Boda Kakarakaya: బోడ కాకరకాయ దీనికి వర్షకాలంలో మంచి గిరాకీ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ సీజన్ లో దోరికే బోడ కాకరకాయ ఒక్కసారి అయిన తినాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనిని తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ప్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ వంటి గుణాలు బాగా ఉంటాయి. ఇది వర్షకాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
కాకరకాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. అంతేకాకుండా శరీరంలో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. దీంతో ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ పెరుగుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే ఇందులో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
డయాబెటిస్‌కు చెక్..
బోడ కాకరకాయ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
క్యాన్స్రర్ నివారణ
కాకరకాయలోని యాంటీ ఆక్సిడెంట్లు, బయోయాక్టివ్ సమ్మేళనాలు క్యాన్స్రర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. కాకరకాయ ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చడం వల్ల దీర్ఘకాల ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. అంతేకాకుండా ఇది కాలేయాన్ని డిటిక్సిఫై చేస్తుంది, కాలేయ సమస్యల నుండి రక్షణ కల్పిస్తుంది. కాకరకాయ రసం లేదా టీ రూపంలో తాగడం వల్ల కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
చర్మ ఆరోగ్యానికి మేలు
కాకరకాయలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ గుణాలు చర్మ సమస్యలైన మొటిమలు, సోరియాసిస్, ఎగ్జిమాను తగ్గిస్తాయి. అలాగే ఫైల్స్ కామెర్ల వ్యాధికి బాగా పనిచేస్తాయని నిపుణులు తెలిపారు. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాకరకాయ రసం లేదా దాని పేస్ట్‌ను చర్మం పై రాయడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి.
Also Read: తెల్ల జుట్టు పూర్తిగా పోయి నల్లగా మార్చే చిట్కా ఇదే..
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
కాకరకాయ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగిస్తుంది, సీజనల్ వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది. కావున ఈ సీజన్ లో మాత్రమే దొరికే బోడ కాకరకాయను అస్సలు మిస్ చేసుకోకుండా తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పలు వైద్యలు హెచ్చరిస్తున్నారు.
జాగ్రత్తలు
అయితే కాకరకాయను అతిగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, విరేచనాలు లేదా తక్కువ చక్కెర స్థాయిలు సంభవించవచ్చు. అలాగే గర్బీణీ స్త్రీలు వీటిని తినక పోవడం మంచిదని చెబుతున్నారు