BigTV English

Pahalgam Terror Attack : ముగ్గురు టెర్రరిస్టులు వీళ్లే.. సర్జికల్ స్ట్రైక్స్ 2 జరగాల్సిందే..

Pahalgam Terror Attack : ముగ్గురు టెర్రరిస్టులు వీళ్లే.. సర్జికల్ స్ట్రైక్స్ 2 జరగాల్సిందే..

Pahalgam Terror Attack : కశ్మీర్ నరమేధంపై యావత్ భారతదేశం రగిలిపోతోంది. దెబ్బకు దెబ్బ ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారు. సౌదీ నుంచి ప్రధాని మోదీ వెంటనే తిరిగొచ్చేసి.. అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కశ్మీర్ వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను ఓదార్చారు.


సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు

టెర్రర్ అటాక్‌తో సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్తాన్ సైతం అప్రమత్తమైంది. కశ్మీర్‌లో ఉగ్రదాడితో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ సుద్దపూస మాటలు మాట్లాడుతోంది. ఓవైపు ఇలా ప్రకటనలు చేస్తూనే.. మరోవైపు పాక్ ఫైటర్ జెట్‌లను కరాచీ నుంచి పీవోకే వైపు తరలిస్తోంది. మళ్లీ భారత్ తమపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందేమోననే భయం పాపిస్తాన్‌ను వెంటాడుతోంది.


ముగ్గురు ఉగ్రవాదుల ఫోటోలు రిలీజ్

సుందర పర్యాటక ప్రాంతమైన పెహల్‌గామ్‌లో ముంబై తరహా ఉగ్రదాడికి తెగబడి.. 28 మంది పర్యాటకులను అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారు ముష్కరులు. పేర్లు, ఐడీ కార్డులు చెక్ చేసి మరీ.. ముస్లింలను వదిలేసి హిందువులనే కాల్చి చంపేశారు. మహిళలను, పిల్లలను కూడా వదిలేశారు. ఈ కిరాతకానికి ఒడిగట్టింది తామేనంటూ లష్కరే తోయిబాకు చెందిన ‘ది రెసిస్టెన్స్ ఫోర్స్’ ప్రకటించుకుంది. ఆ ఘాతుకం మొత్తాన్ని ఉగ్రవాదులు కెమెరాల్లో రికార్డు కూడా చేసినట్టు తెలుస్తోంది. ఏడుగురు టెర్రరిస్టులు ఈ నరమేథానికి పాల్పడినట్టు తెలుస్తోంది. అందులో ముగ్గురు ముష్కరుల స్కెచెస్‌ను విడుదల చేశాయి భద్రతా బలగాలు. ఆసిఫ్‌ ఫౌజి, సులేమాన్‌షా, అబు తల్హా.. ఈ ముగ్గురి ఆచూకీ తెలిస్తే వెంటనే ఆర్మీకి సమాచారం ఇవ్వాలని వారి ఫోటోలు మీడియాకు, పబ్లిక్‌కు రిలీజ్ చేశారు.

పాక్ ఆర్మీ చీఫ్‌కు ముందే తెలుసా?

ఉగ్రదాడి గురించి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ ఆసీమ్ మునీర్ దగ్గర ముందే సమాచారం ఉందా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది. ఇటీవలే ఆయన కశ్మీర్ గురించి కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. వారం తిరిగే సరికల్లా.. పెహల్‌గామ్‌లో ఉగ్రదాడి జరగడంతో.. అటాక్ వెనుక ఎప్పటిలానే పాకిస్తాన్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు. దాడులకు సూత్రధారి లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా కుసురీ అలియాస్ ఖలీద్ అని భావిస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్షులు జేడీ వాన్ ఇండియా పర్యటనలో ఉన్న సమయంలోనే ఇలా ఉగ్రవాదులు తెగబడటం చూస్తుంటే.. కశ్మీర్‌ ఇష్యూను అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించడంలో భాగమే అంటున్నారు. గతంలో 2000 సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఇండియా టూర్‌లో ఉన్నప్పుడు కూడా ఉగ్రవాదులు కశ్మీర్‌లో ఇలానే 36 మందిని కాల్చి చంపారు. సేమ్ టు సేమ్ అదే తరహాలో ఈసారి కూడా టెర్రర్ అటాక్ జరగడం చూస్తుంటే.. దీని వెనుక పక్కాగా పాకిస్తాన్ కుట్ర ఉందనే అనుమానాలను బలపరుస్తోంది. అందుకే, సర్జికల్ స్ట్రైక్స్ 2 జరపాలంటూ భారతీయుల నుంచి బలమైన వాదన వినిపిస్తోంది. మరి, ప్రధాని మోదీ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి…

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×