BigTV English
Advertisement

Frog Pizza Hut: పిజ్జా హట్ వారి స్పెషల్ ‘ఫ్రాగ్ పిజ్జా’.. కప్పను డీప్ ఫ్రై చేసి..

Frog Pizza Hut: పిజ్జా హట్ వారి స్పెషల్ ‘ఫ్రాగ్ పిజ్జా’.. కప్పను డీప్ ఫ్రై చేసి..

Frog Pizza Hut| వెరైటీ పేరుతో కొందరు అసహ్యకర విన్యాసాలు చేస్తుంటారు. వ్యక్తిగతంగా చేసినంతవరకు వాటిని ఎవరూ సీరియస్ గా తీసుకోరు. కానీ సమాజంలో పేరున్న ప్రముఖులు, పేరుగాంచిన సంస్థలు అలాంటివి చేస్తే.. ఆందోళన కలిగించే విషయమవుతుంది. తాజాగా ఒక సంస్థ అందరూ ఇష్టంగా తినే పిజ్జాని వెరైటీ పేరుతో అసహ్యకరంగా మార్చేసింది. పిజ్జా హట్ బ్రాండ్ పిజ్జాలంటే అందరూ ఇష్టంగానే తింటారు.


పిజ్జా హట్ లో పిజ్జాలు క్వాలిటీ, రుచికి ప్రసిద్ధి. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజెన్లు పిజ్జా హట్ ని తిట్టిపోస్తున్నారు. దానికి కారణం పిజ్జాహట్ తన కస్టమర్ల కోసం ‘కప్ప పిజ్జాలు’ ఆఫర్ చేయడం. అది కూడా క్రియేటివిటి పేరుతో పిజ్జాపై కప్ప తన కళ్లు తేలేసి చూస్తున్నట్లు ముస్తాబు చేసిన పిజ్జా. ఈ పిజ్జాని గత వారం చైనాలో కస్టమర్లకు వెరైటీగా ‘గాబ్లిన్ పిజ్జా’ పేరుతో పరిచయం చేసింది.

ప్రముఖ మొబైల్ వీడియో గేమ్ డంజన్ అండ్ ఫైటర్: ఒరిజిన్స్ ప్రమోషన్ కోసమే ఈ స్పెషల్ ఫ్రాగ్ పిజ్జా తీసుకొచ్చినట్లు పిజ్జా హట్ ప్రకటించింది. డంజన్ అండ్ ఫైటర్: ఒరిజిన్స్ వీడియో గేమ్ లో కొన్ని గాబ్లిన్స్ పిజ్జాలు తినడానికి పిజ్జా హట్ కు వస్తాయి. ఆ సందర్బాన్ని పిజ్జా హట్ క్యాష్ చేసుకుంటోంది.


Also Read: రూ.కోటి ఖర్చుతో పార్టీ ఇచ్చిన పాకిస్తాన్ బిచ్చగాడు.. 20 వేల మందికి మటన్, చికెన్‌తో భారీ విందు

ఈ గాబ్లిన్ పిజ్జాను గమనిస్తే.. పిజ్జాపై ఒక డీప్ ఫ్రై చేసిన కప్పను అలంకరించారు. దాంతో పాటు దానికి కళ్లు ఉండే ఆకారంలాగే టాపింగ్స్ పెట్టారు. ఆ టాపింగ్స్ చూస్తుంటే అచ్చం కప్ప తన కళ్లు తేలేసి చూస్తున్నట్లుగా ఉంది. ఈ పిజ్జా బాగా స్పైసీగా, మాల ఫ్లేవర్ లో ఉంటుంది. పిజ్జాపై కప్ప పక్కన అంతా కొత్తిమీర, లేదా పుదీనాతో అలంకరించారు.

విచాట్ పోస్ట్ లో నవంబర్ 18న పిజ్జా హట్ ఈ గాబ్లిన్ పిజ్జాను తొలిసారి పరిచయం చేసింది. ప్రస్తుతం కొన్ని ప్రత్యేక పిజ్జా హట్ అవుట్ లెట్స్ లోనే ఈ గాబ్లిన్ పిజ్జా అందుబాటులో ఉంది. అదికూడా ఈ పిజ్జా కావాలనుకునే కస్టమర్లు ముందుగానే ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఈ కప్ప పిజ్జా ధర 169 యుఆన్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2000.

అయితే సోషల్ మీడియాలో చాలామంది యూజర్లు కప్ప పిజ్జాపై మండిపడుతున్నారు. చైనాలో కప్పలు చాలా ఇష్టంగా తింటారు. అందుకని అక్కడ ఫ్రాగ్ పిజ్జాపై వ్యతిరేకత ఉండదు. అయితే దీని రుచి చూడాలని ఒక వ్యక్తి ఇంటికి ఆర్డర్ చేశాడు. దాని డెలివరీ రాగానే అది చూసి సోషల్ మీడియాలో తనకు చాలా నిరుత్సాహంగా ఉందని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వీబోలో దాని ఫొటోతో పోస్ట్ పెట్టాడు.

పిజ్జాహట్ యాడ్ లో చూపించిన గాబ్లిన్ పిజ్జా చాలా అందంగా, మెరిసిపోతోంది. కానీ ఇంటికి డెలివరీ అయిన పిజ్జా మాత్రం అంత కళగా లేదు. అందుకే అతను తన పోస్ట్ లో పిజ్జా హట్ లో ఎవరు దీన్ని క్రియేట్ చేశారు? వారు ఫ్రీగా ఉంటే తనతో ఒకసారి మాట్లాడమని కామెంట్ చేశాడు.

మరో యూజర్ అయితే.. “కప్ప పిజ్జా చూసి పిజ్జాని కనుగొన్న ఇటాలియన్లు సిగ్గుపడుతుంటారు. ఇది రుచికరంగా ఉంటుందని నేను అనుకుంటున్నా.. కానీ దాని అలంకరించిన తీరు మాత్రం నచ్చలేదు.” అని తన అభిప్రాయం తెలిపాడు.

మరొక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అయితే ఇది ‘ఇల్లీగల్’ అని రాశాడు. కానీ దీని టేస్ట్ చేస్తే.. కప్ప మాంసం లాగా లేదు.. ఏదో చికిన్ లేదా చేప తిన్నట్లుగా రుచి అనిపిస్తోందని తెలిపాడు.

చైనాలో కప్పలు, పాములు, గబ్బిలాలు, పిల్లులు, ఎలుకలు లాంటి జంతువుల మాంసం తినేవారున్నారు.

Related News

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Viral Video: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!

AMB Cinemas: ఏఎంబీ సినిమాస్‌లో స్నానం చేయడానికి షవర్ కూడా ఉందని మీకు తెలుసా? ఔనండీ, నిజం!

Cleanliness Drive: రోడ్డుపై చెత్త వేసేవారి ఫొటో తీస్తే.. రూ.250 మీవే, ఎక్కడంటే?

Mike Tyson: గొరిల్లాతో ఆ పని చేయడానికి ఏకంగా రూ.9 లక్షలు చెల్లించిన మైక్ టైసన్, చివరికి..

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Viral News: 3 నెలలు ఆఫీస్ కు వెళ్లకున్నా పట్టించుకోలేదట, వామ్మో ఇలా కూడా ఉంటారా?

Farmers Debt Clears: తల్లికి నిజమైన నివాళి.. 290 మంది రైతుల అప్పులు తీర్చేసిన వ్యాపారి

Big Stories

×