BigTV English

Honeymoon Murder Case: హనీమూన్ జంట కేసు.. హత్యకు ముందు చివరి వీడియో, వైట్‌షర్ట్‌లో సోనమ్

Honeymoon Murder Case: హనీమూన్ జంట కేసు.. హత్యకు ముందు చివరి వీడియో, వైట్‌షర్ట్‌లో సోనమ్

Honeymoon Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం రేపింది ఇండోర్ జంట హనీమూన్ హత్య కేసు. ఈ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రాజారఘువంశీ హత్య ముందు చివరి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడిది సోషల్‌మీడియాలో విపరీతంగా ట్రెండింగ్ అవుతోంది.


దేశంలో సంచలనం రేపిన ఇండోర్ దంపతుల హనీమూన్ హత్య కేసుకు సంబంధించిన కొత్త వీడియో వెలుగులోకి వచ్చింది. రాజా రఘువంశీ హత్యకు అదే చివరి వీడియో. రాజా రఘువంశీ-సోనమ్ దంపతులు షిల్లాంగ్‌ను సందర్శించడానికి వెళ్లినప్పుడు ఓ యువకుడు వారిని షూట్ చేసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు.

రాజా-సోనమ్ దంపతులు డబుల్ డెక్కర్ బ్రిడ్జికి వెళ్లేటప్పుడు ఈ వీడియోలో రాజా-సోనమ్ రఘువంశీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. సోనమ్ వైట్‌షర్ట్ ధరించినట్టు అందులో స్పష్టంగా కనిపించింది. ఇంతకీ ఆ యువకుడు ఏం చెప్పాడు? దేవేంద్ర సింగ్ అనే యువకుడు ఈ వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ కొన్ని విషయాలు బయటపెట్టాడు.


‘‘తాను మే 23న మేఘాలయ డబుల్ డెక్కర్ రూట్ బ్రిడ్జికి ట్రిప్‌కి వెళ్లినప్పుడు రికార్డు చేశానని రాసుకొచ్చాడు. తాను కిందకు దిగుతున్నప్పుడు ఉదయం 9.45 గంటల సమయంలో రాజా-సోనమ్ పైకి వెళ్తున్నారు. వారి చివరి రికార్డింగ్ అని తాను అనుకుంటున్నానని రాసుకొచ్చాడు. ఈ కేసు చేధించడానికి మేఘాలయ పోలీసులకు సహాయపడుతుందని తాను ఆశిస్తున్నట్లు రాసుకొచ్చాడు’’.

ALSO READ: హరిద్వార్ రోడ్డులో రెచ్చిపోయిన యువకులు.. మహిళా బైక్ రైడర్‌పై

డబుల్ డెక్కర్ రూట్‌బ్రిడ్జి దగ్గరకు వెళ్లే ముందు రాజా-సోనమ్ దంపతులు నోగ్రిట్ గ్రామంలో రాత్రి బస చేశారు. హోమ్ స్టే చేసేందుకు ముందుగా రూమ్ బుక్ చేసుకోకపోవడంతో ఆ రాత్రి అక్కడే ఉంది ఆ జంట. మంగళసూత్రం, రింగు సూట్ కేసులో పెట్టింది. అదే మేఘాలయ పోలీసుల దర్యాప్తుకు కీలకమైంది.

‘‘రాజాను వీడియోలో చూసినప్పుడు అతడు చాలా బాధగా ఉన్నట్లు కనిపించాడని ప్రస్తావించాడు. సాధారణంగా కనిపించాడు కానీ, అతనికి దేనికోసం ఎదురుచూస్తుందో తెలియదన్నాడు. ఇండోర్ నుండి వచ్చిన మరో ముగ్గురు వ్యక్తులు కనిపించారు. ఈ జంట కంటే ముందు 20 నిమిషాల ముందు అక్కడకు చేరినట్టు పేర్కొన్నాడు’’.

ఇండోర్‌కి చెందిన రాజా రఘువంశీ తన భార్య సోనమ్‌తో కలిసి హనీమూన్ ట్రిప్ కోసం మేఘాలయ వచ్చాడు. షిల్లాంగ్‌కు వెళ్లినప్పుడు హత్యకు గురయ్యాడు. మే 23న రాజా రఘువంశీ వీసాడోంగ్ జలపాతం సమీపంలో హత్యకు గురయ్యాడు. జూన్ 2న అతడి మృతదేహం ఒక కాలువలో గుర్తించారు పోలీసులు.

రాజా శరీరంపై గాయాలు ఉండడంతో హత్యకు గురయ్యాడని నిర్థారించారు పోలీసులు. ఈ కేసులో భార్య సోనమ్ ప్రధాన నిందితురాలు. ఆమెని ఘాజీపూర్‌లోని ఒక దాబాలో అరెస్టు చేశారు. ఈ కేసులో మిగతా నిందితులు రాజ్ కుష్వాహా, ఆకాష్, విశాల్, ఆనంద్‌లను విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబధించి రేపో మాపో చార్జిషీట్ దాఖలు చేయనున్నారు ఇండోర్ పోలీసులు.

 

 

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×