Shocking Discovery: బంగారు గుడ్లు పెట్టే బాతు. చాలా మంది చిన్నప్పుడు ఈ కథ చదువుకునే ఉంటారు. ఓ పిసినారి గురించి చెప్తూ వివరించిన ఈ కథ చాలా ఫేమస్. బాతు పెట్టిన బంగారు గుడ్డు తీసుకోవాలే తప్ప, కోస్తే బంగారు గుడ్లు బయటపడుతాయని ఆశపడితే, బాతు లేకుండా పోతుందని గుర్తించుకోవాలి అనేది ఆ స్టోరీ సారాంశం. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ పూర్తి డిఫరెంట్ గా ఉంటుంది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే..
తాజాగా మాంసం తినాలి అనిపించి, ఓ వ్యక్తి బాతును కోశాడు. ఈకలు అన్నీ పీకేసి, చక్కగా కాల్చాడు. పసుపు రుద్ది కడిగి, కత్తి తీసుకుని కోయడం మొదలు పెట్టాడు. పొట్ట ఓపెన్ కాగానే షాకయ్యాడు. బాతు కడుపులో బంగారం బయటపడింది. ఈ ఘటన చైనా హునాన్ ప్రావిన్స్ లోని లాంగ్ హుయ్ కౌంటీలో జరిగింది. లియు అనే వ్యక్తి బాతు కడుపులో బంగారం బయటపడినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. బర్నింగ్ టెస్ట్ లో ఆ బంగారం నిజమైనదని తేలింది. బంగారు ముక్కలు దాదాపు 10 గ్రాముల బరువు కలిగి ఉంది. దీని ధర 12,000 యువాన్లు, భారత కరెన్సీలో రూ. 1,62,000గా తేలింది.
ఈ ఘటన పట్ల లియు, అతడి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశాడు. రాబోయే మంచి రోజులకు గుర్తుగా భావిస్తున్నారు. గతంలో బంగారు తవ్వకాలకు ప్రసిద్ధి చెందిన నది దగ్గర ఆయన బాతులు పెరిగాయి. బంగారం బురదను మింగి ఉండటం వల్ల కడుపులో ఈ బంగారం ఏర్పడి ఉంటుందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. శరీరం బంగారాన్ని జీర్ణం చేసుకోలేదు. అలాగని గ్రహించలేదు. ఇది సాధారణంగా జీర్ణవ్యవస్థ ద్వారా హాని కలిగించకుండా వెళుతుంది. అయితే, పెద్ద బంగారు ముక్కలు జంతువులు, మానవులలో పేగుల్లో అడ్డంకులుగా మారుతాయి.
బాతు కడుపులో బంగారం బయట పడటం ఇదే తొలిసారి కాదని, ఇంతకు ముందు తమ గ్రామంలో కొంత మంది బాతుల కడుపులో బంగారం బయటపడిందన్నారు. వారితో పోల్చితే, తమ బాతు కడుపులో ఎక్కువ బంగారం బయటపడినట్లు చెప్పారు.
ఈ ఘటనకు సంబంధించి లాంగ్ హుయ్ కౌంటీ నేచురల్ రిసోర్సెస్ బ్యూరో జియుపాయ్ కీలక విషయాలు వెల్లడించారు. గత సంవత్సరం ఇదే నది ఒడ్డున ఇసుకను కడుగుతున్నప్పుడు గ్రామస్తులు 10 గ్రాముల కంటే ఎక్కువ బంగారాన్ని కనుగొన్నారని చెప్పారు. కౌంటీ లోని చెన్‌షుయ్ నది ఉత్తరం నుంచిదక్షిణం వరకు ప్రవహిస్తుంది. ఒకప్పుడు బంగారం కనుగొనబడిన ప్రదేశం ఇది. 1970-1990 మధ్య కాలంలో అధికారులు ప్రైవేట్ మైనింగ్‌ను నిషేధించారు. కానీ, ఆ ప్రాంతంలోని నది పరిసరాల్లో ఉండే పక్షులు, జంతువుల కడుపులలో బంగారం ఉన్నట్లు తరచుగా తేలుతోంది. ప్రస్తుతం ఈ బంగారు బాతు కథ ఆ ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారింది.
Read Also: వాసన చూసి క్యాన్సర్ కనిపెట్టిన పెంపుడు కుక్క, దంపతుల ప్రాణాలు దక్కాయి