BigTV English

Viral Video : పులితో రీల్స్.. దెబ్బకు మైండ్‌బ్లాక్.. వీడియో వైరల్..

Viral Video : పులితో రీల్స్.. దెబ్బకు మైండ్‌బ్లాక్.. వీడియో వైరల్..

Viral Video : సింహం సైలెంట్‌గా ఉంది కదాని దానితో సెల్ఫీలు దిగొద్దు. తేడా వస్తే శాల్తీలు ఖతం. ఇది సినిమా డైలాగ్ మాత్రమే కాదు. నిజంగా నిజం. సింహం, పులి.. అవేవీ ఆట వస్తువులు కాదు.  రీల్స్ మెటీరియల్ అస్సలే కాదు. కానీ, పులితో సరదాగా ఆడుకుందామనుకున్నాడు ఓ పర్యాటకుడు. ఫోటోలు, వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మస్త్ లైక్‌లు, కామెంట్స్ వస్తాయని ఆశపడ్డాడు. అతనొకటి అనుకుంటే, పులి మరొకటి చేసింది. పంజా విసిరితే.. దెబ్బకు మనోడి పరిస్థితి ఏమీ అర్థం కాకుండా పోయింది. ఇంతకీ అసలేం జరిగిందంటే…


థాయ్‌లో మసాజ్‌తో పాటు.,.

థాయ్‌లాండ్. మంచి టూరిస్ట్ డెస్టినేషన్. థాయ్ మసాజ్‌తో పాటు అక్కడ టైగర్ సఫారీలు కూడా ఫుల్ ఫేమస్. థాయ్‌లాండ్ టైగర్ టూరిజంపై ప్రముఖంగా డిపెండ్ అయి ఉంది. పులుల కోసం అక్కడ ప్రత్యేక పార్కులు ఉంటాయి. మన దగ్గర జూ పార్కుల మాదిరి వాటిని బోన్లు, కేజ్‌లలో పెట్టరు. వాటిని మచ్చిక చేసుకుంటారు. పెంపుడు జంతువుగా మార్చేస్తారు. మనం కుక్కలను సాదుకున్నట్టు.. థాయ్‌లాండ్‌లో పులులను పెంచుతారన్న మాట. ఇక, థాయ్‌కు వచ్చే టూరిస్టులు అక్కడి టైగర్ పార్కులను తప్పక సందర్శిస్తారు. డబ్బులు ఇస్తే పులితో కాసేపు ఆడుకోనిస్తారు. థాయ్‌లాండ్‌లో అదో పెద్ద బిజినెస్.


పులితో ఆటలు..

పులి అంటే ఎవరికైనా భయమే. అలాంటిది అక్కడ ఆ క్రూరజంతువును తాకొచ్చు. గిల్లొచ్చు. ఆడుకోవచ్చు. పులి మీద కూర్చొని సరదా తీర్చుకోవచ్చు. వేటగాడిలా ఫోజులు పెట్టి ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చు. అంత ముచ్చట పడతారు కాబట్టే.. అక్కడ టైగర్ పార్కులు మస్ట్ విజిట్ ప్లేసెస్‌గా మారాయి. అవన్నీ ట్రైన్డ్ టైగర్స్ కాబట్టి.. దాడి చేస్తాయనే భయం ఉండదు.

టైగర్‌తో రీల్స్..

అలానే, ఓ ఇండియన్ టూరిస్ట్ సైతం థాయ్‌కు వెళ్లాడు. పులితో సరదాగా గడుపుదామని టైగర్ పార్క్‌కు వెళ్లాడు. వాళ్లు అడిగినంత కట్టేసి.. టికెట్ తీసుకున్నాడు. పార్కులో అతని కోసం ఓ టైగర్‌ను ప్రత్యేకంగా కేటాయించారు అక్కడి సిబ్బంది. క్యూరేటర్ ఆ టైగర్‌ను తీసుకొచ్చాడు. అప్పటికే దాని మెడకు ఐరన్ ఛైన్ కట్టి ఉంది. ఆ గొలుసును మన భారతీయ పర్యాటకుడి చేతికి ఇచ్చారు. మనోడు గొలుసు పట్టుకొని.. పులితో మ్యాన్ వాక్ చేశాడు. అతని స్నేహితుడు అదంతా వీడియో తీస్తున్నాడు. ఇంత వరకూ బాగానే ఉంది. కానీ, సడెన్‌గా….

పులి పంజా విసిరితే..

పులికి అతను నచ్చనట్టుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా పులి ఆ ఇండియన్‌పై దాడి చేసింది. చూస్తుండగానే కింద పడేసి.. పంజా విసిరింది. పక్కనే ఉన్న పులి ట్రైనర్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. తన చేతిలోని స్టిక్‌తో పులిని కంట్రోల్ చేసేందుకు ట్రై చేశాడు. కానీ, ఆ పులి ట్రైనర్‌కు లొంగలేదు. టూరిస్టుపై మళ్లీ దాడి చేసింది. ఆ అటాక్‌ను వీడియో తీస్తున్న అతను ఒక్కసారిగా హడలిపోయాడు. పులి దగ్గరికి పరుగెత్తుకొచ్చాడు. ఆ వీడియో కెమెరా షేక్ అయిపోయింది. వెంటనే ఆ వీడియో ఎండ్ అయింది. పులి రెండుసార్లు పంజా విసిరిన తర్వాత.. అక్కడ ఏం జరిగిందో తెలియలేదు.. ఆ టూరిస్ట్ పరిస్థితి ఎలా ఉందో అర్థం కావట్లేదు.

Also Read : అలేఖ్య మళ్లీ వచ్చింది.. ఏం చెప్పిందంటే..

వీడియో వైరల్..

పులి దాడి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పులితో సెల్ఫీలు దిగడం డేంజర్ బ్రో అంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. థాయ్‌లాండ్‌కు చాలా మందే ఇండియన్స్ వెళ్తుంటారని.. ఇకపై వాళ్లంతా జాగ్రత్తగా ఉండాలంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశాడు. టైగర్‌తో గేమ్స్ ఆడితే ఇట్టానే ఉంటాది అంటూ ఎవరికి తోచిన రకంగా వాళ్లు పోస్టులు పెడుతున్నారు.

Related News

Treatment to Snake: పాముకు వైద్యం చేసిన డాక్టర్, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Shocking News: షాకింగ్.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Big Stories

×