Viral News : మాయమై పోతున్నడమ్మో మనిషన్న వాడు.. అవును నిజం. మనిషిలో మానవత్వం చచ్చిపోతోంది. పైశాచికత్వం పెరుగుతోంది. డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తున్నాడు. ఎన్ని దారుణాలకైనా ఒడిగడుతున్నాడు. వావివరసలు మరిచిపోతున్నాడు. భార్యను చంపడం.. భర్తను లేపేయడం.. అక్రమ సంబంధాలు.. ఆస్తుల కోసం గొడవలు.. ఇలా నేరాలు ఘోరాలు బాగా పెరిగిపోతున్నాయి. లేటెస్ట్‌గా అలాంటిదే మరో దారుణం. బంగారం కోసం.. తల్లి అంత్యక్రియలకు కూడా అడ్డుకున్నాడు ఓ కసాయి కొడుకు.
చితిపై చిన్నకొడుకు..
చిన్న కొడుకు అంటే ఏ తల్లికైనా చాలా ఇష్టం. అల్లారు ముద్దుగా గుండెలపై పెట్టుకుని పెంచుతుంది. పెద్దయ్యాక కొందరు కొడుకులు తల్లి గుండెలపై తన్నుతున్నారు. అలాంటి వాడే అతను. కన్న తల్లిని చూసూకోవడం మానేశాడు చిన్న కొడుకు. చేసేది లేక పెద్ద కుమారుడి దగ్గరే ఉంది ఇన్నాళ్లు. వృద్ధాప్యంతో 80 ఏళ్ల వయస్సులో చనిపోయింది ఆ తల్లి. అంత్రక్రియలకు స్మశానంకు తీసుకెళ్లారు. చితిని పేర్చారు. అంతలోనే చిన్నకొడుకు వీరంగం వేశాడు. వెళ్లి పేర్చి ఉన్న చితిపై పడుకున్నాడు. తననూ కాల్చేయమన్నాడు. అదంతా తల్లిపై ప్రేమతో కాదు. మరి, ఎందుకంటే…
బంగారంలో వాటా కావాలంటూ..
ఆ తల్లి ఒంటిపై కొన్ని బంగారు ఆభరణాలు, వెండి గాజులు ఉన్నాయి. వాటిని తీసేసి.. భద్రం చేశారు. ఇన్నాళ్లూ ఆమె పెద్ద కొడుకు దగ్గరే ఉంది కదాని ఆ వస్తువులను అతనికి అప్పగించారు కుటుంబ సభ్యులు. అంతే. చిన్నకొడుకు హర్ట్ అయ్యాడు. తల్లి బంగారంలో తనకూ వాటా ఇవ్వాలంటూ గొడవకు దిగాడు. ఓ వైపు కన్నతల్లి అంతిమ సంస్కారం జరుగుతుంటే.. వాడేమో బంగారం కోసం పంతం పట్టి గొడవ చేయసాగాడు. తన వాటా తనకు ఇస్తారా.. చావాలా.. అంటూ తల్లి కోసం పేర్చిన చితిపై పడుకొని నానా న్యూసెన్స్ చేశాడు. ఆఖరి చూపులకు తరలివచ్చిన బంధువులు, సన్నిహితులంతా ఆ చిన్నకొడుకు చేష్టలు చూసి అవాక్కయ్యారు. ఇలాంటి కొడుకులు కూడా ఉంటారా? అంటూ అసహ్యించుకున్నారు.
వాటా ఇస్తారా.. చావాలా..
ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం.. ముందు అంత్యక్రియలు కంప్లీట్ కానీయంటూ అతడిని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా, ఆ చిన్నకొడుకు వినలేదు. తన వాటా బంగారం, వెండి.. తనకు ఇప్పుడే ఇచ్చేయాలంటూ పట్టుబట్టాడు. తన వాటా ఇవ్వకపోతే.. తల్లితో పాటు తననూ చితిలో కాల్చి వేయండి అంటూ హంగామా చేశాడు. బతికి ఉన్నంత కాలం తల్లిని చూసుకోలేదు కానీ.. చనిపోయాక వచ్చి వాటాలు అడుగుతున్నాడంలూ అక్కడ ఉన్న వారంతా చీదరించుకున్నారు.
Also Read : ఒక్కడే 10 పాక్ యుద్ధ ట్యాంకులు పేల్చేసి..
ఎక్కడ జరిగిందంటే..
ఇక వాడు వినేలా లేడని.. అప్పటికప్పుడు ఆ వస్తువులను రెండు భాగాలుగా చేసి.. చిన్నకొడుకు వాటా అతనికి ఇచ్చేశారు. ఆ తర్వాత ఆ తల్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. జైపూర్‌లోని విరాట్ నగర్‌లో జరిగిందీ ఘటన. ఆ చిన్నకొడుకు వేసిన వీరంగం అంతా మొబైల్‌లో రికార్డ్ చేశారెవరో. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెధవ, చెత్తనాయాల.. అంటూ నెటిజన్లు బండ బూతులు తిడుతున్నారు.