BigTV English

Maoist Alert: ఇన్‌ఫార్మర్ నెపంతో మహిళను హత్యచేసిన మావోలు

Maoist Alert: ఇన్‌ఫార్మర్ నెపంతో మహిళను హత్యచేసిన మావోలు

The Maoists who killed on the pretext of being an informer: మావోయిస్ట్‌ల కదలికలు మళ్లీ షురూ అయ్యాయి. ఇందుకు ఉదాహరణ తాజాగా జరిగిన హత్య. అంతేకాకుండా కోవర్టులపై ప్రత్యేక నిఘా పెట్టారు మావోయిస్టులు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు దళాల సమాచారంతో పలువురు పోలీసులకు చిక్కడంతో ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యారు మావోలు. ఇందులో భాగంగానే పోలీసులకు సహకరిస్తున్న కోవర్టులను హతమార్చేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇటీవల భద్రతాబలగాలకు సమాచారం అందిస్తున్న కోవర్టులను గుర్తించింది మావోయిస్ట్ పార్టీ. తాజాగా.. సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్ ఆర్మీ కమాండర్‌గా పనిచేస్తున్న పల్లెపాటి రాధ అలియాస్ నీల్సోను అంతమొందించింది.


చర్ల మండలం చెన్నాపురం సమీపంలో నీల్సోను చంపి ఈ హత్య తామె చేసినట్లు మావోయిస్టుపార్టీ లేఖను విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని పోలీసులు అలర్ట్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా కాప్రాకు చెందిన పల్లెపాటి రాధ అలియాస్ నీల్సో నర్సింగ్ విద్య పూర్తి చేసింది. అనంతరం 2018లో విప్లవోద్యమంలో చేరింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న దళసభ్యులకు నీల్సో వైద్యం అందిస్తోంది. అయితే ఇటీవల నీల్సో కదలికలపై అనుమానం వ్యక్తం చేసిన పార్టీ ప్రత్యేక నిఘా పెట్టింది. తమనుకున్నట్టుగానే ఆ అనుమానం కాస్త నిజం కావడంతో నీల్సోను బాధ్యతల నుంచి తొలగించింది. ఇక ఇదిలా ఉంటే గత కొంతకాలంగా తమ కూతురు కనిపించడం లేదని పీఎస్‌లో నీల్సో తల్లి ఫిర్యాదు చేసింది.

Also Read: ఈజీగా గంజాయి చాక్లెట్లు అమ్మేస్తారక్కడ..


దీంతో పల్లెపాటి రాధ మిస్సింగ్ కేసును ఎన్ ఐఏ దర్యాప్తు చేయగా..ఈ క్రమంలోనే నీల్సోను అతి కిరాతంగా హతమార్చారు. అనంతరం ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణలోని సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్ట్‌లను అలర్ట్ చేసింది పోలీస్ శాఖ. అంతేకాకుండా పోలీసుల నిఘాను మరింతగా పెంచేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. ఈ హత్య కుట్రపై పోలీస్ శాఖ ప్రత్యేక టీమ్‌తో అడవుల్లో కూంబింగ్ జరిపేందుకు సన్నద్ధం అవుతోంది.

Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×