జెఫ్రీ మాంచెస్టర్.. ఇతడి గురించి అమెరికన్ ప్రజలకు బాగా తెలుసు. ఎందుకంటే అతడు చేసిన పనులు అందరినీ గుర్తుచుకునేలా చేశాయి. అతడు మాజీ అమెరికా సైనికుడు మాత్రమే కాదు, నేరస్తుడు కూడా. జెఫ్రీని రూఫ్ మ్యాన్ లేదంటే రూఫ్ టాప్ రాబర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే, అతడు చేసే ప్రతి దొంగతనం ఒకేలా ఉండేది. భవనం పైకప్పు నుంచి లోపలికి ప్రవేశించి దొంగతనాలు, దోపిడీలు చేసేవాడు. ముఖ్యంగా మెక్ డోనాల్డ్స్ లాంటి ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లను లక్ష్యంగా చేసుకుని ఏకంగా 60 వరకు దొంగతనాలకు పాల్పడ్డాడు. పోలీసులకు దొరికి జైలు పాలైన ఆయన, 2004లో అక్కడి నుంచి తప్పించుకుని నార్త్ కరోలినా చార్లెట్ లోని టాయ్స్ ‘ఆర్’ అస్ స్టోర్ లో ఏకంగా 6 నెలల పాటు రహస్యంగా నివసించాడు. అదీ స్టోర్ లోని వారికి తెలియకుండా. ఈ ఘటన అప్పట్లో అమెరికాలో సంచలనం సృష్టించింది. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా సినిమాలు కూడా తీసేందుకు, పుస్తకాలు రాసేందుకు కారణం అయ్యింది.
1971లో కాలిఫోర్నియాలోని రాంచో కోర్డోవాలో జెప్రీ అలెన్ మాంచెస్టర్ జన్మించాడు. అతడు హైస్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన తర్వాత అమెరికన్ ఆర్మీలో చేరాడు. 82వ ఎయిర్ బోర్న్ డివిజన్ లో సర్వీసు చేశాడు. రాపెల్లింగ్, ఆయుధాల వినియోగానికి సంబంధించిన టెక్నిక్స్ పూర్తిగా నేర్చుకున్నాడు. వీటి ద్వారా ఆ తర్వాత దోడిపీలకు పాల్పడ్డం మొదలుపెట్టాడు. 1998లో అతడి నేర ప్రస్థానం మొదలయ్యింది. రాత్రి, లేదంటే పగటిపూట రూఫ్ ల ద్వారా లోపలికి ప్రవేశించి తుపాకీతో బెదిరించి డబ్బులు దోచుకెళ్లేవాడు. ఆయా సంస్థలలో పని చేసే ఉద్యోగులను వాక్ ఇన్ ఫ్రిజ్ లో లాక్ చేసేవాడు. కానీ, ఎవరికీ ఎలాంటి హాని చేసేవాడు కాదు. మర్యాదగా ప్రవర్తించేవాడు. అతడు కాలిఫోర్నియాతో పాటు మసాచుసెట్స్ వరకు కొనసాగాయి. 2000 మే 20న నార్త్ కరోలినాలో మెక్ డొనాల్డ్స్ దోపిడీ తర్వాత పోలీసులు పట్టుకున్నారు. 45 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు.
జైలుకు వెళ్లిన జెఫ్రీ మాంచెస్టర్ జూన్ 2004లో అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఆ తర్వాత చార్లెట్ లోని టాయ్స్ ‘ఆర్’ అస్ స్టోర్ లోకి చొరబడ్డాడు. స్టోర్‌లో 6 నెలల పాటు ఎవరికీ కనిపించకుండా దాచుకున్నాడు. అందులో బైక్ ర్యాక్ వెనుక ఒక రహస్య గది తయారు చేసుకున్నాడు. ఈ గది, దాదాపు 6×8 అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. తన రహస్య స్థావరం లోపల, మాంచెస్టర్ హాయిగా ఉండేవాడు. ఆ గదిలో స్పైడర్ మ్యాన్ షీట్లతో కూడిన మంచం, గోడలపై స్టార్ వార్స్ పోస్టర్లు, ఒక చిన్న బాస్కెట్ బాల్ హూప్. అలంకరణ కోసం బొమ్మలతో పాటు తన కోసం ఓ చిన్న వాటర్ పైప్ ఏర్పాటు చేసుకున్నాడు. స్టోర్ లోని వారి కంట కనబడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. పగటిపూట, స్టోర్ తెరిచి ఉన్నప్పుడు, ఉద్యోగులు తనను చూడకుండా దాక్కునేవాడు. తన ఆకలిని తీర్చుకునేందుకు దుకాణంలోని బేబీ ఫుడ్, స్నాక్స్ తినేవాడు. రాత్రిపూట, దుకాణం ఖాళీగా ఉన్నప్పుడు, వ్యాయామం కోసం బైకులు నడిపేవాడు. దుకాణం పైకప్పు మీద రిమోట్-కంట్రోల్డ్ కార్లతో ఆడుకునేవాడు. DVDలో క్యాచ్ మీ ఇఫ్ యు కెన్ లాంటి సినిమాలు చూసేవాడు. తను దాక్కున్న ప్రదేశానికి దగ్గరగా వచ్చే ఎవరైనా వినడానికి బేబీ మానిటర్లను ఉపయోగించేవాడు. కొన్నిసార్లు రెడ్ లాబ్ స్టర్ లాంటి ప్రదేశాలలో తినడానికి, స్థానిక చర్చికి బొమ్మలు ఇవ్వడానికి, జాన్ జోర్న్ అనే సీక్రెట్ ప్రభుత్వ ఏజెంట్‌గా నటిస్తూ రాత్రిపూట బయట తిరిగేవాడు.
స్టోర్ లో దాక్కున్న సమయంలోనే మాంచెస్టర్.. బయటికి వచ్చిన సమయంలో లీ వైన్ స్కాట్ అనే లేడీతో పరిచయం ఏర్పడుతుంది. ఆమె భర్తతో విడిపోయి తన బిడ్డలతో ఉంటుంది. ఇద్దరూ కొద్దికాలం పాటు సన్నిహితంగా ఉన్నారు. అతడు ఆమె పిల్లలతో సన్నిహితంగా ఉండేవాడు. దుకాణం నుంచి తెచ్చిన బొమ్మలను వారికి ఇచ్చేవాడు. అతడు డిసెంబర్ 26, 2024లో తను రహస్యంగా నివాసం ఉన్న టాయ్ దుకాణాన్ని దోచుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో ఇద్దరు ఉద్యోగులు తప్పించుకుని పోలీసులకు ఫోన్ చేశారు. అప్పటికే మాంచెస్టర్ అక్కడి నుంచి పారిపోతాడు. పోలీసులు ఆ దుకాణాన్ని సెర్చ్ చేసి మాంచెస్టర్ ఉన్న రహస్య గదిని కనుగొన్నారు. జనవరి 2005లో అతడిని పట్టుకుని జైలుకు పంపారు.
మాచెస్టర్ కథతో 2025లో ‘రూఫ్ మ్యాన్’ అనే సినిమా వచ్చింది. దీనిలో చానింగ్ టేటమ్ జెఫ్రీ మాంచెస్టర్ పాత్రలో నటించాడు. ఈ సినిమా చార్లెట్ లోనే షూట్ చేశారు. 2009లో ‘ది వరల్డ్స్ అస్టౌనిషింగ్ న్యూస్!’ టీవీ ఎపిసోడ్ లో అతడి కథ చూపించారు. 2024లో ఎలియనర్ హిస్టోరే రాసిన ‘ది రూఫ్ మ్యాన్: ది డబుల్ లైఫ్ అండ్ డేరింగ్ క్రైమ్స్ ఆఫ్ జెఫ్రీ మాంచెస్టర్’ అనే పుస్తకం విడుదలైంది. అతడి కథ సైనికులు సివిలియన్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఎదుర్కొనే సమస్యలు, నేరాలు, జైలు ఎస్కేప్‌ల గురించి ఆసక్తికరంగా ఉంటుంది.
Read Also: ఈ దేశంలో ఇంటర్నెట్ లేదు.. సోషల్ మీడియా లేదు.. ఇంకా పాత విధానాల్లోనే జీవిస్తున్న జనం!