BigTV English

Bride Groom Video: డ్యాన్స్ ఇరగదీసిన పెళ్లి కొడుకు.. వీడియో వైరల్!

Bride Groom Video: డ్యాన్స్ ఇరగదీసిన పెళ్లి కొడుకు.. వీడియో వైరల్!

Bride Groom Dance Video Viral: పెళ్లిళ్ల సీజన్ కదా.. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా దర్శనమిస్తున్నాయి. పెళ్లికి సంబంధించిన అనేక రకాల ఫన్నీ, క్యూట్, షాకింగ్ వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటాయి. ఇదిలా ఉంటే పెళ్లి అనంతరం బరాత్‌లో వధూవరులు డ్యాన్స్ చేయడం ఈ రోజుల్లో సర్వసాధారణం. ఇటువంటి వీడియోలు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. ఇవి నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్ర‌స్తుతం వరకు పెళ్లి వేడుక‌లో డ్యాన్స్ చేసిన ఓ సూపర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి కొడుకు డ్యాన్స్ వీడియో చూస్తే తప్పకుండా ఉర్రూతలూగుతారు.


ఇక్కడ కనిపించే విభిన్న దృశ్యాలను ప్రజలను చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పెళ్లి వీడియోలు పోస్ట్ చేసిన వెంటనే వైరల్ కావడానికి ఇదే కారణం కావచ్చు. కొన్నిసార్లు వధూవరులు తమ టాలెంట్‌ను ప్రదర్శించి ఆకట్టుకుంటారు. కొన్నిసార్లు ఆచారాల సమయంలో ఇలాంటి ఫన్నీ సంఘటనలు జరుగుతాయి. ఇవి మనల్ని నవ్విస్తాయి. ప్రస్తుతం ఓ పెళ్లికి సంబంధించిన ఓ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దండ వేయగానే పెళ్లికొడుకు హ్యాపీగా డీజేకి వెళ్లి డ్యాన్స్ చేయడం ఇందులో చూస్తాం.

Also Read: భయపెట్టిన బోయింగ్ విమానం.. గాల్లో ఉండగా ఊడిన ఇంజిన్ కవర్.. షాకింగ్ వీడియో!


వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తుంటే కొంత సమయం క్రితమే వివాహం పూర్తయినట్లు కనిపిస్తోంది. అందరూ డీజేలో డ్యాన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇంతలో వధూవరులను కూడా డ్యాన్స్ చేయడానికి తీసుకువస్తారు. అప్పుడు వరుడు ఆపుకోలేక గెంతుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. మరోవైపు, వధువు అదే స్థలంలో నిలబడి ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా ఉంటుంది. వరుడు అకస్మాత్తుగా వెళ్లి వధువును డ్యాన్స్ చేయమని లాగడం ప్రారంభిస్తాడు. కానీ పెళ్లికూతురు ముఖం చూస్తే ఆమెకు డ్యాన్స్‌పై ఆసక్తి లేదని స్పష్టంగా తెలుస్తోంది.

Also Read: భళా బాలికా భళా.. 9 ఏళ్ల వయస్సులో 75 Kgలు లేపేసావ్ గా..!

వరుడు డ్యాన్స్ చేయడం ప్రారంభించగా.. వధువు వింత రియాక్షన్ ఇచ్చిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక్కడ పెళ్లికూతురు నవ్వుతూ ఉండిపోయింది. వారిద్దరినీ చూసేందుకు పెద్ద ఎత్తున జనం గుమిగూడి ఉన్నారు. ఈ వీడియో చూస్తే పల్లెటూరి పెళ్లిలా కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు స్పందిస్తున్నారు. రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Tags

Related News

Treatment to Snake: పాముకు వైద్యం చేసిన డాక్టర్, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Shocking News: షాకింగ్.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Big Stories

×