E-Paper
Advertisement

Sircilla Crime: ఇంత ఘోరమా.. మూడేళ్ల చిన్నారిని చితకబాదిన అంగన్‌వాడి టీచర్

Sircilla Crime: ఇంత ఘోరమా.. మూడేళ్ల చిన్నారిని చితకబాదిన అంగన్‌వాడి టీచర్
Advertisement

Sircilla Crime: సిరిసిల్ల జిల్లాలో అంగన్‌వాడీ టీచర్ చిన్నారిపై చూపిన అమానుషం నిజంగా గుండెను కలిచివేసే ఘటన. అక్షరాలు నేర్పించాల్సిన చేతులే.. అభం శుభం తెలియని మూడేళ్ల బాలుడిపై ప్రతాపం చూపడం విద్యావ్యవస్థలోని లోపాలను, కొందరు సిబ్బందిలోని క్రూరత్వాన్ని ఎత్తిచూపుతోంది.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. స్వగ్రామానికి చెందిన విజయకుమార్, లక్ష్మి దంపతుల కుమారుడు విద్వాన్ (3) స్థానిక అంగన్వాడీ కేంద్రానికి వెళ్తున్నాడు. ఎప్పటిలాగే కేంద్రానికి వెళ్లిన బాలుడిని.. అక్కడి టీచర్ ఎటువంటి కారణం లేకుండా విచక్షణారహితంగా కొట్టింది.

Advertisement

చిన్నారి విద్వాన్ శరీరంపై గాయాలను చూసిన తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. టీచర్ బాలుడిని ఎంత దారుణంగా కొట్టిందంటే.. చిన్నారి కన్ను వాచిపోవడంతో పాటు.. చేతులు , వీపుపై వాతలు తేలాయి. కనీసం ఏం జరిగిందో కూడా చెప్పుకోలేని ఆ చిన్నారిని అలా గాయపరిచిన తీరు చూసి గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన కొడుకు పరిస్థితి చూసి తల్లి లక్ష్మి కన్నీరుమున్నీరు కావడం అందరినీ కలచివేసింది.

చిన్నారి తల్లిదండ్రులు వెంటనే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యాశాఖ , ఐసిడిఎస్ (ICDS) అధికారులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని.. సదరు అంగన్‌వాడీ టీచర్‌ను వెంటనే విధుల నుంచి తొలగించి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Also Read:  ఎప్స్టీన్‌ ఫైల్స్‌లో అనిల్ అంబానీ.. ఇంకా పెద్దపెద్దోళ్లు, రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×