Z+ భద్రత ఖర్చుల్లో అగ్రస్థానంలో ఉండటం విశేషం.

ప్రైవేట్ జెట్‌లు, కార్ల కలెక్షన్
ఇక్కడ భద్రత, నివాసం మాత్రమే కాదు. అంబానీ జీవితం ఒక Luxury Symphony లాంటిది. ఆయన వద్ద ఉన్న ప్రైవేట్ జెట్‌లు Boeing Business Jet, Falcon 900EX వంటి విమానాలు కోట్ల రూపాయల విలువైనవి. ఎప్పుడు, ఎక్కడికైనా ప్రయాణించేందుకు సిద్ధంగా ఉండే ఇవి. లగ్జరీ హోటల్ లాంటి ఫీచర్లతో ఉంటాయి. కార్ల విషయానికి వస్తే? ముంబైలో ట్రాఫిక్‌ జాం చేసే అంత లగ్జరీ కార్ల కలెక్షన్ అంబానీకి ఉంది. Rolls-Royce Cullinan, Bentley Bentayga, Mercedes-Maybach ఇవన్నీ అంబానీ గ్యారేజీలో రోజూ దర్శనం ఇస్తాయి. ఒక్క Rolls-Royce Cullinan విలువే రూ. 13 కోట్లు!

వివాహ వేడుకలు
ఇషా అంబానీ వివాహ వేడుకలు జరిగిన తీరు మరువలేం. బాలీవుడ్ తారల నుంచి ప్రపంచ నాయకుల వరకు ఈ వేడుకలో హాజరయ్యారు. ఆ వేడుకపై ఖర్చు దాదాపు రూ.700 కోట్లు. ప్రైవేట్ కాన్సర్ట్‌లో బీయాన్స్ పాటలు పాడటం, ప్రత్యేక విమానాల్లో అతిథుల రాక – ఇవన్నీ అంబానీ స్థాయిని చూపించాయని చెప్పవచ్చు.

Related News

Old Pension Scheme: ఓల్డ్ పెన్షన్ స్కీమ్.. కేంద్రం క్లారిటీ, వారే అర్హులు

ఆభరణాలకు పింక్ పేపరే ఎందుకు? దాని వెనుక ఉన్న రహస్యమేంటి?

ఆధార్, ఫోన్ నంబర్‌తో.. మీ UAN నంబర్‌ను క్షణాల్లో కనుక్కోండిలా

ఆషాడ వేళ పసిడి షాక్.. ఆశలకి బ్రేక్ వేస్తూ మళ్ళీ పైపైకి బంగారం ధరలు!

ఎల్పీజీ గ్యాస్‌కు చెక్.. ఇకపై ఇథనాల్‌తో కుకింగ్, కేంద్రం సన్నాహాలు మొదలు

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

Big Stories

Advertisement
×