E-Paper
Advertisement

రంగంలోకి దిగిన టాప్ ప్రొడ్యూసర్స్.. ఎగ్జిబిటర్ల సమ్మెకు చెక్ పడేనా?

రంగంలోకి దిగిన టాప్ ప్రొడ్యూసర్స్.. ఎగ్జిబిటర్ల సమ్మెకు చెక్ పడేనా?
Advertisement

Producers Meeting : టాలీవుడ్ లో పర్సెంటేజ్ పంచాయితీ ముదిరిపాకాన పడ్డట్టే కనిపిస్తుంది. నిన్నటికి నిన్న మాకు పర్సెంటేజ్ ఇస్తేనే థియేటర్లలో సినిమాలు వేయగలం,లేకపోతె కష్టం అంటూ కొండాపూర్ వేదికగా కుండబద్దలు కొట్టేసింది తెలంగాణా ఎగ్జిబిటర్ అసోసియేషన్.దీంతో తాజాగా ఈరోజు హైదరాబాద్‌లోని దస్ పల్లా వేదికగా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అర్జెంట్ గా సమావేశం ఏర్పాటు చేసింది.మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ, సాహు గారపాటి, కిలారు సతీష్, చెరుకూరి సుధాకర్ వంటి బడా ప్రొడ్యూసర్స్ అంతా మీటింగ్ లో పాల్గొనడం ఫిలిమ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయిపోయింది.

ఓటీటీ విండో పీరియడ్‌పై ఈ భేటీలో ప్రధానంగా ఫోకస్

Advertisement

ముఖ్యంగా థియేటర్ల యజమానులు డిమాండ్ చేస్తున్న రెంటల్ సిస్టమ్ మరియు ఓటీటీ విండో పీరియడ్‌పై ఈ భేటీలో ప్రధానంగా ఫోకస్ చేశారని సమాచారం. సినిమా రిలీజైన కొద్ది రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తుండటం వల్ల థియేటర్లకు జనాలు రావడం లేదని, దీనివల్ల తాము భారీగా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎగ్జిబిటర్లు. దీనిపై మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్ మాట్లాడుతూ “మేము ఎవ్వరికీ వ్యతిరేకం కాదు, సినిమా అంటేనే ఒక పెద్ద ఎకో సిస్టమ్. ఇక్కడ 24 క్రాఫ్ట్స్ రాత్రింబవళ్లు కష్టపడితేనే ఒక సినిమా పూర్తవుతుంది. అలాగే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు.. వీరంతా కలిస్తేనే సినిమా ప్రేక్షకుడి వరకు చేరుతుంది. ఈ వ్యవస్థలో ఏ ఒక్కరు ఇబ్బంది పడినా అది మొత్తం ఇండస్ట్రీపై ప్రభావం చూపిస్తుంది” అని ఆయన కుండబద్దలు కొట్టారు.

also read :అండర్ వాటర్ యాక్షన్ కోసం ఏకంగా వారణాసికే.. మహేశ్‌ – రాజమౌళి రిస్క్ మామూలుగా లేదుగా!

Advertisement

నిర్మాతలకు కూడా సమస్యలు

నిజానికి గత నాలుగు నెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరైన సందడి లేదు. సంక్రాంతి తర్వాత ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టే భారీ చిత్రాలు రాకపోవడంతో ఎగ్జిబిటర్లు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవమే. అయితే ఇప్పుడు జూన్ 4న వస్తున్న ‘పెద్ది’ వంటి పెద్ద సినిమా లైన్లో ఉన్న ఈ సమయంలో ఎగ్జిబిటర్లు తమ మొండిపట్టును కొనసాగించడం ఇండస్ట్రీకి ఆరోగ్యకరం కాదని తేల్చి చెప్పారు. ఎగ్జిబిటర్లకు ఉన్న ఇబ్బందులు తమకు తెలుసని, కానీ నిర్మాతలకు కూడా తమదైన సమస్యలు ఉంటాయని రవిశంకర్ గుర్తు చేశారు. ఏదైనా సమస్య ఉంటే అందరూ కూర్చొని మాట్లాడుకోవాలని, అంతేకానీ వెంటనే సొల్యూషన్ కావాలని పట్టుబడితే అది సాధ్యం కాదని అసలు విషయం చెప్పాడు.పనిలో పనిగా మీ చేతిలో సినిమాలు లేకపోతేనే పర్సెంటేజ్ సిస్టం గుర్తుకొచ్చిందా అంటూ శిరీష్ కి చురకలంటించాడు.ఇక నాగ వంశీ ఒక అడుగు ముందుకేసి 300 మల్టీఫ్లెక్స్ స్క్రీన్స్ ఉన్న ఒక ఎగ్జిబిటర్ సింగిల్ థియేటర్స్ గురించి మాట్లాడటం కామెడీగా ఉందని సునీల్ నారంగ్ పై సెటైర్ వేశాడు.

విధానం మార్చినంత మాత్రాన సమస్య సాల్వ్ అవుతుందా

ఇక ఈ బేటీలో  థియేటర్ల మెయింటెనెన్స్,పవర్ ఛార్జీలు పెరగడం వంటి విషయాలపై గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే కేవలం థియేటర్ రెంటల్ విధానం మార్చినంత మాత్రాన సమస్య సాల్వ్ అవుతుందా లేక ఓటీటీ రిలీజ్ డేట్లను ఎనిమిది వారాలకు పెంచాలా? అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ బేటీ తర్వాత ఎగ్జిబిటర్ల అసోసియేషన్ తో మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి ఈ సారైనా ఈ పంచాయితీకి ఎండ్ కార్డ్ వేస్తారా లేక ఎప్పటిలాగే నాన్చుతూ పోతారా !

also read :చిరంజీవి హీరోయిన్ మిస్టరీ డెత్.. స్టార్ హీరోలతో సినిమాలు.. 26 ఏళ్ల పెద్దవాడితో ప్రేమ.. చివరకు ఇలా

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×