Water On Mars : మానవులకు తెలిసినంత వరకు ప్రస్తుతానికి భూమి మీద తప్పా.. మరెక్కడ నీటిజాడలు కనుక్కోలేదు. జీవం పుట్టకకు నీదే ప్రాణాధారమనేది శాస్త్రవేత్తల నమ్మకం. అందుకే మనకు తెలిసిన చంద్రుడితో సహా ఇతర గ్రహాల మీద నీటి ఆనవాళ్లు ఏమైనా ఉన్నాయా? అని నిత్యం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మన సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహమైన అరుణ గ్రహం మీద విస్తారమైన నీటి ఆనవాళ్లను శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ఈ విషయం ఖగోళ పరిశోధకుల్లో సరికొత్త ఆశల్ని చిగురించేలా చేస్తోంది.
ఎత్తైన మట్టి దిబ్బలు, దుమ్ము, ధూళితో అరుణ వర్ణంలో మెరిసిపోయే మన అంగారక గ్రహం.. ఒకప్పుడు విశాలమైన సముద్రాలు, పాయలుగా పారిన నదీ జలాలతో నిండిపోయి ఉండేదంటే నమ్ముతారా. అక్కడి నేలపై.. బీచ్ లు ఉన్నాయని, అవి నీటి అలల తాకిడికి గురయ్యాయని కనీసం ఊహించగలమా.. కానీ అది జరిగిందంటున్నారు శాస్త్రవేత్తలు. ఇటీవల నిర్వహించిన అనేక పరిశోధనల్లో ఆ విషయం స్పష్టమైందని చెబుతున్నారు.
కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రస్తుతం మనం చూస్తున్నట్లుగా అంగారక గ్రహం దుమ్ము కొట్టుకొని పోయి ఏమీ లేదు. ఇలా చెప్పేందుకు ఈ గ్రహం భూమి పొరల్లో ఆనవాళ్లు సజీవంగానే ఉన్నాయంటున్నారు. మార్స్ గ్రహంలోని ఉత్తర గోళంలో వేల ఏళ్ల నాడు.. పుష్కలంగా నీరు ప్రవహించినట్టు స్పష్టం చేసే గుర్తులను కనుగొన్నారు. ఇప్పటి వరకు దీనిని నార్త్ సీ అని పిలుస్తుస్తుండగా.. పరిశోధనా బృందం ఈ పురాతన సముద్రానికి డ్యూటెరోనిలస్ అని పేరు పెట్టింది.
మార్స్ పై డెల్టా ప్రాంతాలను కూడా కనుగొన్నారు. జెజెరో క్రేటర్ ప్రాంతంలో డెల్టా నదుల ఆనవాళ్ళను గుర్తించారు. అలాగే అంగారక గ్రహం లోని కొన్ని ప్రాంతాల్లో క్లే, సల్ఫేట్ జాడల్ని కూడా పరిశోధక పరికరాలు కనుక్కున్నాయి. ఇవి.. కేవలం సముద్రాలు, నదులు కలిసే ప్రాంతాల్లోనే ఏర్పడే అరుదైన సమ్మేళనాలు. దాంతో.. గతంలో ఇక్కడ నదీ, సముద్ర ప్రవాహాలు ఉన్నాయనే ఆలోచనలకు మరింత బలం చేకూర్చుతున్నాయని అంటున్నారు.
ప్రస్తుతం కనిపిస్తున్న భౌగోళిక సాక్షాల ఆధారంగా శాస్త్రవేత్తలు మార్స్ గ్రహం పై ఒకప్పుడు అతిపెద్ద సముద్రంతో పాటు భారీగా నీటి నిల్వలతో ఉన్న నదుల ప్రవాహాలను ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. అయితే కాలక్రమంలో మార్స్ వాతావరణంలో వచ్చిన భారీ మార్పుల కారణంగా ఈ సముద్రాలు, నదీ జలాలు అంతరించిపోయి ఉంటాయని అనుమానిస్తున్నారు. అయినా ఇప్పటికీ మాస్ భూమి పొరల్లో ఆనాటి నీటి ఆనవాళ్లు సజీవంగా ఉన్నాయన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇదే విషయాన్ని గ్రౌండ్ పెనెట్రీటింగ్ రాడార్ సాంకేతిక ఉపయోగించి శాస్త్రవేత్తలు శాస్త్రీయంగా నిరూపించారు. భూమి పొరల్ని విశ్లేషించే ఈ సాంకేతికతతో పొరల్లో నీటి కారణంగా.. ప్రత్యేక పొరలుగా రూపుదిద్దుకున్న పొరల్ని గుర్తించారు. ఇవి దాదాపు నాలుగు బిలియన్ సంవత్సరాల క్రితం అంతరించిపోయిన సముద్ర తీర ప్రాంతాలకు గుర్తులు అని చెబుతున్నారు.
చైనాకు చెందిన జురాంగ్ రోవర్ నుంచి వచ్చిన డేటా ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ విషయాల్ని వెల్లడించారు. కాగా… ఈ ఉపగ్రహం.. జురాంగ్ యూటోపియా క్లారిటీయా ప్రాంతాన్ని అన్వేషించినప్పుడు దాన్ని రాడార్ ద్వారా ఉపరితలం నుంచి 80 మీటర్ల దిగువకు స్కాన్ చేశారు. ఇందులోనే భూమి పొరల్లో దాగి ఉన్న గతకాలపు నీటి అవశేషాలు తాలూకు భూమి పొరల మార్పులను కనిపెట్టేశారు.
ఈ ప్రయోగమే కాదు.. 2018లో మార్స్ ఎక్సప్రెస్ ఉపగ్రహం మార్స్ దక్షిణ ధృవంలోని ఒకటి పాయింట్ దగ్గర ఐదు కిలోమీటర్ల లోతులో ఒక భారీ నీటి సరస్సు ఉన్నట్లు గుర్తించింది. ఆ సరస్సు పూర్తిగా మంచుతో కప్పబడి ఉండే అవకాశాలున్నట్లు తెలిపింది. ఇది మార్స్ పై ద్రవనీరు ఉందని గుర్తించిన అనేక పరిశోధనలో కీలకమైన పరిశోధనగా చెబుతుంటారు. ఈ నీటి సరస్సు దాదాపు 20 కిలోమీటర్ల వ్యాసంలో ఉందనే.. నమ్మశక్యం కాని విషయాన్ని గుర్తించారు.
అలాగే మార్స్ ఆటోస్ఫెరె అండ్ వొలటైల ఎవల్యూష మిషన్ ద్వారా మార్స్ ఉపరితలం మీద గాలిలో నీటి ఆవిరి ఉన్నట్లుగా తొలిసారి శాస్త్రవేత్తలు 2015 లో గుర్తించారు. ఇక 2021లో పర్సివరస్ రోవర్ మార్స్ పైన జెజెరో క్రేటర్ అనే ప్రాంతంలో పరిశోధన సాగించింది. ఈ ప్రాంతంలోని పురాతన కాలంలో అక్కడ ప్రవహించిన ప్రాచీన సరస్సులు, సముద్రాల నీటి జాడలను కనిపెట్టింది.
ఇలా అనేక పరిశోధనలో క్రమంగా మార్క్స్ గ్రహం మీద గతంలో ఉన్న భారీ నీటి జాడలు బయటపడుతున్నాయి. ఇవి రానున్న కాలంలో అక్కడ నిర్వహించనున్న మరిన్న ప్రయోగాలకు మార్గనిర్దేశం చేయనుంది.