BigTV English

Viral Video: పెళ్లి కూతురిని ఇంప్రెస్ చేద్ధామని చూసి అతిథుల ముందు నవ్వుల పాలైన వరుడు

Viral Video: పెళ్లి కూతురిని ఇంప్రెస్ చేద్ధామని చూసి అతిథుల ముందు నవ్వుల పాలైన వరుడు

Viral Video: తరచూ పెళ్లికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అందులో ముఖ్యంగా వినూత్నంగా చేసే పెళ్లికి సంబంధించిన వీడియోలు అందరిని ఆకర్షిస్తుంటాయి. పూర్వకాలంలో వివాహాలు అంటే ఎంతో సంప్రదాయంగా జరిగేవి. కానీ ఇప్పుడు జరుగుతున్న పెళ్లిళ్లు కూడా సంప్రదాయ పద్ధతిలోనే జరుగుతున్నా కూడా ఎంతో ఘనంగా కోట్లు ఖర్చు పెట్టి, ఎక్కడెక్కడో వివాహాలు చేసుకుంటున్నారు. జీవితంలో ఒకసారి జరిగే ఈ వేడుకను పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు కూడా మర్చిపోకుండా ఉండేలా జరుపుకుంటున్నారు. అందరి పెళ్లిళ్ల కంటే తమ పెళ్లిలో ఏదో ఒక వినూత్నత కనిపించాలనే ఉద్దేశంతో వివిధ రకాలుగా వివాహాలు చేసుకుంటున్నారు. ఇందులో గుడిలో పెళ్లి, డెస్టినేషన్ వెడ్డింగ్ ఇలా ఎన్నో రకాలుగా జరుపుకుంటున్నారు. పెళ్లి ఒక ఎత్తు అయితే దాని తర్వాత ఉండే కార్యక్రమాలను కూడా అదరగొడుతున్నారు. ముఖ్యంగా పెళ్లి తర్వాత జరుపుకునే భరత్(అప్పగింతలు) కార్యక్రమాన్ని వినూత్నంగా జరుపుకుంటూ ఉంటారు.


పెళ్లిళ్లు ఎవరి సంప్రదాయాలను బట్టి వారు జరుపుకుంటూ ఉంటారు. ముస్లింలు అయితే రాత్రి వేళ తమ సంప్రదాయాలను పాటిస్తూ జరుపుకుంటూ ఉంటారు. హిందువులు అయితే ఎంతో సంప్రదాయ పద్ధతిలో మూడు రోజులు లేదా ఐదు రోజుల పాటు పెళ్లిళ్లు జరుపుకుంటారు. మరోవైపు క్రిస్టియన్స్ చర్చిలో పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఇలా జరుగుతున్న పెళ్లిళ్లలో ఏదో ఒక వినూత్నత అనేది కోరుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఓ పెళ్లిలో వధువరులు తమ పెళ్లిని ఎంతో వైభవంగా జరుపుకునేందుకు ప్రయత్నించారు. ఈ తరుణంలో పెళ్లి కూతురిని ఇంప్రెస్ చేయాలని ప్రయత్నించిన పెళ్లి కొడుకు పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితుల ముందు నవ్వులపాలయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ పెళ్లి ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ తరుణంలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చారు. అయితే వారి ఎంట్రీ అనంతరం వధూవరులు స్టేజీపైకి ఎక్కారు. వధువు తెల్లటి దుస్తులు, వరుడు నల్లటి దుస్తులు ధరించి ఎంతో అందంగా ముస్తాబయ్యారు. అయితే వధువరులు ఇద్దరు స్టేజీపైకి రాగానే అక్కడే ఉన్న స్క్రీన్ పై వారి పాత ఫోటోలను ప్లే చేశారు. అనంతరం వధువరులు ఇద్దరు ఓ రొమాంటిక్ పాటకు డ్యాన్స్ చేశారు. ఈ క్రమంలో వరుడు, వధువును పట్టుకుని డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. ఇలా చేస్తుండగా ఒక్కసారిగా వరుడు, వధువును ఎత్తుకుని డ్యాన్స్ చేశాడు. దీంతో ఒక్కసారిగా వరుడి ప్యాంట్ చిరిగిపోయింది. వెంటనే వధువును కిందకు దించి ప్యాంటు పట్టుకుని అక్కడి నుండి ఎవరికి కనిపించకుండా దాక్కునేందుకు ప్రయత్నించాడు.


ఈ సన్నివేశం చూసిన బంధుమిత్రులంతా ఒక్కసారిగా నవ్వడం ప్రారంభించారు. ప్యాంటు టైట్ గా ఉండడంతో కుట్లు ఉడిపోయి చిరిగిపోయిందని తెలుసుకున్న వరుడు వెంటనే అక్కడి నుండి వెళ్లే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది.

 

 

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Julio Campos (@juliocampos0606)

 

Related News

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Big Stories

×