Google map: మనం తెలియని రూట్ కు వెళ్లాలంటే టక్కున గుర్తుకు వచ్చేది గూగుల్ మ్యాప్. ఇది 90 శాతం వరకు కరెక్ట్ మార్గాన్నే చూపిస్తది.. కానీ కొన్ని కొన్ని సార్లు గూగుల్ మ్యాప్ ను నమ్ముకుంటే ప్రమాదం అంచున పడే ఆస్కారాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. గతంలో గూగుల్ ను నమ్ముకుని తప్పు దారికి వెళ్లిన వార్తలు మనం చాలానే చూసే ఉంటాం. గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని ప్రయాణికులు తప్పు మార్గాల్లోకి వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారు. 2024 నవంబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ వద్ద గూగుల్ ను నమ్ముకుని కన్ స్ట్రక్షన్ లో ఉన్న బ్రిడ్జి నుంచి కారు కింద పడి ముగ్గురు యువకులు మృతిచెందారు. తాజాగా తమిళనాడు రాష్ట్రం, కడలూరు జిల్లాలోని సోతికుప్పం సమీపంలో మద్యం మత్తులో ఉన్న యువత గూగుల్ మ్యాప్ పై ఆధారపడి సముద్రంలోకి కారు వెళ్లిన ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రాణం తీయబోయిన 'పందెం'.. నేరుగా సముద్రంలోకి…!
తమిళనాడులోని కడలూరులో ఘటన
సమయానికి మత్స్యకారులు కాపాడడంతో దక్కిన ప్రాణం
ఫ్రెండ్స్‌తో బెట్టింగ్ వేసుకుని కారును నేరుగా సముద్రంలోకి పోనిచ్చిన యువకుడు
నీటిలో కొద్ది దూరం వెళ్లిన తర్వాత నిలిచిపోయిన కారు
సముద్రంలో తేలుతున్న… pic.twitter.com/vGbHcDx6j4
— BIG TV Breaking News (@bigtvtelugu) September 12, 2025
చెన్నైకి చెందిన ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులు మద్యం సేవించారు. మద్యం సేవించిన మత్తులో కారును నడిపారు. గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి కడలూరులోని సోతికుప్పం సమీపంలో తీరం వెంబడి ప్రయాణించుకుంటూ ముందుకెళ్లారు. మ్యాప్ నేరుగా వారిని గమ్య స్థలం పేరుతో సముద్రానికి తీసుకెళ్ళింది. అదృష్టావశాత్తూ… అక్కడున్న జాలర్లు, స్థానికులు పసిగట్టి వెంటనే సముద్రంలోకి వెళ్ళిన కారును అందులో ఉన్న వారిని బయటికి తీసుకువచ్చారు. మొత్తం మీద గూగుల్ మ్యాప్ నమ్ముకుని మరోసారి అపసవ్య మార్గంలో ప్రయాణం చేసి ప్రమాదం పాలయ్యారు. గమనించిన మత్స్యకారులు వారిని సురక్షితంగా వారిని రక్షించారు. కారును కూడా ట్రాక్టర్ తో పైకి లాగి మత్స్యకారుల సహాయంతో సముద్రం నుండి వెలికితీశారు. వీరు కడలూరు పోర్టు నుంచి పరంగిపేట్టై వైపు సముద్రతీర మార్గంలో వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఫ్రెండ్ బెట్టింగ్ పెట్టుకుని కారును సముద్రంలోకి నడిపారనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ALSO READ: Water Found in Petrol: బురద నీళ్లు పోసి పెట్రోల్ అన్నారు.. ఆ బంకులో ఘరానా మోసం!
సముద్రతీర మార్గాల్లో ప్రయాణించేవారు చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. మద్యపానం చేసి వాహనాలు నడపడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. గూగుల్ మ్యాప్స్ వంటి టెక్నాలజీలు కొంత హెల్ప్ అయినప్పటికీ, వాటిని గుడ్డిగా నమ్మకుండా స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో, తీరప్రాంతాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత అవసరమని హెచ్చరిస్తున్నారు. ఈ సంఘటన నుండి యువత ఎంతో నేర్చుకోవాలని చెబుతున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం సరి కాదని సూచించారు.