BigTV English

Viral Video: భలే భలే మంచం బండి, ఎలా వస్తాయి బ్రో మీకు ఈ ఐడియాలు!

Viral Video: భలే భలే మంచం బండి, ఎలా వస్తాయి బ్రో మీకు ఈ ఐడియాలు!

బండి మీద లాంగ్ జర్నీ చేస్తాం.  అలసిపోయిన చోట హాయిగా పడుకోవాలంటే సాధ్యం కాదు. టెంట్ వేసుకోవాలి. లేదంటే హోటల్ లో రూమ్ బుక్ చేసుకోవాలి. అలా చేయాలంటే డబ్బులు కావాలి. అవన్నీ కాకుండా మనమే బెడ్ తీసుకొని వెళ్తే? మంచాన్ని బైక్ మీద తీసుకెళ్లాలంటే కష్టం కదా! అనే డౌట్ వస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువకుడికి కూడా ఇదే ఆలోచన వచ్చింది. ఎలాగైనా ప్రయాణంలో మంచం కచ్చితంగా తీసుకెళ్లాలని భావించాడు. కొద్ది రోజుల పాటు చాలా ఆలోచించాడు. చివరకు మంచి బండిని తయారు చేశారు. తాజాగా రోడ్డు మీద పరుగులు పెట్టించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ మంచం బండి ఎలా తయారు చేశాడంటే?


పాత కారు ఇంజిన్ తో మంచం బండి తయారీ

మంచి మంచం బండి తయారీ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు, ఇంజిన్ ఎలా అని సదరు యువకుడు బాగా ఆలోచించాడు. పాత కారు లేదంటే నాలుగు  చక్రాల ఆటో ఇంజిన్ వాడాలి అనుకున్నాడు. ఆటో ఇంజిన్ శబ్దం ఎక్కువగా వస్తుంది. అందుకే, కారు ఇంజిన్ ను వాడాలి అనుకున్నాడు. అనుకున్నట్లుగానే చక్రాలు, ఇంజిన్ ఉంచి, మిగతా భాగాలు అన్నింటినీ తొలగించాడు. దాని మీద చక్కగా బెడ్ వేసి  తయారు చేశాడు. మంచం మధ్యలో కూర్చుకొని నడిపేలా సీటు ఏర్పాటు చేశాడు. ప్రయాణం మధ్యలో ఎక్కడ అలసట వేసినా, పక్కన చెట్టుకింది ఆపి, హాయిగా కాసేపు రెస్టు తీసుకునేలా రూపొందించాడు. తాజాగా ఈ మంచం బండి రోడ్డు మీదికి రావడంతో అందరూ చూస్తూ ఆశ్చర్యపోయారు. ఈ బండి వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.


Read Also: పంది రక్తం.. సీతాకోక చిలుక మాంసం.. ప్రపంచంలోనే బెస్ట్ రెస్టారెంట్‌లో వడ్డించేవి ఇవేనట!

Read Also: పచ్చళ్లు అమ్ముకోండి పర్వాలేదు.. ఆ పచ్చి బూతులు ఎందుకమ్మా?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

ఇక ఈ మంచం బండి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్న ఐడియాకు అందరూ ఫిదా అవుతున్నారు. అసలు మంచం బండి తయారు చేయాలని కలలో కూడా ఊహించి ఉండరు అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ మంచం బండిన మరింత అప్ డేట్ చేయాలని సూచిస్తున్నారు. మంచం పూర్తిగా కవర్ చేసేలా గుడారం మాదిరి గ్లాస్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంటున్నారు. ఒకవేళ వర్షం వచ్చినా ఇబ్బంది కలగదంటున్నారు. ఒకవేళ రాత్రివేళ పడుకుంటే దోమలు కరవకుండా కాపాడుతుందని చెప్తున్నారు. ప్రయాణ సమయంలోనూ గాలి, దుమ్ము నుంచి రక్షణ కలిగే అవకాశం ఉందంటున్నారు. అప్ డేట్ విషయం గురించి తెలియదు గానీ, చాలా మంది ఈ మంచం బండిని చూసి ఫిదా అవుతున్నారు. ఫన్నీగా కామెంట్స్ పెడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం బోలెడు వ్యూస్ అందుకుంది. వేల కొద్ది లైక్స్, కామెంట్స్ సంపాదించింది.

Read Also: చితి నుంచి లేచొచ్చిన పెద్దాయన.. మంట పెట్టగానే లేచి కూర్చొని..

Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×