BigTV English

WTC 2025-27: టీమిండియా ఆడే మ్యాచులు ఇవే.. కోహ్లీ, రోహిత్ లేకుండా కష్టమే ?

WTC 2025-27: టీమిండియా ఆడే మ్యాచులు ఇవే.. కోహ్లీ, రోహిత్ లేకుండా కష్టమే ?

WTC 2025-27: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25 సీజన్ ముగిసిన విషయం తెలిసిందే.  ముఖ్యంగా జూన్ 14న లార్డ్స్ లో ముగిసిన  ఫైనల్ లో ఆస్ట్రేలియా పై సౌతాఫ్రికా ఘనవిజయం సాధించింది. అయితే సౌతాఫ్రికా 27 సంవత్సరాల తరువాత ఐసీసీ టైటిల్ గెలవడం విశేషం.  ఈనెల 17 నుంచి ప్రారంభం అయ్యే 2025-27 సీజన్ లో తొమ్మిది జట్లు 71 టెస్ట్ మ్యాచ్ లు ఆడనున్నాయి. అత్యధికంగా ఆస్ట్రేలియా జట్టు 22 మ్యాచ్ లు ఆడనుంది. ఇంగ్లండ్ 21, భారత్ 18, న్యూజిలాండ్ 16 మ్యాచ్ లు ఆడనున్నాయి. అయితే తొలి మ్యాచ్ మాత్రం శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య రేపు ప్రారంభం కానుంది. భారత జట్టు ఈనెల 20న ఇంగ్లండ్ తో జరిగే మొదటి టెస్ట్ తో టైటిల్ వేటను ప్రారంభించనుంది.ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కి సంబంధించిన పూర్తి షెడ్యూల్ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.


Also Read : క్రికెట్ ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్.. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్.. ఎప్పుడంటే?

2025-27 టెస్ట్ ఛాంపియన్ షిప్ నాలుగో ఎడిషన్ లో మొత్తం 9 జట్లు ఆడుతాయి. జూన్ 17 నుంచి గాలెలో జరుగబోయే మొదటి టెస్ట్ లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడుతాయి. ఇక ఈ మ్యాచ్ లో టెస్ట్ ఛాంపియన్ నాలగో ఎడిషన్ ప్రారంభం అవుతుంది. రెండుసార్లు రన్నరప్ గా నిలిచిన టీమిండియా కొత్త కెప్టెన్ శుబ్ మన్ గిల్ సారథ్యంలో రాసున్న టెస్ట్ సైకిల్ ను ఆడబోతుంది. తాజాగా టెస్ట్ సిరీస్ గెలిచిన సౌతాఫ్రికా అక్టోబర్ లో పాకిస్తాన్ తో ఈ ఎడిషన్ లో తమ తొలి సిరీస్ ను ఆడనుంది. టాప్ 2 కి అర్హత సాధించిన జట్లు ఫైనల్ ఆడుతాయి. ఫైనల్ వేదిక ఖరారు కావాల్సి ఉంది. అయితే టీమిండియా మాత్రం సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లు లేకుండా వరల్డ్ ఛాంపియన్ షిప్ గెలవడం కష్టమే అని అభిమానులు పేర్కొనడం గమనార్హం.


భారత్ : 

టీమిండియా మొత్తం 18 టెస్ట్ ఆడనుంది. వీటిలో వెస్టిండ్ 2, దక్షిణాఫ్రికాతో 2, ఆస్ట్రేలియా 5, ఇంగ్లాండ్ 5, న్యూజిలాండ్ 2, శ్రీలంక 2 టెస్ట్ సిరీస్ లు ఆడనుంది.

ఆస్ట్రేలియా : 

ఆస్ట్రేలియా మొత్తం 22 టెస్ట్ లు ఆడనుంది. వీటిలో ఇంగ్లాండ్ 5, న్యూజిలాండ్ 4, బంగ్లాదేశ్ 2, వెస్టిండీస్ 3, దక్షిణాఫ్రికా 3, ఇండియా 5 టెస్ట్ సిరీస్ లు ఆడనుంది.

బంగ్లాదేశ్ : 

బంగ్లాదేశ్ మొత్తం 12 టెస్టులు ఆడనుంది. వీటిలో పాకిస్తాన్ తో 2, వెస్టిండీస్ 2, ఇంగ్లాండ్ 2, శ్రీలంక 2, దక్షిణాఫ్రికా 2, ఆస్ట్రేలియాతో 2 మ్యాచ్ లు ఆడనుంది.

ఇంగ్లాండ్ : 

ఇంగ్లాండ్ మొత్తం 21 టెస్టులు ఆడనుంది. ఇండియా 5, న్యూజిలాండ్ 3, పాకిస్తాన్ 3, ఆస్ట్రేలియా 5, దక్షిణాఫ్రికా 3, బంగ్లాదేశ్ 2 టెస్ట్ సిరీస్ లు ఆడనుంది.

న్యూజిలాండ్ : 

న్యూజిలాండ్ మొత్తం 16 టెస్టులు ఆడనుంది. వీటిలో వెస్టిండీస్ 3, ఇండియాతో 2, శ్రీలంకతో 2, ఇంగ్లాండ్ 3, ఆస్ట్రేలియా 4, పాకిస్తాన్ తో 2 టెస్ట్ సిరీస్ లు ఆడనుంది.

పాకిస్తాన్ : 

పాకిస్తాన్ మొత్తం 13 టెస్టులు ఆడనుంది. దక్షిణాఫ్రికా 2, శ్రీలంక 2, న్యూజిలాండ్ 2, బంగ్లాదేశ్ 2, వెస్టిండీస్ 2, ఇంగ్లాండ్ 3 టెస్టులు ఆడనుంది.

దక్షిణాఫ్రికా : 

దక్షిణాఫ్రికా మొత్తం 14 టెస్టు మ్యాచ్ లు ఆడనుంది. ఆస్ట్రేలియా 3, బంగ్లాదేశ్ 2, ఇంగ్లాండ్ 3, పాకిస్తాన్ 2, భారత్ 2, శ్రీలంక 2 టెస్టులు ఆడనుంది.

శ్రీలంక : 

శ్రీలంక మొత్తం 12 టెస్టులు ఆడనుంది. బంగ్లాదేశ్ తో 2, ఇండియాతో 2, సౌతాఫ్రికాతో , వెస్టిండీస్ తో 2, పాకిస్తాన్ తో 2, న్యూజిలాండ్ తో 2 మ్యాచ్ లు ఆడనుంది.

వెస్టిండీస్ : 

వెస్టిండీస్ మొత్తం 14 టెస్టులు ఆడనుంది. ఆస్ట్రేలియా 3, శ్రీలంక 2, పాకిస్తాన్ 2, ఇండియా 2, న్యూజిలాండ్ 3, బంగ్లాదేశ్ 2 టెస్టు మ్యాచ్ లు ఆడనుంది.

Related News

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Big Stories

×