BigTV English
Advertisement

Tractor Viral Video: అది మంచం అనుకున్నావా? హైవేపై ట్రాక్టర్‌పై పడుకొని డ్రైవింగ్.. మన స్టేట్‌లోనే!

Tractor Viral Video: అది మంచం అనుకున్నావా? హైవేపై ట్రాక్టర్‌పై పడుకొని డ్రైవింగ్.. మన స్టేట్‌లోనే!

Tractor Viral Video: ఎక్కడైనా ఓ సినిమా సీన్ అన్నట్టుగా కనిపించిన దృశ్యం.. కానీ ఇది నిజజీవితంలో మధ్య రోడ్డుపైనే జరిగింది. ట్రాఫిక్ రూల్స్ గాలికొదిలి, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న యువకుడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నిద్రలేక లేచినట్టే లేచిన అతడు.. నడిచే ట్రాక్టర్ మీదే నిద్రపోతూ ప్రయాణం చేస్తూ కనిపించడంతో ప్రజల నోళ్ళు బెట్టించేశాడు. కానీ ఈ హీరోగిరి వెనుక ఉన్న బోధ పాఠం మాత్రం అందరికీ తెలిసేలా వైరల్ అయింది.


దృశ్యం ఎక్కడ రికార్డు చేశారంటే?
జోగులాంబ గద్వాల్ జిల్లా మానవపాడు మండల పరిధిలోని 44వ జాతీయ రహదారి పై ఈ ఘటన చోటుచేసుకుంది. మానవపాడు నుంచి ఉండవల్లి మార్గంలో వెళ్తున్న ఓ ట్రాక్టర్‌పై, ఓ యువకుడు దానిపై తాపీగా పడుకుని ట్రాక్టర్ నడుపుతూ కనిపించాడు. రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు ఇదంతా చూసి ఆశ్చర్యపోయారు.

వీడియో ఎలా వెలుగులోకి వచ్చింది?
ఈ దృశ్యం అక్కడే వెళ్తున్న మరో వాహనం ప్రయాణికుల దృష్టికి వచ్చింది. వారు వెంటనే తమ మొబైల్ ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియో చూసినవారంతా ఇది నిజమా? అని షాక్‌కు గురయ్యేంత ఘోరంగా ఉంది. ఇలా వైరల్ అయిన వీడియో నెటిజన్లలో పెద్ద చర్చకు దారి తీసింది.


యువకుడి స్టంట్ ఎలా ఉంది?
వాహనాన్ని డ్రైవింగ్ చేయడం కాదు.. నిద్రలో కూడా నడిపించవచ్చని చూపించేందుకు ట్రై చేసినట్టు కనిపిస్తోంది. ట్రాక్టర్ మీద ముందు భాగంలో తాపీగా పడుకుని, చేతులను వెనుకకు వేసి చక్కగా విశ్రాంతిలో ఉన్నట్టుగా డ్రైవింగ్ చేస్తూ కనిపించాడు. డ్రైవర్ సీట్‌లో ఎవ్వరూ లేకపోవడం, వేగంగా ట్రాక్టర్ రోడ్డుపై దూసుకెళ్లడం చూస్తే.. ఇది ప్రమాదాన్ని ఆహ్వానించినట్టే అని నిపుణుల అభిప్రాయం.

ఇది కేవలం స్టంట్ కాదు.. చట్ట ఉల్లంఘన
ఇలా ప్రజా రహదారిపై ప్రయాణిస్తూ నిర్లక్ష్యంగా ప్రవర్తించడం అనేది భారత రోడ్డు రవాణా చట్టానికి పూర్తి విరుద్ధం. ఇదొక పబ్లిక్ న్యూసెన్స్ మాత్రమే కాకుండా ప్రాణహాని కలిగించే చర్య కూడా. పోలీసు శాఖ ఇప్పటికే ఈ వీడియోపై దృష్టి సారించి, వాహనం వివరాలు సేకరిస్తుండగా, సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Also Read: Monalisa: కుంభమేళా మోనాలిసా ఇప్పటివరకు ఎంత సంపాదించిందో తెలుసా?

నెటిజన్లలో ఆగ్రహం
వీడియో చూస్తే కాస్త నవ్వొచ్చినా.. ఎక్కువగా ప్రజల్లో ఆక్రోశమే ఎక్కువ. ఇలాంటి పనులు చేయడం వల్ల తమ ప్రాణాలతో పాటు, ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పెడతారేంటి?, ట్రాక్టర్‌ను నడపటం ఓ బాధ్యత.. తాపీగా పడుకుని డాన్స్ చేయడమా?, వీళ్ళను అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలి అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది.

కఠిన చర్యలే శాస్వత పరిష్కారం
ఇలాంటి పరిస్థితుల్లో కేవలం హెచ్చరికలతో కాదు, కఠిన శిక్షలతోనే నియంత్రణ సాధ్యపడుతుంది. ప్రమాదకర డ్రైవింగ్‌కు సంబంధించిన కేసుల్లో లైసెన్స్ రద్దు, వాహనం సీజ్, జైలుశిక్ష వంటి చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

యువతకు మెసేజ్
సోషల్ మీడియా ఫేమ్ కోసం ప్రాణాలను పణంగా పెట్టడం బుద్ధిమంతుల పని కాదు. ఒక్క వీడియోకు కొన్ని లైకులు వచ్చేయచ్చు. కానీ ఒక్కసారి ప్రమాదం జరిగితే జీవితమే బూడిద అవుతుంది. అందుకే, యువత ఇలా పనులు చేయకుండా.. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, రోడ్డు భద్రత నియమాలను పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

వీడియో చూసి నవ్వుకోవడం ఒక విషయం.. కానీ అంతర్లీనంగా ఉన్న ప్రమాదాన్ని గుర్తించడం మన బాధ్యత. ఈ సంఘటన అందరికీ ఒక వార్నింగ్ బెల్. రహదారిపై థ్రిల్ అనుకోకుండా, రూట్‌లో సేఫ్‌గా ప్రయాణించడమే అసలైన సేఫ్టీ. ఇప్పటికైనా వాహనాలు నడిపే యువత రహదారి భద్రతా నియమాలు పాటించకపోతే ప్రమాదం మీకే కాదు ఎదుటి వారికి పొంచి ఉన్నట్లే!

Related News

Man Wins Rs 240 Cr Lottery: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!

Hanumakonda: కోయ్.. కోయ్.. కొక్కొరొక్కో.. కోళ్ల కోసం జనం పరుగుల వేట

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Viral Video: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!

Big Stories

×