Thug Life Kamal Haasan : ప్రస్తుతం కమల్ హాసన్ (Kamal Haasan) ‘థగ్ లైఫ్’ మూవీపై వివాదం నెలకొన్న సంగతి మనకు తెలిసిందే. కమల్ హాసన్ అప్పుడప్పుడు తన మాటల కారణంగా ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు. అలా తాజాగా తన థగ్ లైఫ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా “కన్నడ పుట్టిందే తమిళం నుండి” అని మాట్లాడి కన్నడిగులకి కోపం తెప్పించారు. ఈ మాట అన్నప్పటి నుండి కన్నడిగులు కమల్ హాసన్ పై మండిపడుతున్నారు. అంతేకాదు కమల్ హాసన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయినా కూడా కమల్ హాసన్ వెనక్కి తగ్గకుండా ప్రేమతోనే ఆ మాటలు అన్నానని చెప్పుకొస్తున్నారు. సారీ మాత్రం చెప్పడం లేదు. దీంతో శుక్రవారం సాయంత్రం లోపు క్షమాపణలు చెప్పకపోతే కన్నడలో థగ్ లైఫ్ మూవీ ని బ్యాన్ చేస్తాం అంటూ చెప్పుకొస్తున్నారు.ఒకవేళ కమల్ హాసన్ ఇలాగే నెగ్లెట్ చేసి క్షమాపణలు చెప్పకపోతే థగ్ లైఫ్ మూవీ ఎన్ని కోట్ల నష్టాన్ని చూడాల్సి వస్తుందో ఇప్పుడు చూద్దాం..
కన్నడిగుల ఆగ్రహానికి గురైన కమలహాసన్..
మణిరత్నం డైరెక్షన్లో కమల్ హాసన్, త్రిష, శింబులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా మూవీ థగ్ లైఫ్. జూన్ 5న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ఇప్పటికే ఎన్నో వివాదాల్లో ఇరుక్కుంది.ఈ సినిమాలో కమల్ హాసన్, త్రిష మధ్య లిప్ లాక్ ల కారణంగా త్రిష, కమల్ హాసన్ ట్రోలింగ్ కి గురయ్యారు. అయితే తాజాగా తమిళం నుండి కన్నడ పుట్టింది అని చెప్పి మరో వివాదం లో ఇరుక్కున్నారు. కమల్ హాసన్ మాటలతో కన్నడిగులు కమల్ హాసన్ పై మండిపడుతూ వెంటనే క్షమాపణలు చెప్పాలని అంటున్నారు. ఒకవేళ కమల్ హాసన్ వెనక్కి తగ్గకపోతే థగ్ లైఫ్ మూవీకి దాదాపు రూ.20 కోట్ల నష్టం వస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే కర్ణాటక మొత్తం మూవీ బ్యాన్ చేస్తే ఖచ్చితంగా సినిమాకి రూ.20 కోట్ల నష్టం వస్తుందట.
కమల్ హాసన్ నోటి దూల వల్లే భారీ నష్టం..
ఇక ఈ నష్టం రాకుండా ఉండాలంటే కచ్చితంగా కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాలి అని మూవీ మేకర్స్ కూడా కమల్ హాసన్ ని ఒత్తిడి చేస్తున్నారట.శుక్రవారం సాయంత్రం లోపు సారీ చెప్పకపోతే పరిణామాలు వేరేలా ఉంటాయని కన్నడ సినీ పరిశ్రమలోని ప్రముఖులు ప్రెస్ మీట్ లు పెట్టి మరీ తెలియజేస్తున్నారు. మరి దీనిపై కమల్ హాసన్ ఎలా స్పందిస్తారు అనేది చాలామందిలో ఒక ఉత్కంఠ అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ కమల్ హాసన్ తన నోటి దూల కారణంగా సినిమాకి భారీ నష్టం తెచ్చేలా ఉన్నారే అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. మరి కమల్ హాసన్ వెనక్కి తగ్గి క్షమాపణలు చెబుతారా.. లేక సినిమా ఫ్లాఫ్ అయితే నాకేంటి నా రెమ్యూనరేషన్ నాకు ముట్టింది కదా అని అహంకారంగా ప్రవర్తిస్తారా అనేది చూడాల్సి ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:HHVM: టికెట్ రేటు పెంపుపై తప్పని తిప్పలు.. డీసీఎం అయినా దిగిరావాల్సిందేనా?