BigTV English

Janaka Aithe Ganaka Teaser: ఎల్ కేజీ ఫీజ్ కంటే అంత్యక్రియల ఖర్చే తక్కువ

Janaka Aithe Ganaka Teaser: ఎల్ కేజీ ఫీజ్ కంటే అంత్యక్రియల ఖర్చే తక్కువ

Janaka Aithe Ganaka Teaser: కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారాడు సుహాస్. కథ బావుంటే.. హీరోకు కలర్ ఉండక్కర్లేదు.. సిక్స్ ప్యాక్ అవసరం లేదు, నెపో కిడ్ అవ్వాల్సిన అవసరం లేదు అని నిరూపించిన హీరోల్లో సుహాస్ ఒకడు. మొదటి సినిమానే జాతీయ అవార్డును అందుకోవడంతో సుహాస్ పేరు మారుమ్రోగిపోయింది. ఇక ఈ సినిమా తరువాత ఒకపక్క హీరోగా, ఇంకోపక్క కమెడియన్ గా నటిస్తూ మెప్పిస్తూ వస్తున్నాడు.


ఇక మధ్యలో హిట్ 2 సినిమాలో విలన్ గా మెప్పించి షాక్ ఇచ్చాడు. రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లాంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న సుహాస్.. ఈసారి మరో కొత్త కథతో వచ్చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో సుహాస్ హీరోగా నటిస్తున్న చిత్రం జనక అయితే గనుక. సందీప్ బండ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుహాస్ సరసన సంగీర్తన నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ పేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ జనరేషన్ లో పిల్లలను కనడం, పెంచడం ఎంత భారంగా ఉందో వినోదాత్మకంగా చూపించారు. ఒక మిడిల్ క్లాస్ యువకుడు పెళ్లి చేసుకొని, సెటిల్ అయ్యాక పిల్లలు కనాలని ఆశపడతాడు. తన పిల్లలకు బెస్ట్ ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటాడు.


బెస్ట్ స్కూల్ లో చదివించాలని, బెస్ట్ కాలేజ్ లో చేర్పించాలని కష్టపడుతూ ఉంటాడు. ఒక స్థాయికి వచ్చేవరకు పిల్లలు వద్దు అనుకుంటాడు. కానీ, చుట్టాలు పిల్లలు ఎప్పుడు.. ? పిల్లలు ఎప్పుడు.. ? అని సతాయిస్తూఉంటారు. ఇక ఆ పరిస్థితిలో అతడు ఏం చేశాడు.. ? పిల్లలను కనడానికి హీరో ఎందుకు అంత భయపడుతున్నాడు.. ? జనక అయితే గనక.. ఆ హీరో పరిస్థితి ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఇక ఈ జనరేషన్ లో పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు హీరోలానే ఆలోచిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఒక్క ఎల్కేజీ ఫీజ్ నే లక్షల్లో తీసుకుంటున్నారు. అలాంటప్పుడు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి తన పిల్లలను ఎలా చదివించగలడు అనేది డైరెక్టర్ చూపించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సుహాస్ మరో హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.

Tags

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×