RCB vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా… ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (Royal Challengers Bangalore vs Gujarat Titans ) మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా ( M.Chinnaswamy Stadium, Bengaluru ) … రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో…. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాటింగ్ కు దిగింది.
Also Read: NZ beat Pak: కివీస్ గడ్డపై వరుసగా 12 వన్డేల్లో ఓడిన పాక్… పరువు మొత్తం పాయె ?
గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రికార్డులు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో ( Indian Premier League 2025 Tournament ) ఇప్పటి వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అలాగే గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐదు మ్యాచ్లు జరిగాయి. ఈ ఐదు మ్యాచ్ ల్లో 3 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించడం జరిగింది. అలాగే గుజరాత్ టైటాన్స్ జట్టు రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించింది. అంటే గుజరాత్ టైటాన్స్ జట్టు పైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు… తన ప్రతాపాన్ని చూపించిందని చెప్పవచ్చు. అలాగే ఈ రెండు జట్ల మధ్య హైయెస్ట్ స్కోర్ 206 పరుగులు ఉన్నాయి. అలాగే లోయస్ట్ స్కోర్ వచ్చేసి 147 పరుగులు మాత్రమే. మరి ఇవాల్టి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు హోమ్ గ్రౌండ్ లో జరుగుతోంది. చిన్నస్వామి స్టేడియం కావడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కాస్త అడ్వాంటేజ్ ఉంటుందని చెబుతున్నారు విశ్లేషకులు. అలాగే ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లలో కూడా రాయల్ చాలెంజర్స్ జట్టు విజయం సాధించింది. పాయింట్స్ టేబుల్ లో కూడా టాప్ పొజిషన్లో ఉంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. అటు గుజరాత్ టైటాన్స్ లాస్ట్ మ్యాచ్లో… ముంబై ఇండియన్స్ పై గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇక ఇవాళ కూడా మ్యాచ్ గెలిచి దుమ్ము లేపాలని చూస్తోంది.
Also Read: Dhanashree Verma: క్రికెటర్ కు విడాకులు…హైదరాబాద్ కు పారిపోయిన కిలాడీ లేడీ ?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు VS గుజరాత్ టైటాన్స్ జట్ల వివరాలు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్(సి), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభమన్ గిల్(సి), జోస్ బట్లర్(w), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ