BigTV English

Saturn Approaches Mars: అంగారక గ్రహం చేరువలోకి శని.. ఆ రాశుల వారికి కష్టకాలమే..!

Saturn Approaches Mars: అంగారక గ్రహం చేరువలోకి శని.. ఆ రాశుల వారికి కష్టకాలమే..!

Saturn Approaches Mars: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. గ్రహాలు దగ్గరగా రావడం వల్ల అనేక శుభ, అశుభాలు ఏర్పడతాయి. అంగారకుడు, శని కూడా పాక్షికంగా ఒకదానికి ఒకటి దగ్గరగా రానున్నాయి. దీని కారణంగా అంగారక యోగం ఏర్పడుతుందని జ్యోతిష్యలు చెబుతున్నారు. అయితే ఈ రెండు రాశుల కలయిక వలన ఏ రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయో, ఏ రాశుల వారికి జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుకుందాం..


రాశుల మీద అంగారకుడు, శని ప్రభావం ఎలా ఉంటుందటే..?
కుజుడు, శని ఒకదానికొకటి చాలా దగ్గరగా రావడం వల్ల అంగారక యోగం ఏర్పడుతుంది. వీటి కలయిక కారణంగా ఏ రాశి వారికి ఇది అదృష్టం, ఏ రాశి వారికి వారికి దురదృష్టం వరించే అవకాశం ఉందంటే. కుజుడు తన ఉచ్ఛ రాశి అయిన మకర రాశి నుండి బయటకు వచ్చి మార్చి 15న శని రాశికి చేరువయ్యాడు. శని వారికి కుంభరాశిలో కూర్చొని ఆతిథ్యం ఇస్తున్నాడు. అయితే ఏప్రిల్ 22 వరకు శని, అంగారక గ్రహాలు అంతరిక్షంలో కలిసి ఉంటాయి.

జ్యోతిష్యం ప్రకారం చూస్తే.. శని వాయు కారకుడు,కుజుడు అగ్ని కారకుడు. అగ్ని, గాలి కలిసినప్పుడు, అగ్ని పెరుగుతుంది. దీంతో అగ్ని ప్రమాదాలు పెరుగుతాయి. అయితే వీటి కలయిక కారణంగా ఏ రాశి వారికి ఏప్రిల్ 22 వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం..


Also Read: Navratri 2024: దుర్గాదేవికి సింహం వాహనం ఎలా అయ్యిందో మీకు తెలుసా..?

మేషరాశి
మేష రాశి వారికి ఇది వారి కెరీర్‌లో అదృష్టం వరించే సమయం. ఈ రాశి వారు తమ కెరీర్‌లో.. తమలోని అగ్నిని ఉపయోగించుకోవడం ద్వారా అనుకున్నది నెరవేర్చుకునే సమయం ఇది. ఇంజనీరింగ్ సంబంధిత పనులు చేసే వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. సోదరుడితో ఎలాంటి వివాదాలు ఉండకూడదని గుర్తుంచుకోండి. ఇప్పటికే వివాదాలు ఉన్నవారు సాన్నిహిత్యం పెంచుకోవాలి లేదా సంభాషణ ద్వారా వివాదాన్ని ముగించాలి.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వారు అధికారిక పని లేదా ఫ్యాక్టరీ లేదా ప్లాట్‌లో పని కోసం ప్రయాణాలు చేస్తుంటే, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి పనులు చేస్తున్నప్పుడు గాయాలు అయ్యే అవకాశం ఉంది. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ మీ కెరీర్‌లో ముందుకు సాగాలి. ప్రయాణిస్తున్నప్పుడు, సీట్ బెల్ట్ లేదా హెల్మెట్ ధరించడం వంటి అన్ని భద్రతా ప్రమాణాలను పాటించాలి.

సింహరాశి
ఈ రాశికి చెందిన వారు తమ వైవాహిక జీవితంలో చాలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. చిన్న విషయాలని వాటిని వదిలేస్తే.. అవి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఈ రాశి వారి భార్య కెరీర్ లో అనుకున్న లక్ష్యాలు సాధించడానిక చాలా అనుకూలమైన సమయం ఇది. ఆమె శక్తిని సరైన దిశలో తీసుకెళ్లడం చాలా ముఖ్యం.

Also Read: Saturn Approaches Mars: అంగారక గ్రహం చేరువలోకి శని.. ఆ రాశుల వారికి కష్టకాలమే..!

మకరరాశి
ఈ రాశిచక్రం వ్యక్తులు వారి వ్యక్తిత్వం, మాటలను చాలా అదుపులో ఉంచుకోవాల్సిన సమయం ఇది. చిన్న విషయాలపై వివాదాలు తలెత్తుతాయి. కుటుంబంలో ఏదైనా వివాదాలు ఉంటే, దానిని శాంతియుతంగా పరిష్కరించుకోండి. లేకపోతే సంతోషం, శాంతికి భంగం కలుగుతుంది. పురోగతి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న వారికి కూడా ఇప్పుడు మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి.

కుంభ రాశి
ఈ సమయంలో కుంభరాశి వ్యక్తులు చాలా సమతుల్యంగా ఉంటారు. ఉత్సాహం, నిరాశ తరచుగా వస్తూ, పోతూ ఉంటాయి. ఒక్కో కుంభ రాశి వారిక పట్టలేని ఆనందం, పట్టలేన బాధ కలుగుతుంది. మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. వృత్తి పరంగా మీరు చేస్తున్న పనిని చేస్తూ ఉండండి.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం సామాజిక, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. bigtvlive.com దీనిని ధృవీకరించలేదు. దీని కోసం నిపుణుల సలహా తీసుకోండి.

Tags

Related News

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Big Stories

×