Sydney Sweeney’s Bathwater Soap: ప్రపంచ వ్యాప్తంగా సినీ తారలను చాలా మంది అభిమానిస్తారు. లక్షలాది మంది ఫ్యాన్స్ ఉంటారు. హీరోయిన్లను వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇష్టపడుతారు. వారిని ఎంతో ఇష్టపడుతారు. అయితే, తమ మీద ఉన్న అభిమానాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తారు సదరు నటీమణులు. ఆయా సౌందర్య సాధన కంపెనీలతో జత కట్టి డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తారు. తాజాగా ఓ హీరోయిన్ ను ఓ రేంజిలో వాడుసుకుంటుది ఓ సోప్ కంపెనీ. కేవలం 5 వేల సోప్స్ తయారు చేసి మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఇంతకీ ఈ సబ్బుల ప్రత్యేకత ఏంటంటే..
హీరోయిన్ స్నానం చేసిన నీటి చుక్కలతో సబ్బుల తయారీ
అమెరికాకు చెందిన ప్రముఖ యాక్టర్ సిడ్నీ స్వీనీతో కలిసి డాక్టర్ స్క్వాచ్ (Dr. Squatch) అనే సబ్బుల బ్రాండ్ ఓ కొత్త సబ్బును తయారు చేసింది. దీనికి ‘సిడ్నీస్ బాత్‌వాటర్ బ్లిస్’ (Sydney’s Bathwater Bliss) అనే పేరును పెట్టింది. ఈ సబ్బును పరిమిత సంఖ్యలో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ సబ్బు ప్రత్యేకత ఏంటంటే.. దీనిలో సిడ్నీ స్వీనీ స్నానం చేసిన నీటి చుక్కలను కలిపారు. అంతేకాదు, సబ్బులో ఎక్స్‌ఫోలియేటింగ్ శాండ్, పైన్ బార్క్ ఎక్స్ ట్రాక్ట్, పైన్, డగ్లస్ ఫిర్, మాస్ సుగంధాలు ఉన్నాయి, ఇవన్నీ సిడ్నీ జన్మస్థలమైన పసిఫిక్ నార్త్ వెస్ట్ లో దొరికిన వస్తువులు కావడం విశేషం.
జూన్ నుంచి అదుబాటులోకి కొత్త సబ్బు!
సిడ్నీ స్నానం చేసిన నీటితో తయారు చేసిన ఈ సబ్బు 2025 జూన్ 6 నుంచి అందుబాటులోకి రానుంది. drsquatch.comలో అమ్మకానికి పెట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది. కేవలం 5వేల సబ్బులను తయారు చేసింది. ఒక్కో సబ్బు ధర రూ. 8 డాలర్లుగా నిర్ణయించారు. భారత కరెన్సీలో సుమారు రూ. 685 గా ఉంటుంది. ప్రతి సబ్బుతో పాటు సిడ్నీ సంతకం చేసిన ధృవీకరణ పత్రాన్ని అందిస్తారు.
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
ఇక ఈ సబ్బు గురించి డాక్టర్ స్క్వాచ్ సోషల్ మీడియాలో వెల్లడించగానే.. క్షణాల్లో వైరల్ అయ్యింది. ఈ సబ్బును సిడ్నీ 2024లో స్నానం చేసిన నీటి చుక్కలను ఉపయోగించినట్లు చెప్పింది. ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. కొంత మంది ఫన్ గా కామెంట్స్ పెడితే, మరికొంత మంది ఇదో వికారమైన పనిగా అభిర్ణించారు. ఇంత కంటే ఆసహ్యకరమైన మార్కెటింగ్ మరెక్కడా ఉండదని ఇంకొందరు విమర్శలు చేస్తున్నారు.
వైరల్ యాడ్ నుంచి వైరల్ సోప్ వరకు..
27 ఏళ్ల సిడ్నీ స్వీనీ అమెరికాలో పాపులర్ నటి. యూత్ ఫేమవరెట్. సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించి బాగా పాపులర్ అయ్యింది. ఈ ఏడాది ప్రారంభంలో సిడ్నీ స్టీమీ బబుల్ బాత్ యాడ్ లో నటించి సంచలనం కలిగించింది. ఒక ఇంద్రియ ప్రకటన ప్రచారం కోసం టబ్‌లో విశ్రాంతి తీసుకుంటూ నేచురల్ బాడీ వాష్‌ను ప్రమోట్ చేసింది. ఇప్పుడు, అదే బాత్ వాటర్ ను సబ్బుల తయారీలో ఉపయోగించారు. సహజ సబ్బుల బ్రాండ్ డాక్టర్ స్క్వాచ్ తో మరోసారి జతకడుతోంది సిడ్నీ.
Read Also: రైలులోనే రెస్టారెంట్.. ఎక్కడో కాదు ఇండియాలోనే.. మీకూ అలా జర్నీ చేయాలని ఉందా?