BigTV English

Hyper Aadi in Elections Campaign: పవన్ ను గెలిపించాకే మళ్లీ షూటింగ్ లో పాల్గొంట: హైపర్ ఆది

Hyper Aadi in Elections Campaign: పవన్ ను గెలిపించాకే మళ్లీ షూటింగ్ లో పాల్గొంట: హైపర్ ఆది

Hyper Aadi: జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్ లో హైపర్ ఆది ఒకడు. ఒక సాధారణ కంటెస్టెంట్ గా వచ్చి ఆనతి కాలంలోనే టీమ్ లీడర్ గా మారి.. బుల్లితెరపై ఉన్న కామెడీ షోస్ అన్నింటికి రాజులా మారాడు. ఒకపక్క సినిమాలు.. ఇంకోపక్క షోస్ తో బిజీ బిజీగా మారాడు. ఇక హైపర్ ఆది సినిమాల విషయం పక్కన పెడితే.. ఆయన పవన్ కళ్యాణ్ కు పెద్ద ఫ్యాన్ అన్న విషయం తెల్సిందే.


సినిమాలపరంగానే కాకుండా పవన్ కు రాజకీయపరంగా కూడా హైపర్ ఆదికి పవన్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే జనసేనకు సపోర్ట్ గా నిలబడుతున్నాడు. జనసేనను గెలిపించడానికి తనవంతు ప్రయత్నం తాను చేస్తున్నాడు. ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ఎవరి ప్లాన్స్ వారు వేస్తున్నారు. ఎవరికి సపోర్ట్ గా ఉన్నవారిని వారు ప్రచారానికి రంగంలోకి దింపుతున్నారు. తాజాగా హైపర్ ఆది జనసేన ప్రచారానికి సిద్ధం అయ్యాడు. పిఠాపురం నుంచి ఆయన ప్రచారం మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది.

Also Read: Sarkaar Season 4: ఆట మారింది.. ఆడించే ఆటగాడు మారాడు.. సర్కార్ సీజన్ 4లో సుడిగాలి సుదీర్!


ఇక ఈ నేపథ్యంలోనే మీడియాతో ఆయన మాట్లాడుతూ.. “ఈ నెల అయితే షూటింగ్స్ ఏం చేయడం లేదండీ.. షూటింగ్స్ అన్ని ముందే కంప్లీట్ చేసేశాను. ఈ నెల కేవలం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ప్రచారం చేయడం.. అలాగే ఆయన నిలబెట్టినటువంటి 21 మంది నియోజకవర్గాల వద్దకు వెళ్లి వాళ్లకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎన్నికలు అయ్యాకనే మా షూటింగ్స్ మొదలు అవుతాయి” అని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే పవన్ సైతం ఎలక్షన్స్ కోసం సినిమాలను హోల్డ్ లో పెట్టాడు. ఇప్పుడు ఆది కూడా అలానే చేస్తున్నాడు. ఖచ్చితంగా పవన్ ను గెలిపించడానికి తమ శాయశక్తులా కష్టపడతామని ఆయన మొదటినుంచి చెప్పుకొస్తూనే ఉన్నాడు. మరి ఈసారి పవన్ గెలుస్తాడో లేదో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×