E-Paper
Advertisement

ఏనుగుల మధ్య ఘర్షణ.. కాళ్ల కింద నలిగి చనిపోయిన మహిళ.. వీడియో ఇదే!

ఏనుగుల మధ్య ఘర్షణ.. కాళ్ల కింద నలిగి చనిపోయిన మహిళ.. వీడియో ఇదే!
Advertisement

Elephant Clash: కర్ణాటకలోని కొడుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక వ్యన్యప్రాణి శిబిరాన్ని వీక్షించేందుకు వచ్చిన ఓ పర్యాటకురాలు.. ఏనుగుల మధ్య జరిగిన ఘర్షణలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ దృశ్యాలను చూసి నెటిజన్లు సైతం షాక్ కు గురవుతున్నారు.

అసలేం జరిగందంటే..!

చెన్నైకి చెందిన 33 ఏళ్ల జ్యునేష్ దుబారే.. శిబిరంలో ఏనుగులకు స్నానం చేయిస్తుండగా తోటి పర్యాటకులతో పాటు సమీపంలో నిలబడి ఆసక్తిగా వీక్షిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కాంచన్ అనే ఏనుగు.. మార్తాండ అనే మరో ఏనుగుపై దాడి చేసింది. దీంతో రెండూ ఒకదానిపైకి ఒకటి కాళ్లు రువ్వాయి. ఈ పోరాటంలో ఓ ఏనుగు.. అదుపుతప్పి సమీపంలో నిలబడి ఉన్న జ్యునేష్ పై పడిపోయింది. లేచి నిలబడే ప్రయత్నంలో మార్తాండ ఏనుగు.. జ్యునేష్ ను మరింతగా తొక్కేసింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఏనుగు ఘర్షణ దృశ్యాలను తోటి పర్యాటకులు చిత్రీకరించగా అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

మంత్రి సంతాపం.. కీలక ఆదేశాలు

మరోవైపు ఈ ఘటనపై కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి ఈశ్వర్ బి. ఖండ్రే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వన్యప్రాణుల విషయంలో కఠినమైన భద్రతా నియమాలను పాటించాలని అధికారులను ఆదేశించారు. బంధించి ఉంచిన ఏనుగులకు శిక్షణ ఇచ్చినప్పటికీ వాటి ప్రవర్తనను అంచనా వేయడం చాలా కష్టమని మంత్రి అభిప్రాయపడ్డారు. కాబట్టి పర్యాటకులు ఏనుగుల తొండాలను తాకడం, ఆహారం పెట్టడం, సమీపంలో నిలబడటం వంటివి చేయకుండా నిరోధించాలని అధికారులకు సూచించారు. ఏనుగులకు సురక్షితమైన దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

Advertisement

Also Read: జోగి రమేశ్ vs పోలీసు అధికారి.. కేకలతో ఊగిపోయిన ఇరువురు.. వీడియో వైరల్!

గత నెలలోనూ ఇదే విధంగా..

ఇదిలా ఉంటే గత నెల చత్తీస్ గఢ్ లోని గౌరేలా పెండ్రా మార్వాహి జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. అడవి ఏనుగు తొక్కేయడంతో 55 ఏళ్ల మహిళ మృతి చెందింది. ఆ తర్వాత కూడా కొద్ది రోజుల పాటు ఏనుగు స్వేచ్ఛగా ఆ ప్రాంతంలో తిరగడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. మరోవైపు ఈ ఏడాది మార్చిలో యూపీలోని బహ్రాయిచ్ జిల్లాలోని కతర్నియాఘాట్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఒక ఏనుగు కాళ్ల కింద నలిగి.. 80 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు విడిచింది.

Also Read: ఇకపై ఇంట్లోనే కాదు.. గోడలపైనా మొక్కలు పెంచేయొచ్చు.. శాస్త్రవేత్తల క్రేజీ ఆవిష్కరణ!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×