E-Paper
Advertisement

గుట్టు చప్పుడు కాకుండా గుడుంబా తయారీ.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!

గుట్టు చప్పుడు కాకుండా గుడుంబా తయారీ.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!
Advertisement

Police Operation: స్వేచ్చ బ్యూరో: మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ ఆదేశాల మేరకు రూరల్ సీఐ అంజలి ఆధ్వర్యంలో రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బజానా తండా గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఉదయం 5:20 గంటల నుంచి 7:30 గంటల వరకు చేపట్టిన తనిఖీల్లో పోలీసులు గ్రామంలోని సుమారు 120 ఇళ్లను, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

బాధ్యులపై కేసులు నమోదు..

ఈ సందర్భంగా సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 15 వాహనాలను గుర్తించారు. అలాగే అక్రమంగా నిల్వ ఉంచిన 100 కిలోల నల్ల బెల్లం, 20 లీటర్ల గుడుంబా, 20 కిలోల పట్టిక, 16 బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అదనంగా సుమారు 200 లీటర్ల బెల్లం ఊటను అక్కడికక్కడే ధ్వంసం చేశారు. స్వాధీనం చేసిన వస్తువులకు సంబంధించి బాధ్యులపై కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Also Read: Telangana Weather: నైరుతి రుతుపవనాలు.. తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక, రాబోయే 48 గంటలు జాగ్రత్త

గుడుంబా తయారీ..

తనిఖీల అనంతరం గ్రామస్తులకు దొంగతనాలు, చైన్ స్నాచింగ్, రోడ్డు ప్రమాదాల నివారణ, హెల్మెట్ వినియోగం, చెరువుల్లో ఈత వల్ల కలిగే ప్రమాదాలు, గంజాయి దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారం, గంజాయి విక్రయాలు, గుడుంబా తయారీ వంటి అసాంఘిక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఫోర్స్, క్యూ ఆర్ టీ ఫోర్స్, ఏఆర్ మహిళా పోలీస్ సిబ్బందితో కలిపి మొత్తం 40 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Also read: మళ్లీ ‘బాలయ్య వర్సెస్ నాగ్’.. 2027 సంక్రాంతి రేసులో మైండ్ బ్లోయింగ్ క్లాష్!

Related News

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

ఆమె మా బోధన్ కోడలు.. కవిత పై మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో ఓటర్ల వెరిఫికేషన్.. నోటీసులిచ్చినా దక్కని స్పందన!

Big Stories

Advertisement
×