Dileep’s Sabarimala Controversy : రీసెంట్ గా ప్రముఖ నటుడు దిలీప్ (Dileep) శబరిమల ఆలయాన్ని సందర్శించడం వివాదాన్ని రేకెత్తించింది. సాధారణ భక్తుడిలా అయ్యప్పను ఆయన దర్శించుకుని ఉంటే సమస్యేమీ ఉండేది కాదు. కానీ ఆయనకు ఆలయ అధికారులు ఇచ్చిన ‘విఐపీ’ ట్రీట్మెంట్ విమర్శలకు దారి తీసింది. ఆ తరువాత వివాదం కోర్టు మెట్లు ఎక్కగా, తాజాగా న్యాయస్థానం ఆలయ అధికారులను విమర్శించింది.
సాధారణంగా దేవుడికి భక్తులంతా ఒక్కటే. కానీ చాలా టెంపుల్స్ లో మాత్రం సాధారణ భక్తుడికి ఒకలాగా, విఐపి లకు మరోలాగా దర్శనం జరిగేలా చూస్తారు. తిరుమల కొండపై కూడా శ్రీవారిని చూడడానికి సపరేట్ గా వీఐపీ పేరుతో టికెట్లుకొనే అవకాశం ఉంటుంది. ఇలా ప్రతి గుడిలోనూ సామాన్యుడికి, డబ్బున్న వాడికి మధ్య తేడాను ఈ విధంగా చూపిస్తూ ఉంటారు. కానీ శబరిమల ఆలయంలో మాత్రం ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉండదు. ఒకవేళ జరిగిందంటే ఆ రాద్దాంతం మామూలుగా ఉండదు. తాజాగా ప్రముఖ నటుడు దిలీప్ (Dileep) కు దర్శన సమయంలో విఐపి ట్రీట్మెంట్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై భక్తులు ఫైర్ అవ్వడంతో వివాదం మొదలైంది. దిలీప్ తీరుపై భారీ ఎత్తున విమర్శలు విన్పించాయి. ఈ విషయంపై న్యాయస్థానం మండిపడింది.
కేరళ హైకోర్టు రీసెంట్ గా యాక్టర్ దిలీప్ కు శబరిమల ఆలయంలో విఐపి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అనుమతించిన పోలీసులను, ట్రావెల్ కోడ్ దేవస్థానం బోర్డును ప్రశ్నించింది. రద్దీగా ఉండే తీర్థయాత్రల సమయంలో నటుడికి అలాంటి ప్రత్యేక ట్రీట్మెంట్ ఇవ్వడం ఏంటి ? అంటూ అధికారులపై మండిపడింది. దిలీప్ ఇలా అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వీఐపీ ట్రీట్మెంట్ ద్వారా ఆలయానికి వెళ్లడం వల్ల, అప్పటికే లైన్లో భారీ సంఖ్యలో ఉన్న భక్తులకు ఆటంకం ఏర్పడిందని కోర్టు విమర్శించింది. ఈ సంఘటన ఈ ఏడాది డిసెంబర్ 5న జరిగింది. అయితే దిలీప్ కేవలం దర్శనం మాత్రమే కాకుండా ఆ రోజంతా ఆలయంలోనే ఉన్నట్టుగా వార్తలు వినిపించాయి. సమాచారం ప్రకారం దిలీప్ (Dileep) ఆలయ సందర్శనపై హైకోర్టు డివిజన్ బెంచ్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ట్రావెల్ కోర్ దేవస్థానం బోర్డును హైకోర్టు ఆదేశించింది.
ఆలయంలో భారీ సంఖ్యలో భక్తులు క్యూలో దర్శనం కోసం వేచి ఉన్న టైమ్ లో… అందులో చిన్న పిల్లలు, సీనియర్ సిటిజన్‌లు, వికలాంగులు ఉంటారని, ఇలాంటి విఐపి ట్రీట్మెంట్ కారణంగా అసౌకర్యానికి గురవుతారని కోర్టు గుర్తు చేసింది. ముఖ్యంగా మకరవిళక్కు తీర్థయాత్రల సమయంలో ఇలాంటి ఘటనలు జరగకూడదని కోర్టు అధికారులకు వార్నింగ్ ఇచ్చింది. అంతేకాకుండా దిలీప్ (Dileep) కు ఇలా వీఐపీ ట్రీట్‌మెంట్ అందించినందుకు అధికారులను ప్రశ్నించడమే కాకుండా కోర్టు విమర్శించడం విశేషం. దీంతోపాటు పోలీసుల నుండి హైకోర్టు వివరణను కోరినట్టు తెలుస్తోంది. అంత మంది భక్తులు గంటల తరబడి క్యూలో నిల్చున్నప్పుడు, దిలీప్‌ను ఎందుకు ఇలా పరిగణించారని కోర్టు ప్రత్యేకంగా ప్రశ్నించింది. ఇక మలయాళ నటుడు దిలీప్ విషయానికి వస్తే… ప్రస్తుతం ధనంజయ్ శంకర్ దర్శకత్వం వహించిన యాక్షన్-కామెడీ చిత్రం ‘భా’లో నటిస్తున్నాడు.