Snake Incident: ఈజిప్టులో నిర్వహించిన స్నేక్ షోలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. పాము కాటు వేయడంతో ఓ బవేరియన్ పర్యాటకులు ప్రాణాలు విడిచాడు. అయితే పాముల ప్రదర్శకుడు.. చూపిన అత్యుత్సాహం వల్లే 57 ఏళ్ల బాధితుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చినట్లు ఈజిప్టు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇంతకీ ఈ ఘటన ఎలా జరిగింది? బాధితుడు ఏ విధంగా మరణించాడు? ఇప్పుడు చూద్దాం.
ఏప్రిల్ ప్రారంభంలో ఈజిప్టులోని ఓ హోటల్ ల్లో ఈ దుర్ఘటన జరిగింది. పర్యాటకుల కోసం హోటల్ నిర్వాహకులు స్నేక్ షోను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రదర్శన ఇస్తున్న వ్యక్తి (Snake Charmer).. పర్యాటకుల వినోదం కోసం ఒక సజీవ కోబ్రాను వారికి అందించే ప్రయత్నం చేశారు. కొందరు పర్యాటకులు సైతం ఎంతో ఉత్సాహంగా దానిని తాకారు.
అయితే ప్రదర్శన కారుడు.. ఇక్కడే అత్యుత్సాహం ప్రదర్శించాడు. ప్యాంటులోకి కోబ్రా పామును వేయమంటారా? అని బవేరియన్ పర్యాటకుడ్ని అడిగాడు. అందుకు ఆ వ్యక్తి ఒప్పుకోవడంతో.. ఏమాత్రం సంకోచించకుండా విషపూరితమైన కింగ్ కోబ్రాను అతడి ప్యాంటులోకి వదిలాడు. దీంతో ప్యాంటులోకి వెళ్లిన పాము.. కొద్దిసేపటికే పర్యాటకుడి తొడ భాగంపై కాటు వేసింది.
Also Read: మేలో రాబోతున్న.. క్రేజీ వాషింగ్ మిషన్లు ఇవే.. మార్కెట్‌ను షేక్ చేయడం పక్కా!
కింగ్ కోబ్రాకు కోరలు తీయకపోవడంతో దానిలోని విషం వేగంగా పర్యాటకుడి శరీరంలోకి ప్రవేశించింది. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. నిర్వాహకులు వెంటనే బాధితుడ్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ.. చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. పాములతో ప్రమాదకరమైన విన్యాసాలు చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని.. వన్యప్రాణులతో వినోదం ప్రాణసంకటంగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read: కొత్త ఏసీ కావాలా? మేలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ బ్రాండ్స్.. ఫీచర్లు తెలిస్తే ఫ్యూజులు ఔట్!