AFG vs ENG: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా… ఇవాళ జరిగిన మ్యాచ్ లో… ఆఫ్ఘనిస్తాన్ టీం అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. ఎవరు ఊహించని విధంగా… ఇంగ్లాండ్ జట్టును దారుణంగా ఓడించింది. అంచనాలను తలకిందులు చేసే… ఆఫ్ఘనిస్తాన్ టీం… గత కొన్ని సంవత్సరాలుగా దుమ్ము లేపుతున్న సంగతి తెలిసిందే. మొన్న టి20 వరల్డ్ కప్ సమయంలో కూడా రచ్చ చేసింది ఆఫ్గనిస్తాన్. ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… సెమీ ఫైనల్ కు వెళ్లాల్సిన కీలకమైన మ్యాచ్లో గెలిచింది ఆఫ్గనిస్తాన్.
Also Read: Afg vs Eng: 177 పరుగులతో రెచ్చిపోయి ఇబ్రహీం కొత్త చరిత్ర … ఇంగ్లాండ్ ముందు కొండంత టార్గెట్ ?
బజ్ బాల్ అంటూ విర్రవీగిన ఇంగ్లాండు టీం ను ఎనిమిది పరుగుల తేడాతో ఓడించింది ఆఫ్ఘనిస్తాన్. ఇక ఆఫ్గనిస్తాన్ దెబ్బకు… అధికారికంగా చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నుంచి ఇంగ్లాండ్ వైదొలగాల్సి వచ్చింది. ఇక ఇటు… ఈ టోర్నమెంటులో మొదటి విజయాన్ని నమోదు చేసుకున్న ఆఫ్ఘనిస్తాన్… రెండు పాయింట్లు సాధించి… సెమిస్ వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకుంది. ఇవాల్టి మ్యాచ్ లో మొదట ఆఫ్ఘనిస్తాన్ టీం బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే.
బ్యాటింగ్ చేసిన జట్టు కచ్చితంగా ఈ గడాఫీ స్టేడియంలో గెలుస్తుందని… ఇవాళ ఉదయం క్రికెట్ విశ్లేషకులు చెప్పారు. దానికి తగ్గట్టుగానే ఆఫ్ఘనిస్తాన్ కూడా మొదట బ్యాటింగ్ చేయడం జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో… 7 వికెట్లు నష్టపోయి 325 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఇబ్రహీం జడ్రన్ 177 పరుగులు చేసి దుమ్ము లేపాడు. 40 పరుగులు చేయకముందే మూడు కీలక వికెట్లు కోల్పోయిన ఆఫ్గనిస్తాన్ జట్టును… 325 పరుగుల వరకు తీసుకువచ్చాడు ఈ యంగ్ క్రికెటర్ ఇబ్రహీం. 146 బంతుల్లో 177 పరుగులు చేసిన ఇబ్రహీం.. ఇందులో 12 బౌండరీలు అలాగే ఆరు సిక్సర్లు బాదాడు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ టీం కెప్టెన్ షాహిదీ 40 పరుగులు చేయగా.. చివర్లో మహమ్మద్ నబి కూడా రాణించాడు. దీంతో 325 పరుగులు చేసింది ఆఫ్గనిస్తాన్. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో… ఇంగ్లాండ్ టీం కూడా గట్టి పోటీ ఇచ్చింది. కానీ టాపోర్టర్ అలాగే మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు పెద్దగా ఆడక పోవడంతో… 8 పరుగుల తేడాతో ఓడిపోవలసి వచ్చింది ఇంగ్లాండ్.
ఇంగ్లాండ్ ఆటగాళ్లలో రూట్ 111 బంతుల్లో 120 పరుగులు చేసి రఫ్ ఆడించాడు. అలాగే కెప్టెన్ జోస్ బట్లర్ 38 పరుగులు, ఓవర్ టన్ 32 పరుగులు చేసినప్పటికీ చివర్లో ఏ ఆటగాడు కూడా నిలువలేదు. దీంతో ఆస్కింగ్ రేట్ విపరీతంగా పెరగడంతో… ఇంగ్లాండ్ ప్లేయర్లు చేతులెత్తేశారు. ఈ తరుణంలోనే 49.5 ఓవర్లలోనే… 317 కు ఆల్ అవుట్ అయింది ఇంగ్లాండ్. దీంతో ఎనిమిది పరుగుల తేడాతో ఆఫ్గనిస్తాన్ గెలిచింది. ఆఫ్ఘనిస్తాన్ టీం గెలవడంతో ఇంగ్లాండ్ ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి చోటుచేసుకుంది. ఇక చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటులో.. రెండు సెమిస్ బెర్తుల కోసం… దక్షిణాఫ్రికా , ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మూడు జట్లు తలపడబోతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ తన తర్వాతి మ్యాచ్ ఆస్ట్రేలియా తో ఆడుతుంది. అందులో గెలిచిన జట్టు నేరుగా సెమీ ఫైనల్ కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది.
— Out Of Context Cricket (@GemsOfCricket) February 26, 2025