Viral Video: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ హైవేపై కొంతమంది యువకులు రెచ్చిపోయారు. ఓ మహిళా బైక్ రైడర్‌పై అసభ్యంగా ప్రవర్తించారు. కొన్ని నిమిషాల పాటు ఆమెని అదే విధంగా వెంటాడారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది.
దేనికైనా ఒక హద్దు ఉంటుంది. అది దాటితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా టూరిస్టులు వచ్చే ప్రాంతాల్లో యువత జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తేడా వస్తే ఆ ప్రాంతానికున్న ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది.పైన కనిపిస్తున్న వీడియో అదే తెలియజేస్తోంది.
ఆదివారం రాత్రి దేవభూమిగా పేరుగాంచిన హరిద్వార్ మెయిన్ రోడ్డులో కొంతమంది యువకుల గుంపు రెచ్చిపోయింది. మటాడోర్ వాహనంపై చొక్కాలు విప్పి అర్థనగ్నంగా కనిపిస్తూ రెచ్చిపోయారు. ఆ సమయంలో అదే రోడ్డులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మహిళా బైక్ రైడింగ్ చేస్తూ వెళ్తోంది. ఆమెని చూసిన ఉత్సాహంలో మరింతగా రెచ్చిపోయారు.
ఫ్లైయింగ్ కిస్సుల తరహాలో వెకిలి చేష్టలకు దిగారు. పరిస్థితి గమనించిన ఆ రైడర్, తన సెల్‌ఫోన్‌తో వారిని చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఆ మహిళ తీసిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు ఆ మహిళ వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్‌ను షేర్ చేసింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూనే, ఆ పోస్ట్‌లో ఉత్తరాఖండ్ పోలీసులను ట్యాగ్ చేసింది.
ALSO READ: పాముతో చెలగాటమా.. నాలుకతో తాకుతూ చివరకు
నిందితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకునేలా వీడియోను షేర్ చేయాలని నెటిజన్స్ ని కోరింది. తాము ఉత్తరప్రదేశ్‌కు చెందిన గూండాలమని అన్నట్లు వినిపిస్తోంది. నెంబర్ ప్లేట్ ఆధారంగా ఆ కారు ఉత్తరప్రదేశ్‌కు చెందినట్టు తేలింది.
వీడియోలో రికార్డు అయిన కారు రిజిస్ట్రేషన్ నెంబర్ UP 15 EH 2344 ఉంది. అదే రూటులో పెట్రోల్ కారులో ఉన్న ఓ పోలీసు అధికారికి ఈ విషయాన్ని తెలియజేసింది. దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదని తెలుస్తోంది. ఈ వీడియోపై టూరిస్టులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవభూమి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని అంటున్నారు.
इतना वायरल करो कि
देवभूमि को कलंकित करने वाले ये दरिंदे पकड़े जाएंहरिद्वार में गंदी नश्ल क़े कीड़े रात में अधनंगे
होकर एक बाइक चला रही महिला को देखकर गंदे गंदे इशारे करने लगे, और भद्दी भद्दी बांतें बोलीं..ये हैवान बचने नहीं चाहिये वरना कल को कोई बड़ी वारदात भी करेंगे ✍️… pic.twitter.com/al7oKTscdI
— Deepak Sharma (@SonOfBharat7) June 15, 2025