BigTV English
Advertisement

Viral News: తలుపుకు అడ్డుగా పెట్టిన రాయి.. కట్ చేస్తే దాని విలువ రూ.10 కోట్లు, పనికిరాదనుకుని పడేస్తే…

Viral News: తలుపుకు అడ్డుగా పెట్టిన రాయి.. కట్ చేస్తే దాని విలువ రూ.10 కోట్లు, పనికిరాదనుకుని పడేస్తే…

Viral News : అనగనగా ఓ ఇల్లు. ఆ ఇంట్లో ఓ రాయి. ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్. ఇంటి డోర్ అటూఇటూ కదలకుండా అడ్డుగా ఆ రాయిని ఉంచారు. చాలాకాలంగా ఆ స్టోన్ అలానే ఉంది. డోర్ స్టాపర్‌గా వాడుతూ వస్తున్నారు. కాస్త పెద్ద సైజులోనే ఉంటుంది. మూడున్నర కిలోల వరకు బరువు ఉంటుంది. సమీపంలోని నది నుంచి ఆ రాయిని తీసుకొచ్చి ఇలా ఇంటి తలుపుకు అడ్డుగా పెట్టారు ఓనర్.


రాయి కదాని లైట్ తీసుకుంటే..

తరాలు మారినా.. ఆ రాయి మాత్రం ఆ ఇంట్లోని ఒక ముఖ్యమైన వస్తువుగా మిగిలిపోయింది. ఆ హౌజ్‌లో రెండు సార్లు దొంగలు కూడా పడ్డారు. డబ్బు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. కానీ, డోర్‌కు అడ్డుపెట్టిన రాయిని పట్టించుకోలేదు. రాయే కదాని లైట్ తీసుకున్నారు. ఎవరైనా రాయిని ఎందుకు ఎత్తుకెళతారులే. అది వేరే విషయం. ఇక అసలు మేటర్ ఏంటంటే….


రాయి కాదు.. రేర్ పీస్

కొంతకాలం తర్వాత ఆ ఇంటిని వారి దగ్గరి బంధువుకు అమ్మేశారు. కొత్త ఓనర్ ఇల్లంతా సరికొత్తగా సర్దుతున్నాడు. అప్పుడు అతని ఫోకస్ ఆ రాయి మీద పడింది. అరే, భలే విచిత్రంగా ఉందే అనుకున్నాడు. అది చూట్టానికి కాస్త డిఫరెంట్‌గా ఉంది. డార్క్ రెడ్ కలర్‌లో కనిపిస్తోంది. ఇదేదో అరుదైన రాయి అనుకున్నాడు. ప్రభుత్వానికి చెందిన పురావస్తు శాఖకు అమ్మేశాడు. అక్కడి సైంటిస్టులు ఆ రాయిని ప్రత్యేక టెస్టుల కోసం పంపించారు. ఫలితాలు చూసి వారికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినంత పనైంది.

టెస్ట్ చేస్తే అసలు సంగతి తెలిసింది..

అది రాయి కాదట. అత్యంత అరుదైన.. అంబర్ జాతికి చెందిన శిలాజమైన ‘రుమనైట్’ అని గుర్తించారు. డార్క్ రెడ్ కలర్‌లో ఉన్న ఆ పీస్ ఏజ్.. 70 మిలియన్ ఇయర్స్ ఉంటుందని వారి ప్రయోగాల్లో తేలింది. సైన్స్ అండ్ హిస్టరీ పరిశోధనలకు ఈ పదార్థం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు.

రూ.10 కోట్ల విలువైన శిలాజం

బహిరంగ మార్కెట్లో దాని విలువ రూ.10 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అందుకే జాతీయ నిధిగా ప్రకటించారు. రొమేనియాలోని బుజౌ ప్రావిన్షియల్ మ్యూజియంలో భద్రపరిచారు. ఇప్పటికీ ఆ అరుదైన శిలాజం ప్రజల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది.

Also Read : రోడ్డెక్కిన మంచం.. భలే భలే ప్రయాణం

ఆ రాయి అతని జీవితాన్నే మార్చేసింది..

గతంలో అమెరికాలోనూ ఇలాంటి ఉదంతమే వెలుగు చూసింది. మిచిగాన్‌లోని ఓ వ్యక్తి ఒక ఉల్కను చాలాకాలం డోర్ స్టాపర్‌గా యూజ్ చేశాడు. ఆ తర్వాత అదెంత విలువైన వస్తువో తెలిసొచ్చింది అతనికి. మార్కెట్లో అమ్మితే.. ఏకంగా రూ.80 లక్షలు ధర పలికింది. ఆ రాయి అమ్మేసి లైఫ్‌లో బిందాస్‌గా సెటిలై పోయాడు. ఈ రెండు ఘటనలు చూశాక.. రాయే కదాని అన్ని రాళ్లను లైట్ తీసుకోకండి. లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టితే.. మీ డోర్‌కు అడ్డుపెట్టిన రాయే మీ జీవితాన్ని అమాంతం మార్చేయవచ్చు.

Related News

Man Wins Rs 240 Cr Lottery: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!

Hanumakonda: కోయ్.. కోయ్.. కొక్కొరొక్కో.. కోళ్ల కోసం జనం పరుగుల వేట

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Viral Video: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!

Big Stories

×