Liquor Bribe Train Tickets| దూర ప్రయాణాలకు ఎక్కువ మంది రైలు మార్గాన్నే ఎంచుకుంటారు. ప్రయాణాలకు ముందుగానే ప్లానింగ్ చేసుకునే వారు టికెట్లు రిజర్వేషన్ చేసుకోవడం సాధారణమే. అయితే ఒక్కసారిగా ప్రయాణా చేయాల్సినప్పుడు అందరూ తత్కాల్ టికెట్ల బుకింగ్ పైనే ఆధారపడాల్సి వస్తుంది. ఆన్ లైన్ లో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే అంత ఈజీ కాదు. నిమిషాలు కాదు సెకన్ల వ్యవధిలోనే టికెట్లు అయిపోతాయి. అందుకే కొందరు తత్కాల్ బుకింగ్ కోసం పని గట్టుకొని రైల్వే స్టేషన్ వెళ్లి.. ఆ సమయానికి తత్కాల్ టికెట్లు బుక్ చేసుకుంటారు. అలాంటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టాడు ఓ టికెట్ రిజర్వేషన్ సూపర్ వైజర్.
తత్కాల్ టికెట్లు బుక్ చేయమంటే లేవని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తాడు. మరోవైపు లైన్ లో నిలబడి ఉన్నవారిని కాదని పక్క నుంచి వచ్చిన వారికి టికెట్లు బుక్ చేశాడు. అదేమంటే వారి వద్ద లంచం తీసుకుని పనిచేస్తున్నాడు. ఆశ్చర్యం ఏమిటంటే వారి వద్ద లంచం రూపంలో డబ్బులు కాదు మద్యం తీసుకుంటున్నాడు. ఇదేంటని ప్రశ్నిస్తే.. మద్యం ఇస్తేనే టికెట్ బుకింగ్ అని ఎదురు సమాధానం చెప్పాడు. ఈ షాకింగ్ టికెట్ సూపర్ వైజర్ పనిచేసేది ఒడిశా రాష్ట్రంలో.
వివరాల్లోకి వెళితే..ఒడిశాలోని పరాదీప్ రైల్వే స్టేషన్ లో టికెట్ సూపర్ వైజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు హిమాన్షు శేఖర్ బెహెరా. అతనితో 50 సంవత్సరాలు ఉంటాయి. ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు సరిగా లేకపోవడంతో చాలామంది ఆన్ లైన్ రిజర్వేషన్ కోసం నేరుగా రైల్వే స్టేషన్ కే వస్తారు. కానీ అలా రిజర్వేషన్ బుకింగ్ కోసం వచ్చిన వారిని హిమాన్షు లంచం అడుగుతున్నాడు. తాను అడిగింది ఇవ్వకపోతే వారికి టికెట్లు బుకింగ్ చేయడు. ఎందుకంటే అతనికి మద్యం తాగే వ్యసనం ఉంది. డ్యూటీలోనే నిర్లక్ష్యంగా తాగుతూ ఉంటాడని స్థానికులు తెలిపారు.
Also Read: వీధి కుక్కలు ఉండాలి.. లేకపోతే ఎన్ని నష్టాలో చూడండి – తాజా స్డడీలో షాకింగ్ విషయాలు!
ఈ నేపథ్యంలో ఇటీవల ఆ రైల్వే స్టేషన్లో తత్కాల్ టికెట్ బుకింగ్ చేసుకోవడానికి అక్షయ మజూందార్ అనే వ్యక్తి వచ్చాడు. మజూందార్ మరో ప్రాంతానికి చెందిన వ్యక్తి. సాధారణంగానే రైల్వే స్టేషన్లో టికెట్ బుకింగ్ కోసం కౌంటర వద్ద లైన్ లో నిలబడ్డాడు. లైన్ లో ఉన్నవారంతా చేతిలో లిక్కర బాటిల్స్ పట్టుకొని ఉండడం చూసి అతను షాకయ్యాడు. అయితే మజూందార్ మద్యం బాటిల్స్ లేకుండానే కౌంటర్ వద్దుకు వెళ్లాడు. అది చూసిన టికెట్ సూపర్ వైజర్ హిమాన్షు టికెట్లు లేవని చెప్పాడు. మజూందార్ అది విని నిజంగానే టికెట్లు లేవని భావించాడు. కానీ తన ఎదురుగానే లైన్ లో కాకుండా పక్క నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చి హిమాన్షుకి లిక్కర్ బాటిల్స్ ఇవ్వడంతో వారికి టికెట్లు వెంటనే బుక్ చేసి ఇచ్చాడు. ఇదేంటని ప్రశ్నిస్తే.. అదంతే అని సమాధానమిచ్చాడు.
అయితే మజూందార్ ఇదంతా తప్పుగా అనిపించి ఆ సూపర వైజర్ కు బుద్ధి చెప్పాలనుకున్నాడు. అందుకే హిమాన్షు చేసే నిర్వాకాన్ని తన మెబైల్ ఫోన్ లో రికార్డ్ చేశాడు. హిమాన్షు కూర్చునే కౌంటర్ గదిలో లోపలి నుంచి దృశ్యాలు కూడా వీడియో రికార్డ్ తీశాడు. లోపల చాలా మద్యం బాటిల్స్ ఉన్నాయి. ఈ వీడియో రికార్డ్ చేశాక సోషల్ మీడియా లో పోస్ట్ చేసి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని షేర్ చేశాడు. ఆ వీడియో వైరల్ కావడంతో ఖుర్దా రోడ్ రైల్వే డివిజన్ ఆఫీసర్ కు విషయం తెలిసింది. వెంటనే టికెట్ బుకింగ్ సూపర్ వైజర్ హిమాన్షును సస్పెండ్ చేస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశాడు.