Tollywood: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలను మొదలుకొని సామాన్యుల వరకు ప్రతి ఒక్కరు ఈ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ను వేదికగా మార్చుకుంటున్న విషయం తెలిసిందే . సినిమా విషయాలను మొదలుకొని.. తమ వ్యక్తిగత విషయాల వరకు అన్నింటిని అభిమానులతో పంచుకోవడానికి ఇది అతి పెద్ద వేదికగా నిలిచింది. అందులో భాగంగానే స్టార్ హీరోయిన్లు సైతం తమ చిన్ననాటి జ్ఞాపకాలను ఇప్పుడు అభిమానులతో ఒక్కొక్కటిగా పంచుకుంటూ వస్తున్నారు. ఇకపోతే నిన్న ఫాదర్స్ డే కావడంతో ఈ సందర్భంగా పలువురు హీరోలు, హీరోయిన్లు తమ తండ్రులతో కలిసి చిన్నప్పుడు దిగిన ఫోటోలను షేర్ చేస్తూ తమ తండ్రులకు ప్రత్యేకంగా ఫాదర్స్ డే విషెస్ తెలియజేశారు.
ఈ అమ్మాయిని గుర్తుపట్టారా?
ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ కూడా చిన్నప్పుడు తన తండ్రితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఈమె చిన్ననాటి ఫోటో చూసి అభిమానులు సంతోష పడిపోతున్నారు. తమ అభిమాన నటి చిన్నప్పుడు ఎలా ఉందో చూసి మురిసిపోతున్నారు. మరి ఇప్పటికే పైన కనిపిస్తున్న ఫోటోల అమ్మాయిని మీరు గుర్తుపట్టారా? ఈమె ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్..ఆమె ఎవరో కాదండి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). ఒకప్పుడు హిందీ పరిశ్రమలో కెరియర్ మొదలుపెట్టిన ఈమె అలా 2012లో వచ్చిన ‘ముజ్సే కుచ్ కెహెతి.. ఏ ఖామోషియాన్’ అనే హిందీ సీరియల్ ద్వారా నటన రంగంలోకి అడుగుపెట్టిన ఈమె.. 2014లో ‘విట్టి దండు’ అనే మరాఠి సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఇక తర్వాత మరాఠీ తో పాటు హిందీ , తెలుగు సినిమాలలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ.
ALSO READ:The Raja Saab Teaser: వింటేజ్ లుక్ లో అదరగొట్టేసిన ప్రభాస్.. ది రాజా సాబ్ టీజర్ రిలీజ్!
మృణాల్ ఠాకూర్ కెరియర్..
తొలిసారి హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquar Salman) నేరుగా తొలిసారి తెలుగులో చేసిన ‘సీతారామం’. ఈ సినిమాలో సీత క్యారెక్టర్ లో నటించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ముఖ్యంగా అచ్చం తెలుగమ్మాయిలా కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా తర్వాత నాని (Nani) తో ‘హాయ్ నాన్న’ సినిమా చేసి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది మృనాల్ ఠాగూర్. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో కలిసి ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమా చేసింది. కానీ ఈ సినిమా పెద్దగా విజయాన్ని అందించలేదు. తెలుగులో కూడా అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం సినిమా కోసం ఎదురుచూస్తున్న ఈమెకు అడివి శేషు (Adivi shesh) ‘డెకాయిట్’ రూపంలో అవకాశం లభించింది. మొదట ఇందులో శృతిహాసన్ (Shruthi Haasan) హీరోయిన్ గా నటించినా.. ఆమె తప్పుకోవడంతో ఆస్థానంలో మృణాల్ ను ఎంపిక చేసుకున్నారు. ఇక ఈ సినిమా హిట్ అయితే తప్ప ఈమె కెరియర్ కు మరో అవకాశం లేదు అనడంలో సందేహం లేదని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.