పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోయించుకోవాలంటేనే వాహనదారులు భయపడే పరిస్థితి దాపురించింది. ఎక్కడ ఎలాంటి పెట్రోల్ అమ్ముతున్నారో తెలియక అయోమయానికి గురవుతున్నారు. పెట్రోల్ తక్కువగా వస్తే వచ్చింది, పెట్రోల్ అయితే చాలు అనే దుస్థితికి వచ్చారు. తాజాగా ఓ వ్యక్తి కారులో పెట్రోల్ కొట్టించుకుని ఇంటికి వెళ్లాడు. ఉదయం ఆఫీస్ కు వెళ్లడానికి కారు స్టార్ట్ చేస్తే కాలేదు. వెంటనే మెకానిక్ ను పిలిచి చెక్ చేయిస్తే, ఇంజిన్ లో వాటర్ ఉన్నట్లు తేలింది. ఒక్కసారిగా షాకైన కారు యజమాని నేరుగా పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి చెక్ చేయగా అసలు కథ బయటపడింది.
హైదరాబాద్ కు చెందిన మహేష్ అనే వ్యక్తి నిన్న రాత్రి (సెప్టెంబర్ 11) పూట తన బ్రెజా కారులో రంగారెడ్డి జిల్లా శేరిగూడలోని HP బంకులో పెట్రోల్ కొట్టించుకున్నాడు. నేరుగా ఇంటికి వెళ్లాడు. ఉదయం సమయంలో ఆఫీస్ కు వెళ్లేందుకు కారు తీయబోయాడు. ఎంతకీ కారు స్టార్ట్ కాలేదు. వెంటనే మెకానిక్ ను పిలిచాడు. అతడు కారును పరిశీలించి ఇంజిన్ లోకి నీళ్లు వెళ్లాయని చెప్పాడు. ఇంజిన్ డ్యామేజ్ అయినట్లు చెప్పాడు. ఒక్కసారిగా అతడు షాకయ్యాడు. వెంటనే ఆయనకు అనుమానం కలిగింది. రాత్రి పెట్రోల్ కొట్టించుకు శేరిగూడ HP బంకుకు వెళ్లాడు. బాటిల్ లో పెట్రోల్ కొట్టమన్నాడు. కొట్టగానే బంకు కథ బయటపడింది. బాటిల్ లో బురద నీళ్ల లాంటి పెట్రోల్ వచ్చింది కాసేపు అలాగే ఉంచితే కిందికి నీళ్లు, పైవైపు పెట్రోల్ తేలింది. బంకు సిబ్బందితో మహేష్ వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత కారుకు జరిగిన డ్యామేజ్ పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అటు అధికారులకు ఫిర్యాదు చేశాడు. పైగా అది ఒరిజిన్ పెట్రోల్ అంటూ బంకు సిబ్బంది వాగ్వాదానికి దిగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చేసిందే తప్పు, పైగా దబాయింపు ఏంటని వాహదారులు పైకి లేవడంతో సిబ్బంది వెనక్కి తగ్గారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
حیدرآباد میں پانی ملا ہوا پٹرول فراہم کرنے کا انکشاف — صارف اور پٹرول پمپ عملے کے درمیان تلخ کلامی
حیدرآباد کے شری گُڈا علاقے میں واقع HPCL پٹرول پمپ پر پانی ملا ہوا پٹرول فروخت کیے جانے کا واقعہ سامنے آیا ہے۔
رپورٹس کے مطابق، ایک شہری مہیش نے گزشتہ رات اپنے بریزا کار میں اسی… pic.twitter.com/dl6Pps1Llx
— Urdu Writes Breaking (@UrduWritesBreak) September 12, 2025
Read Also: చీర కొంగుతో నక్కను చంపేసిన మహిళ.. అరగంట పోరాడి..
అటు శేరిగూడ HP పంపు మీద గతంలోనూ పలుమార్లు కల్తీ ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. అప్పట్లో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కొంత మంది వాహనదారులు కంప్లైంట్ చేసినట్లు స్థానికులు వెల్లడించారు. ఇప్పుడు మళ్లీ ఇలాంటి ఘటన జరగడం చూస్తుంటూ, యాజమాన్యం తీరు మారినట్లు కనిపించడం లేదంటున్నారు. ఇప్పటికైనా తూనికలు, కొలతల అధికారులు ఈ బంక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వారిపై గట్టి చర్యలు తీసుకుంటేనే మిగతావారు భయపడే అవకాశం ఉందంటున్నారు.
Read Also: కారును తప్పించబోయిన రోడ్డు దాటి దూసుకెళ్లిన బస్సు, తృటిలో తప్పిన పెను ముప్పు!