BigTV English

Cherlapally to Tirupati Trains: తిరుపతికి ప్లాన్ చేస్తున్నారా? మీ కోసమే ఈ గుడ్ న్యూస్!

Cherlapally to Tirupati Trains: తిరుపతికి ప్లాన్ చేస్తున్నారా? మీ కోసమే ఈ గుడ్ న్యూస్!

Tirupati Special Trains: వేసవి సెలవుల నేపథ్యంలో హైదరాబాదీలు పెద్ద సంఖ్యలో తిరుపతికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ పెరిగుతోంది. తిరుపతికి వెళ్లే రైళ్లన్నీ రద్దీగా వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి- తిరుపతి మధ్య రెండు వారాల పాటు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. తిరుపతికి రద్దీ పెరిగిన నేపథ్యంలో ఈ రైళ్లు ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా సాయపడుతాయని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. సమ్మర్ లో భాగంగా తిరుమలకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఈ అదనపు రైళ్లను వినియోగించుకోవాలని సూచించారు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ రైళ్లకు సంబంధించి షెడ్యూల్ వివరాలను ప్రకటించింది.


చర్లపల్లి- తిరుపతి మధ్య నడిచే ప్రత్యేక రైళ్ల వివరాలు

⦿ రైలు నెం. 07017 (చర్లపల్లి నుంచి తిరుపతి):


ఈ ప్రత్యేక రైలు  జూన్ 2, 6, 11, 13, 18, 20, 25, 27 తిరుపతికి వెళ్తుంది. అటు జూలై 2, 4, 9, 11, 16, 18, 23, 25, 30 తేదీలలోనూ ఈ రైలు చర్లపల్లి నుంచి తిరుపతికి వెళ్లనుంది. ఇక ఈ రైలు ఆయా తేదీలలో రాత్రి 9:35 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 10:10 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.

⦿ రైలు నెం. 07018 (తిరుపతి నుంచి చర్లపల్లి):

ఇక ఈ ప్రత్యేక రైలు తిరుగు ప్రయాణంలో భాగంగా జూలై 30,  ఆగస్టు 2, 3, 5, 10, 12, 17, 19, 24, 26, 31 తేదీలలో తిరుపతి నుంచి చర్లపల్లికి రానుంది. ఈ రైలు తిరుపతిలో సాయంత్రం 4:40 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 7:10 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

Read Also: వందే భారత్ లోకో పైలట్ జీతం ఎంత? ఆ ఉద్యోగానికి కావల్సిన అర్హతలేంటీ?

ఈ రైళ్లు ఏ స్టేషన్లలో ఆగుతాయంటే?

ఇక తిరుపతి ప్రత్యేక రైళ్లు మల్కాజిగిరి, కాచిగూడ, ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్డు, దద్వాల్, కర్నూలు సిటీ, ధోనే, గూటి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రాజంపేట స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్  క్లాస్ కోచ్‌లు ఉంటాయి.  ఈ రైళ్లను ఉపయోగించుకుని ప్రయాణీకులు ఇబ్బందిలేకుండా తిరుపతికి వెళ్లి రావచ్చిన సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు.

Read Also: సమ్మర్ లో ఫారిన్ ట్రిప్స్? తక్కువ ఖర్చులో బెస్ట్ 7 కంట్రీస్ ఇవే!

Read Also: ఈ రైళ్లు సికింద్రబాద్‌లో ఆగవు.. ఇకపై చర్లపల్లి, కాచిగూడ నుంచే రాకపోకలు!

Related News

TTE Instagram: అమ్మాయి టికెట్ చూసి.. అలా చేయాలంటూ ఒత్తిడి చేసిన టీసీ, ఓర్ని దుంప తెగ!

Trains Cancelled: 3 రాష్ట్రాల్లో రైల్వే అలర్ట్, ఏకంగా 55 రైళ్లు క్యాన్సిల్!

Singapore – Malaysia: మలేసియా, సింగపూర్‌లకు IRCTC సరికొత్త ప్యాకేజ్.. మరీ ఇంత చౌకగానా?

Vande Bharat Train: రైల్వేకు బుర్ర ఉందా? వందేభారత్‌ను ఎవరైనా ఆ రోజు నిలిపేస్తారా?

Rajahmundry to Tirupati Flight: రాజమండ్రి నుంచి తిరుపతికి నేరుగా విమానం.. ఎప్పటి నుంచంటే?

Rail Neer: గుడ్ న్యూస్.. రైల్ నీర్ బాటిల్ ధరలు తగ్గుతున్నాయ్, ఇకపై ఎంతంటే?

Bullet Train: ఏంటీ.. మన బుల్లెట్ ట్రైన్‌కు అడ్వన్స్ బుకింగ్ ఉండదా? మరి రైలు ఎక్కేది ఎలా?

Watch Video: ఫోన్ కొట్టేసిన పోలీసు.. ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది, చివరికి..

Big Stories

×