BigTV English

Marriage Proposal : వావ్‌! మ్యారేజ్ ప్రపోజల్‌కి నెటిజన్లు ఫిదా, వీడియో వైరల్

Marriage Proposal : వావ్‌! మ్యారేజ్ ప్రపోజల్‌కి నెటిజన్లు ఫిదా, వీడియో వైరల్
Wow! Netizens are shocked by the marriage proposal, the video is viral
 

ఒకప్పుడు అమ్మాయి అబ్బాయి ఇష్టపడితే ఒకరికొకరు ప్రేమలేఖలు రాసుకునేవారు. ఎందుకంటే మారిన కాలానుగుణంగా ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు. కానీ.. ప్రస్తుత కాలంలో అమ్మాయిలైనా.. అబ్బాయిలైనా వారు ఒకరిని ఇష్టపడితే లేట్‌ చేయకుండా వెంటనే తమ మనసులోని మాటను వ్యక్తపరుస్తున్నారు. ఇక మరికొందరి మధ్య ఉన్న పరిచయం కాస్త కొన్నిసార్లు రిలేషన్‌గా మారుతుంటుంది. వారి ప్రేమను వ్యక్తపరిచేందుకు చాలా కష్టపడుతూ.. టెన్షన్ పడుతుంటారు. కానీ ఇక్కడ కనిపిస్తున్న ఓ అబ్బాయి మాత్రం చాలా డిఫరెంట్‌గా క్రియేటివ్‌గా ఆలోచించి నచ్చిన అమ్మాయికి మ్యారేజ్ ప్రపోజ్ చేశాడు. ఇంకేముంది దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.


అమ్మాయి అబ్బాయి మధ్య పరిచయం కొన్నిసార్లు ప్రేమగా మారుతుంది.మరికొన్ని మూగ ప్రేమగా మారుతుంది. అయితే ఆ ప్రేమను అమ్మాయిలకి తెలియజేయడంలో చాలామంది అబ్బాయిలు ఫెయిల్‌ అయ్యి దేవదాసులుగా మారుతుంటారు. మరికొందరు తమ ప్రేమలో సక్సెస్‌ అవుతుంటారు. మరి.. ఆ ప్రేమను పెళ్లిదాక తీసుకపోవడం అనేది అటు అమ్మాయికి, ఇటు అబ్బాయికి పెద్ద టాస్క్‌ అనే చెప్పాలి. ఎందుకంటే ఫ్రెండ్‌గా ఉన్న తనను మ్యారేజ్ ప్రపోజ్ చేస్తే తను అంగీకరిస్తుందా.. లేక ఉన్న ఫ్రెండ్‌షిప్ పోతుందా.. అనే భావంతో అబ్బాయిలు తెగ టెన్షన్ పడుతుంటారు. కొందరు మాత్రం క్రియేటివ్‌గా ఆలోచించి తనకు నచ్చిన వారి మనసును గెలుచుకునేందుకు అమ్మాయిలకు, అబ్బాయిలకు మ్యారేజ్ ప్రపోజ్ చేస్తుంటారు.

Read More: ఊడిపడిన టైరు.. గాల్లో 235 మంది ప్రాణాలు.. ఆ తర్వాత ఏం జరిగింది..?


ఇక్కడ కనిపిస్తున్న ఓ అబ్బాయి మాత్రం తన గర్ల్‌ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకోవడం కోసం డిఫరెంట్‌గా మ్యారేజ్ ప్రపోజల్ చేశాడు. రెండు బీఎండబ్ల్యూ కార్ల వెనుక అద్దంపై ‘విల్‌ యూ మ్యారీమి’ అనే స్టిక్కర్‌తో ప్రపోజల్ పెట్టాడు.ఆ తర్వాత అబ్బాయి అమ్మాయిని బ్యూటిఫుల్ లొకేషన్‌కు తీసుకువెళ్తాడు. ఆ టైంలో తన వెనుక నుంచి అనుసరిస్తున్న రెండుకార్లు సడెన్‌గా వారి కారు ముందుకు వచ్చి ఆగుతాయి. ఆ కార్లపై రాసి ఉన్న విల్ యూ మ్యారీమి అనే వర్డ్స్‌ను అమ్మాయి చూస్తూ అలాగే ఉండిపోతుంది. ఆ కార్లు సడెన్‌గా వీరి కారు ముందుకు వచ్చి ఆగుతాయి. వెంటనే అమ్మాయికి అబ్బాయి ఉంగరం ఇచ్చి మ్యారేజ్ ప్రపోజ్ చేస్తాడు. దీంతో అమ్మాయి ఒకింత షాక్‌కి గురై తన ప్రపోజల్‌కి ఫిదా అయిపోతుంది.

ఇంకేముంది పక్కనుండి తీస్తున్న వీడియోని రికార్డు చేశారు తన మిత్రుడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు.. వారిని ఏం ప్రపోజల్ భయ్, నీ ప్రపోజల్‌కి ఆ అమ్మాయి ఏంటీ.. ఏ అమ్మాయి అయినా ఇట్టే ఫిదా అయిపోతుందంటున్నారు. ఇక మరికొందరు అయితే.. ఈ జంట చాలా క్యూట్‌గా ఉందని, వీరికి దిష్టి తాకుతదంటున్నారు. మరికొందరు అయితే.. అబ్బాయి ఎంతో క్రియేటీవ్‌గా ప్రపోజ్ చేశాడని, ఇలా ప్రపోజ్ చేస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందేనని నెటిజన్లు రకరకాల కామెంట్లతో ప్రశంసిస్తున్నారు.

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×