E-Paper
Advertisement

కూలింగ్ రావట్లేదని ఏసీ ఓపెన్ చేస్తే.. లోపల సీన్ చూసి టెక్నీషియన్ మైండ్ బ్లాక్!

కూలింగ్ రావట్లేదని ఏసీ ఓపెన్ చేస్తే.. లోపల సీన్ చూసి టెక్నీషియన్ మైండ్ బ్లాక్!
Advertisement

AC Servicing :బయట ఎండలు మండిపోతున్నాయ్ అని ఏసీ వేసుకొని ఎంచక్కా రిలాక్స్ అవుతున్నారా ?మధ్య మధ్యలో కూలింగ్ సరిగ్గా రావట్లేదని బాధ పడిపోతున్నారా, గ్యాస్ అయిపోయిందనో లేదా టెక్నికల్ ఇష్యూ అని అనుకుంటున్నారా? అయితే ఈ న్యూస్ గాని చదివారంటే మీరు వెంటనే మీ ఏసీ ఇండోర్, అవుట్‌డోర్ యూనిట్లను ఒకసారి చెక్ చేసుకోవడం గ్యారంటీ!

ఏసీ ఆన్ చేస్తే కూలింగ్ సున్నా.. 

Advertisement

ఎందుకంటారా ..అసలు విషయంలోకి వెళ్దాం.ఒక కస్టమర్ తన ఇంట్లోని ఎల్జీ (LG) ఏసీ సరిగ్గా పని చేయడం లేదని, కూలింగ్ అస్సలు రావడం లేదని టెక్నీషియన్‌ను పిలిపించారు. ఆర్మాన్ అనే ఏసీ టెక్నీషియన్ వచ్చి ఇండోర్ యూనిట్‌ను ఓపెన్ చేయగానే ఫ్యూజులు ఎగిరిపోయే దృశ్యం కనిపించింది. ఆ ఏసీ లోపల ఎలుకలు మాంచి రెస్ట్ రూమ్ నే ఏర్పర్చుకున్నాయ్ మరి.

also read :దృశ్యం3 ట్రైలర్ ఎలా ఉందంటే ..

Advertisement

ఇండోర్ యూనిట్‌లో ఎలుకల హల్‌చల్

మాములుగా ఎలుకలు కన్నాల్లో ఉంటాయన్న సంగతి మనకి తెల్సిందే.కాని అవి బోర్ కొట్టాయా లేక వెరైటీ గా ఉంటుందనుకున్నాయా తెలీదు కాని ఎలుకలు ఈ ఏసీ ఇండోర్ యూనిట్‌ ని కబ్జాపెట్టేశాయ్.అంతే కాదండోయ్ .. బయట నుంచి ప్లాస్టిక్ ముక్కలు, పేపర్ ముక్కలు, చెత్తాచెదారం మోసుకొచ్చి ఏసీ లోపల ఫుల్ గా నింపేశాయి కూడా.కబ్జాపెట్టేశాం గా మనల్ని అడిగేదెవరు అనుకున్నాయేమో కాబోలు. అంతటితో ఆగలేదండోయ్ …అంతా మా ఇష్టం అంటూ స్వింగ్ మోటార్ వైర్లను కొరికేశాయ్.

ఇంకేం ఏసీ ఆన్ అయినా గాలి రావడం ఆగిపోయింది. సెన్సార్ వైర్లను కూడా ముక్కలు చేయడంతో టెక్నీషియన్ వాటిని రీప్లేస్ చేయాల్సి వచ్చింది. ఇక ఎలుకలు కొరికిన ప్లాస్టిక్ ట్రేని అతికించడానికి ఆ టెక్నీషియన్ ఏకంగా ఎమ్‌సీల్ (M-seal) వాడాల్సి వచ్చిందంటే ఎలుకలు తమ పళ్ళకి ఎ రేంజ్ లో పని పెట్టాయో అర్థం అవుతుంది.

అవుట్‌డోర్‌లో కందిరీగల అటాక్

లోపల ఎలుకల గోల అయ్యిందని బయటికి వచ్చి అవుట్‌డోర్ యూనిట్ చెక్ చేయడానికి వెళ్లిన టెక్నీషియన్‌కు ఇంకో పెద్ద షాక్ తగిలింది.అక్కడ వందల సంఖ్యలో కందిరీగలు పెద్ద పెద్ద గూళ్ళు కట్టుకొని ఉన్నాయ్ మరి.అతను ఏ మాత్రం కేర్ లెస్ గా ఉన్నా అవి ఎటాక్ చేయడం పక్కా. ఇక ఇది గమనించే ‘రెడ్ హిట్’ స్ప్రే ఇచ్చాడు కస్టమర్.ఇక ఆ స్ప్రే సహాయంతో, ప్రాణాలకు తెగించి ఆ గూడును తొలగించాడు. మొత్తానికి రిపేర్ చేయడానికి వెళ్ళిన  ఆ టెక్నీషియన్ అక్కడ ఒక యుద్దమే చేశాడు.ఇపుడు ఆ యుద్దమే నెట్టింట వైరల్ అవుతోంది.

ఏసీలను కేవలం వాడటమే కాదు, క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించడం చాలా అవసరం అని ఈ ఇన్సిడెంట్ మరోసారి ప్రూవ్ చేస్తుంది.సో మీ ఇంట్లో కూడా AC సరిగ్గా కూలింగ్ రాకపోతే లోపల ఏమైనా ఎలుకలు, కందిరీగలు కబ్జా పెట్టాయేమో ఒకసారి చెక్ చేసుకొండి.ఓకేనా !

also read :విజయ్-త్రిష మెహందీ వేడుకలో నేను డ్యాన్స్ చేస్తా: బాలీవుడ్ క్వీన్ ఓపెన్ ఆఫర్!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×