BigTV English

The RajaSaab: తాత సంజయ్ దత్ అయితే.. మరీ ఓల్డ్ ప్రభాస్ లుక్ లో ఉన్నది ఎవరబ్బా ?

The RajaSaab: తాత సంజయ్ దత్ అయితే.. మరీ ఓల్డ్ ప్రభాస్ లుక్ లో ఉన్నది ఎవరబ్బా ?

The RajaSaab: ప్రభాస్.. వింటేజ్ ప్రభాస్.. డార్లింగ్ ప్రభాస్ .. రాజాసాబ్ ప్రభాస్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే పేరు కనిపిస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా నుంచి అప్డేట్ వస్తే ఆ మాత్రం పండగ లేకపోతే ఎలా.. ? అందులోనూ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రాజాసాబ్ టీజర్ వస్తే ఇంకెంత రచ్చ చేయాలి. ఇప్పుడు ఫ్యాన్స్ కూడా అదే రచ్చ చేస్తున్నారు. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలోప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ నటిస్తున్నారు.


 

మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా అని అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్ అందరూ గుండెలను చేతుల్లో పట్టుకొని తిరుగుతున్నారు. మారుతీ సినిమాలు అంటే.. హీరోకు ఏదో ఒక లోపం ఉండడం.. లేదా ఫ్యామిలీ సెంటిమెంట్ ఉండడం పక్కా. దీంతో ప్రభాస్ కు ఎలాంటి లోపం పెడతాడో అని భయం ఒకపక్క.. మొదటిసారి డార్లింగ్  డబుల్ రోల్ చేస్తున్నాడు.. ఇది కనుక మిస్ ఫైర్ అయితే మరింత ట్రోలింగ్ కు గురవుతారు అనే భయం ఇంకో పక్క ఉండడంతో.. దేవుడిమీదనే భారం వేసాం అని చెప్పుకుంటూ వచ్చారు.


 

ఇప్పటికే రాజాసాబ్ సినిమా తాత మనవడి కథ అని మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు. సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ లో కూడా ప్రభాస్ రెండు లుక్స్ లో కనిపించాడు. ఒకటి యంగ్ లుక్ కాగా.. రెండోది ఓల్డ్ లుక్. బ్లాక్ కలర్ డ్రెస్, నెరిసిన గడ్డం, జుట్టు.. నోట్లో సిగార్ పెట్టుకొని ఎంతో సీరియస్ లుక్ కనిపించిన ప్రభాస్ పోస్టర్ ను చూసి ఫ్యాన్స్.. ఈ సినిమాలో తాతగా కూడా డార్లింగ్ నే నటిస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చారు. అయితే కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయిన టీజర్ లో మాత్రం ప్రభాస్ తాతగా సంజయ్ దత్ ను చూపించారు.

 

” నా ఇల్లు నా దేహం.. ఈ సంపద నా ప్రాణం. నా తదానంతరం కూడా దీనిని నేనే అనుభవిస్తాను” అనే డైలాగ్ తో టీజర్ మొదలయ్యింది. క్లియర్ గా తాత పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నట్లు తెలిసిపోతుంది. తన ఇల్లును చనిపోయాక కూడా వదలకుండా ఆత్మలా కాపలాకాస్తున్న ఒక జమీందార్. ఇంకోపక్క ఒక మాములు జీవితాన్ని గడుపుతున్న మనవడు.. తాత ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ అతనికి ఎన్నో భయంకరమైన సంఘటనలు ఎదురవుతాయి. తాత ఆత్మను ఎలాగైనా పైకి పంపి.. ఆ ఇల్లును సొంతం చేసుకోవడానికి మనవడు ఆ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. మరి చివరకు తాత ఆస్తిని మనవడు సొంతం చేసుకున్నాడా.. ? ఎందుకు తాత ఆత్మగామారాడు.. ? చివరికి ఆత్మ పైకి వెళ్లిందా.. ? అనేది సినిమా కథగా తెలుస్తోంది.

 

ఇంకా టీజర్ మొత్తంలో యంగ్ లుక్ లోనే ప్రభాస్ కనిపించాడు. టీజర్ ను బట్టి చూస్తుంటే ప్రభాస్.. తన తాతగారిలా కనిపించడానికి మాత్రమే ఆ ఓల్డ్  గెటప్ వేసాడు కానీ, ఇందులో డబుల్ రోల్ లేదని తెలుస్తోంది. ఇన్నాళ్లు ప్రభాస్ డబుల్ రోల్ చేస్తున్నాడు అనేది నిజం కాదని టీజర్ ను బట్టి అర్ధమవుతుంది. పోస్టర్ లో చూపించిన ఓల్డ్ లుక్ సినిమాలో కచ్చితంగా ఉంటుందని, ఆత్మను భయపెట్టడానికో .. లేక ఎవరినైనా తానే జమిందార్ అని నమ్మించడానికో ఆ గెటప్ వేసి ఉంటాడని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఆ ఓల్డ్ లుక్ ఎవరై ఉంటారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×