Kesari Chapter 2 Telugu Trailer: జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించడానికి అక్షయ్ కుమార్ (Akshay Kumar), ఆర్.మాధవన్ (R.Madhavan) చేసిన ప్రయత్నంలో భాగంగా ‘కేసరి చాప్టర్ 2’ అంటూ హిందీలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కరణ్ సింగ్ త్యాగి (Karan Singh Tyagi) దర్శకత్వంలో.. ఆర్. మాధవన్ , అక్షయ్ కుమార్, అనన్య పాండే (Ananya Pandey), రెజీనా కసాండ్రా (Regina Cassandra) తదితరులు కీలకపాత్రలు పోషించారు. భారత స్వాతంత్రయోద్యమ చరిత్రలో నెత్తుటి అధ్యాయంగా మిగిలిన 1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ మారణకాండ ఉదంతాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. హిందీలో విడుదల అయ్యి మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగులో కూడా విడుదల అవడానికి సిద్ధమయ్యింది. అందులో భాగంగానే తాజాగా ‘కేసరి చాప్టర్ -2’ తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సురేష్ ప్రొడక్షన్స్ పతాకం పై మే 23వ తేదీన తెలుగులో విడుదల కాబోతోంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్.. చూసే ఆడియన్స్ కి గూస్ బంప్స్ తో పాటు బ్రిటిష్ ప్రభుత్వంపై ఆక్రోషం కూడా తెప్పిస్తోంది అని చెప్పవచ్చు.
కేసరి చాప్టర్ 2 తెలుగు ట్రైలర్ ఎలా ఉందంటే..?
ట్రైలర్ మొదలవగానే కోర్ట్ సన్నివేశాన్ని చూపిస్తారు. న్యాయవాదిగా అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. జలియన్ వాలా బాగ్ లో ఉన్న జనాలను పంపించడానికి మీరు ఎలా వార్నింగ్ ఇచ్చారు.. మీరక్కడ టియర్ గ్యాస్ విసిరారా..? లేక ఇంకేదైనా సందేశం ఇచ్చారా? అని ప్రశ్నిస్తే జనరల్ లేదని సమాధానం చెబుతాడు. దాంతో ఫైర్ అయిన అక్షయ్ కుమార్.. మరి ఎలా మీరు అక్కడ ఉన్న అమాయకపు ప్రజల పై షూట్ చేయమని ఆదేశాలు జారీ చేస్తారు? అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఇక తర్వాత జలియన్ వాలాబాగ్ లో జరిగిన ఉదంతాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు .చిన్నపిల్లలు, అమాయకులు, వృద్ధులు ఇలా ఎవరిని పడితే వారిని తూటాలతో పేల్చిన నాటి సంఘటనను నేటి యువతకు కళ్ళ ముందుకు తీసుకొచ్చినట్టు అనిపించింది. ఈ సంఘటనను మనం తెరపై చూస్తున్నంత సేపు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కచ్చితంగా ఈ సన్నివేశాలు తెరపై అద్భుతంగా ఉండబోతున్నాయని అయితే అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
నటీనటుల పర్ఫామెన్స్..
ఇందులో ఇండియన్ లేడీ లాయర్ గా అనన్య పాండే నటిస్తోంది. అనన్య పాండే తో పాటు మాధవన్, అక్షయ్ కుమార్ ఎవరికి వారు పోటీపడి మరీ నటించారు. మరి వీరందరి నటన అద్భుతాన్ని మరోసారి చూడాలి అంటే మే 23న థియేటర్లో వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.