Jobs : చేస్తే సాఫ్ట్‌వేర్ జాబే చేయాలి. వాళ్లకైతేనే నెలకు లక్షకు పైనా జీతం వస్తుంది. లైఫ్ బిందాస్. వీకెండ్స్ హాలిడేస్. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఫ్లాట్లు, పొలాలు గట్రా కొనొచ్చు. ఈజీగా పెళ్లి అయిపోతుంది. మంచిగా సెటిల్ అవ్వొచ్చు. ఇలా ఐటీ కెరియర్ చాలామందికి డ్రీమ్ జాబ్. అందుకే, అమీర్‌పేట్ గల్లీల్లో నిత్యం వేలాది మంది కోచింగ్ తీసుకుంటుంటారు. ఒక్కసారి జాబ్ కొట్టేస్తే.. ఇక వందేళ్లు హాయిగా బతికేయొచ్చని కలలు కంటుంటారు.
ఐటీ జాబ్ తర్వాత అంతటి క్రేజ్ ఉండేది గవర్నమెంట్ ఉద్యోగాలకే. కాకపోతే, అవి చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. లక్షలాది మంది నిరుద్యోగుల నుంచి పోటీ ఉంటుంది. జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో తెలీదు. చాలా కష్టం గవర్నమెంట్ జాబ్ అంటే.
వామ్మో.. నెలకు రూ.7 లక్షల జీతమే..
ఐటీ జాబ్ అయినా, ప్రభుత్వ ఉద్యోగమైనా.. నెలకు గరిష్టంగా ఎంత జీతం వస్తుంది? మహా అంటే లక్ష. చాలా సీనియర్ అయితే ఐటీలో 2, 3 లక్షల వరకూ శాలరీ ఇస్తారు. నెలకు మాగ్జిమమ్ 4 లక్షల ప్యాకేజ్ చాలా అరుదనే చెప్పాలి. అదే, చాలా సింపుల్ జాబ్. నెలకు 7 లక్షల జీతం. వర్క్ ప్రెజర్ కూడా ఉండదు. కోడింగ్ గట్రా తెలియాల్సిన పని లేదు. బీపీలు, షుగర్లు వచ్చే పరిస్థితి ఉండదు. హాయిగా ఏసీలో కూర్చొని చేయదగిన ఉద్యోగం. మనకింద మస్త్ మంది పనోళ్లు ఉంటారు. వారిని చూసుకోవడమే ఆ జాబ్. అంతే. ఇంత సింపులే ఆ జాబ్. ఈ పనికే నెలకు రూ.7 లక్షలు జీతం ఇస్తామంటున్నారు దుబాయ్, అబుదాబీకి చెందిన రెండు రిచ్ ఫ్యామిలీస్. అసలే దుబాయ్ షేక్‌లు.. వాళ్లకు ఆ జీతం ఇవ్వడం ఓ లెక్కనా..?
జాబ్ న్యూస్ వైరల్
ఏడాదికి రూ.84 లక్షల వేతనం ఇస్తాం.. వాంటెడ్ హౌజ్ మేనేజర్స్ అంటూ ఆన్‌లైన్‌లో పోస్ట్ పెట్టింది దుబాయ్‌కు చెందిన రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ‘రాయల్ మైసన్’. వెంటనే ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. మేమంటే మేం చేస్తాం అంటూ ఆ కంపెనీకి వేలాదిగా కాల్స్, మెసేజెస్ పెడుతున్నారట.
ఈ అర్హతలు తప్పనిసరి..
మన దగ్గర అంబానీ, అదానీలాంటి వాళ్ల మాదిరే.. దుబాయ్‌లో ఉండే అతి సంపన్నుల ఇళ్లల్లో గృహ సిబ్బందిని నియమించడంలో రాయల్ మైసన్‌కు మంచి పేరుంది. అలా, దుబాయ్‌లో, అబుదాబిలో ఉండే ఇద్దరు ధనవంతుల ఇళ్లల్లో హౌజ్ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. లగ్జరీ గృహ కార్యకలాపాలను నిర్వహించడం.. హౌజ్ కీపింగ్ స్టాఫ్‌ను పర్యవేక్షించడం.. ఇంటి నిర్వహణను సమన్వయం చేయడం.. లాంటి పనులు ఆ హౌజ్ మేనేజర్లు చేయాల్సి ఉంటుంది. మంచి నాయకత్వ లక్షణాలు, మల్టీ టాస్కింగ్ స్కిల్స్, కమిట్‌మెంట్, సిన్సియారిటీ ఉన్న వ్యక్తులు ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చని అంటోంది. తమకు అర్జెంట్ రిక్వైర్‌మెంట్ ఉందని.. ఎంపికైన ఉద్యోగి వెంటనే విధుల్లో చేరాల్సి ఉంటుందని తెలిపింది.
ఎలా అప్లై చేయాలంటే..
నెలకు రూ. 7 లక్షల జీతం అంటూ.. కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో జీతం ఆఫర్ చేస్తుండటంతో.. చాలా మందే టెంప్ట్ అవుతున్నారట. రాయల్ మైసన్ కంపెనీకి నాన్‌స్టాప్ ఫోన్లు చేస్తున్నారట. అయితే, ఎవరూ కాల్స్ చేయొద్దని.. అర్హులైన వాళ్లు కేవలం ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలంటూ మరో ప్రకటన కూడా ఇవ్వాల్సి వచ్చింది ఆ కంపెనీ. అట్లుంటది మరి డిమాండ్ రూ.7 లక్షల జీతం అనేసరికి.