BigTV English

Bihar Student Answer Sheets: పాస్ చేయండి.. లేకపోతే మా వాళ్ళు పెళ్లి చేస్తారు.. ఆన్సర్ షీట్ లో రాసిన స్టూడెంట్స్

Bihar Student Answer Sheets: పాస్ చేయండి.. లేకపోతే మా వాళ్ళు పెళ్లి చేస్తారు.. ఆన్సర్ షీట్ లో రాసిన స్టూడెంట్స్

viral news


Bihar Students Answer Sheets goes Viral Video: పబ్లిక్ పరీక్షలు వచ్చాయంటే చాలు. విద్యార్ధుల్లో ఆందోళన మొదలవుతుంది. ఎగ్జామ్స్ లో పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని ఒక భయం. పరీక్షలో పాస్ అయ్యేందుకు విద్యార్ధులు పరీక్ష పత్రాలలో వింత వింత సమాధానాలు రాస్తూ ఉంటారు. కాని కొంత మంది మాత్రం సినిమాల గురించి, కవిత్వాల గురించి రాస్తుంటారు. మరి కొంత మంది తమలో ఉన్నటాలెంట్ ని బయటపెడుతూ ఉంటారు. మరి కొంత మంది విద్యార్దులు అయితే ఇంట్లో సమస్యలను పరీక్ష పత్రాల్లో రాసి టీచర్లను బ్రతిమిలాడుకుంటారు.

రాను రాను స్టూడెంట్స్ లో ఇలాంటి మార్పు రావడానికి కారణం వారి పేరెంట్స్, ఇంట్లో ఒత్తిడి అని చెప్పవచ్చు. దీంతో విద్యార్ధులు రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరికొందరు విద్యార్ధులు
ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినా, తక్కువ ర్యాంకు వచ్చిన తల్లి దండ్రులు ఏమైనా అంటారు అనే భయంతో ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. కాని కొంతమంది విద్యార్దులు కొత్తగా ఆలోచనలు చేస్తున్నారు. తాజాగా బీహార్ లోని కొంత మంది విద్యార్ధులు మెట్రుక్యులేషన్ పరీక్షలో వింత సమాధానాలు రాశారు.


ఓ విద్యార్ధిని భావోద్వేగంగా రాసిన పేపర్ వైరల్ అవుతుంది. నేను పేదింటి అమ్మాయిని. దయచేసి నన్ను పాస్ చేయండి సార్. లేదంటే మా అమ్మా నాన్న నాకు పెళ్లి చేస్తారు. నా పరువు కాపాడండి. అని రాసింది. మరి కొందరు విద్యార్దులు అయితే కవిత్వాలు, సినిమా స్టోరీలు రాసారు. ఒక విద్యార్ది అయితే ఫిజిక్స్ సంబంధించిన పరీక్షలో ఆన్ మోనియోను నిర్వచిస్తూ.. ప్రేమ కవిత్వాలు రాసాడు. ప్రేమ ఎప్పుడు పుడుతుందో మనకు తెలియదని.. కాని అది పుడుతుంతుందని తెలిపాడు. ఎందుకంటే దానికి చాలా శక్తి ఉందని అందుకే దీనిని ఆన్ మీనియా అని పిలుస్తారు అని రాశాడు. మరో విద్యార్ధి అయితే భౌగోళిక శాస్త్రం సంబంధించిన ప్రశ్నలో ఓ విద్యార్ధి రామాయణం మొత్తం రాసాడు.

Also Read: వావ్‌! మ్యారేజ్ ప్రపోజల్‌కి నెటిజన్లు ఫిదా, వీడియో వైరల్

ఇక మరోవిద్యార్ధి అయితే సైక్లోట్రాన్ ను గురించి రాస్తూ.. సైక్లోట్రాన్ లోని ప్రభావ శక్తి ఏమిటంటే.. అది ఎవరైనా నియంత్రించ గలదని అది మనిషి కూడా నియంత్రించవచ్చు అని రాసుకొచ్చాడు. ఇలా చాలా మంది స్టూడెంట్స్ రకరకాలు ప్రశ్నలకి ఆన్సర్లు రాసారు. ఇప్పుడు అనేక సబ్జెక్టుల కాపీలు వైరల్ గా మారాయి.

జాగ్రఫీ తనిఖీలు చేసే ఉపాద్యాయుడు మాట్లాడుతూ.. కొందరు విద్యార్ధులు ఇటువంటి రాతలు ప్రశ్నా పత్రాలపై రాస్తున్నారని, ఇలాంటివి రాయకుండా టీచర్లు క్లాస్ రూమ్ లోనే విద్యార్ధులకు చెప్పాలని సూచించారు. పరీక్షల్లో భావోద్వేగ సందేశాలు రాయడం వల్ల మార్కులు రావని.. సబ్జెక్ట్ సంబంధించిన సమాధానాలే రాయాలని ఆయన పేర్కొన్నారు.

Tags

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×