BigTV English

Viral Video : 434 / 440 మార్క్స్.. ఇంకా ఏడుస్తావేంది? తింగరి దానా..

Viral Video : 434 / 440 మార్క్స్.. ఇంకా ఏడుస్తావేంది? తింగరి దానా..

Viral Video : టెన్త్, ఇంటర్ రిజల్ట్స్. మార్కుల వేటలో అనేక విచిత్రాలు. ఫెయిల్ అయిన వాళ్లు ఏడుస్తారు.. బాధపడుతుంటారు. సెన్సిటివ్ స్టూడెంట్స్ కొందరు సూసైడ్ వరకూ వెళుతుంటారు. జస్ట్ పాస్ అయిన వాళ్లు ఓకే ఓకే అనుకుంటారు. ఏం చేస్తాం, అలా అడ్జస్ట్ అయిపోతాం అంటారు. ఇక, టాప్ మార్క్స్ వచ్చిన వాళ్లదే హంగామా అంతా. ఖుషీఖుషీ అవుతారు. గాల్లో తేలిపోతుంటారు. ప్రపంచాన్ని జయించినట్టు ఫీల్ అవుతుంటారు. తమకంటే తోపు ఎవరంటూ ఫోజులు కొట్టే వాళ్లూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో టైప్. ఒక్కో మార్కుకు ఒక్కో ఫీలింగ్.. ఒక్కో రియాక్షన్. అలాంటిదే లేటెస్ట్‌గా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. షేర్లు, స్టేటస్‌లతో ఆ అమ్మాయి ఏడుపు వీడియోపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.


6 మార్కులు తగ్గాయని..

తెలంగాణలో ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి. ఎవరో తెలీదు కానీ ఓ అమ్మాయికి 440 మార్కులకు గాను 434 మార్క్స్ వచ్చాయి. ఎవరైనా ఈ మార్క్స్ చూసి ఏం చేస్తారు? ఎగిరి గంతేస్తారు కదా. కానీ, ఆ అమ్మాయి అలా చేయలేదు. తనకు 6 మార్కులు తగ్గాయంటూ బోరున ఏడ్చేసింది. గుక్క పెట్టి ఏడుస్తూనే ఉంది.


కూతురు ఏడుపు.. తల్లి షాక్

అప్పుడే మొబైల్‌లో రిజల్ట్ చూసుకున్నట్టుంది. 440 కి 434 మార్కులు మాత్రమే వచ్చాయని తెగ ఫీల్ అయిపోయింది. కన్నీళ్లు టపాటపా రాలుతున్నాయి. వెక్కి వెక్కి ఏడుస్తోంది. అది చూసి వాళ్ల అమ్మ అవాక్కైంది. ఏంటి? తన కూతురు ఇలా ఏడుస్తోంది అని ఒక్క క్షణం ఉలిక్కిపడింది. 440కి 6 మార్కులు తగ్గియాని తన కూతురు ఏడుస్తున్న విషయం తెలిసి నవ్వాలో, ఏడ్వాలో ఆ తల్లికి అర్థం కాలేదు. వెంటనే తన మొబైల్ ఫోన్ తీసి.. 6 మార్కుల కోసం కూతురు ఏడుస్తున్న సీన్‌ను వీడియో రికార్డ్ చేసింది. ఆ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఓ పిచ్చమ్మాయి.. తింగరి దానా..

ఆ వీడియోలో ఏడుస్తున్న కూతురును తల్లి ఓదారుస్తోంది. “ఏ తిక్క.. ఇంకా ఏడుస్తావేంటి? తింగరి దానా.. ఓ పిచ్చమ్మాయి.. ఓ పిచ్చి పిల్లా.. మెంటలా, 6 మార్క్స్ కు ఏడుస్తావా? 440కు 434 అంటే మంచి మార్కులే నాన్నా.. బంగారమ్మా..” అంటూ కూతురు ఏడుపును తనదైన స్టైల్‌లో కంట్రోల్ చేసే ప్రయత్నం చేసిందా తల్లి. ఏడుస్తున్న దృశ్యమే అయినా.. ఈ వీడియో భలే గమ్మత్తుగా ఉంది. నెటిజన్లు సైతం ఆ వీడియోపై రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

Also Read : పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ 2 జరగాల్సిందే…

6 మార్కులే కదాని లైట్ తీసుకోకుండా..

ఆ అమ్మాయి శ్రీకృష్ణుడి భక్తురాలు అనుకుంటా. మొబైల్‌లో ఇంటర్ రిజల్ట్స్ చూసుకునే ఉందే.. చేతిలో రాధా, కృష్ణుల బొమ్మలు పట్టుకుని ఉంది. నుదిట నామాలు పెట్టుకుంది. మెడలో తులసీ మాల వేసుకుంది. దేవుడికి పూజలు గట్రా చేశాకే.. మార్క్స్ చెక్ చేసుకుందని తెలుస్తోంది. బహుషా ఏ స్టేట్ ర్యాంకో, టాపర్‌గా వస్తాననో అనుకుని ఉంటుంది పాపం. తీరా రిజల్ట్స్ చూసుకునే సరికి.. 440 కి 6 మార్కులు తక్కువగా వచ్చాయి. ఇక అంతే. ఏడుపు అందుకుంది ఆ అమ్మాయి. వాళ్ల అమ్మ కూతురును టీజ్ చేసినట్టు ఓదార్చడం ఆసక్తికరంగా ఉంది. నెటిజన్లకు ఆ వీడియో తెగ నచ్చేసింది. ఫుల్‌గా వైరల్ చేస్తున్నారు. 6 మార్కులు తక్కువ వచ్చాయని ఇంతలా ఏడిస్తే.. ఫెయిల్ అయిన వాళ్లు ఇంకెంతలా ఏడవాలి? కేవలం 6 మార్కులు మాత్రమే వచ్చిన వాళ్ల పరిస్థితి ఏంటి? ఇక్కడ పాసా..? ఫెయిలా? అనేది కాదు.. ఆటిట్యూడ్ ముఖ్యం బిగులు.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Related News

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Big Stories

×