Sandeep Reddy Vanga Spirit : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు సందీప్ రెడ్డి వంగ ఒకరు. కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే సందీప్ రెడ్డి వంగ మంచి పేరుని సంపాదించుకున్నాడు. సినిమా అంటే ఇలానే తీయాలి,ఇలానే ఉండాలి అని కాకుండా సినిమాని ఇలా కూడా తీయొచ్చు అని రూల్స్ ను బ్రేక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి. సీన్ కి అడ్డం వస్తే కథను తీసేస్తున్న గాని, సీన్ విషయంలో కాంప్రమైజ్ కాను అని ఒక సందర్భంలో చెబుతూ ఉంటాడు. ప్రతి సీన్ కూడా సందీప్ రెడ్డివంగా ఒక ఇంటెన్షన్తో కట్ చేస్తాడు. స్వతహాగా ఎడిటర్ కూడా కావడంతో సినిమా మీద మంచి గ్రిప్ ఉంటుంది. ఇక అనిమల్ సినిమాతో దాదాపు 100 కోట్లు పైగా కలెక్షన్స్ వసూలు చేశాడు. ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి.
స్పిరిట్ లో మలయాళం హీరో
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించబోయే ‘స్పిరిట్’ సినిమాలో ఉన్ని ముకుందన్ నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఓ కీలక పాత్ర కోసం సందీప్ రెడ్డి ఆయనను సంప్రదించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీని గురించి మూవీ టీమ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనుంది. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్లో ప్రారంభం కానున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశారు. ఇందులో ప్రభాస్ సిన్సియర్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. మలయాళ నటుడైన ముకుందన్ ఇటీవల ‘మార్కో’ సినిమాతో హిట్ అందుకున్నారు. ప్రస్తుతం తెలుగు ఆడియన్స్ కూడా మలయాళం సినిమాలు ఎక్కువగా చూడటం మొదలుపెట్టారు కాబట్టి. ఈ నటుడు వర్క్ ను కూడా ఇదివరకే ఫాలో అయ్యారు.
మ్యూజిక్ 70% కంప్లీట్
మామూలుగా సినిమా అయిపోయిన తర్వాత మ్యూజిక్ కంపోజ్ చేస్తూ ఉంటారు. కానీ సందీప్ రెడ్డి వంగ మాత్రం ఈ సినిమా మొదలవడానికి అంటే ముందే 70% మ్యూజిక్ కంప్లీట్ చేసేసారు. షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ మ్యూజిక్ ని పెట్టు కూడా సందీప్ రెడ్డి వంగ చేస్తూ ఉంటారట. ఇక మ్యూజిక్ పై సందీప్ రెడ్డి వంగాకి ఉన్న అవగాహన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏదైనా ఒక మంచి పాటను విన్నప్పుడు దాన్ని సినిమాలోకి ఎలా ఇన్వాల్వ్ చేయొచ్చు సందీప్ కి తెలిసినంతగా ఎవరికి తెలియదు అని ఇప్పటివరకు విడుదలైన సినిమాలు ప్రూవ్ చేస్తూ వచ్చాయి. ఇక స్పిరిట్ సినిమాలో మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని చాలామందికి ఒక క్లారిటీ ఉంది.
Also Read : Parasuram: కథ చెప్పడం పూర్తయింది, కార్తీ ఒప్పుకోవడమే లేటు