Mohan Babu University Student: మోహన్ బాబు విద్యాసంస్థలైన మోహన్ బాబు యూనివర్సిటీ(MBU) లో చదువుకుంటున్న ఒక విద్యార్థిని కొంతమంది గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసినట్లు సమాచారం.. ప్రస్తుతం ఈ విషయం అటు సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. మోహన్ బాబు యూనివర్సిటీ లో చదువుకుంటున్న జేమ్స్(James ) అనే విద్యార్థిని దాడి చేసి కిడ్నాప్ చేసినట్లు సమాచారం. కులం పేరుతో దూషిస్తూ అవమానిస్తున్న తన జూనియర్ యశ్వంత్ ను ఇటీవలే జేమ్స్ మందలించారు. దీంతో అవమాన భారంగా ఫీల్ అయిన యశ్వంత్.. తనతో పాటు కొంతమంది రౌడీ షీటర్లను తీసుకొచ్చి జేమ్స్ పై దాడి చేశారట. ఈ విషయాన్ని జేమ్స్ ఒక సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తనను రెండు రోజులపాటు బంధించి, చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
అసలేం జరిగింది..? జేమ్స్ మాటల్లోనే..
గత కొన్ని రోజుల క్రితం తన జూనియర్ యశ్వంత్ తనను కులం పేరుతో దూషిస్తూ అవమానిస్తుంటే మందలించానని జేమ్స్ తెలిపారు. అయితే తన జూనియర్ యశ్వంత్ కొంతమంది రౌడీ మూకాలను తీసుకొచ్చి తనపై దాడి చేయించి తనను కిడ్నాప్ చేశారని రెండు రోజులపాటు బంధించి చిత్రహింసలకు గురి చేశారని జేమ్స్ తన సెల్ఫీ వీడియోలో తెలియజేశారు ఈనెల 13వ తేదీన తనను కిడ్నాప్ చేసినట్లు జేమ్స్ తెలిపారు. ఇకపోతే కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న జేమ్స్ నేరుగా పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న తిరుచానూరు పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం జేమ్స్ కి సంబంధించిన ఈ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తోంది.
మోహన్ బాబు స్పందిస్తారా..?
ఇకపోతే తన యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థిని కిడ్నాప్ చేసి దాడి చేశారని ఒక వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.. ప్రస్తుతం గాయాలతో ఉన్న జేమ్స్ హాస్పిటల్లో కనిపిస్తున్నారు. అటు పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. మరి ఈ విషయం ఇంతవరకు మోహన్ బాబు విద్యాసంస్థల అధినేత మోహన్ బాబుకు తెలియదా..? ఒకవేళ తెలిసినా ఆయన స్పందించడం లేదా..? అసలేం జరుగుతోంది ..? అంటూ నెటిజన్స్ కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మోహన్ బాబు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.
also read:Sukumar: పుష్ప 3 పనుల్లో సుక్కూ.. మనసు మార్చుకున్నారా?
మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థిపై దాడి
జేమ్స్ అనే విద్యార్థిని కిడ్నాప్ చేసి దాడి చేసిన దుండగులు
కులం పేరుతో దూషిస్తూ అవమానిస్తున్న తన జూనియర్ యశ్వంత్ ను ఇటీవల మందలించిన జేమ్స్
యశ్వంత్ తో పాటు కొందరు రౌడీ షీటర్లు కూడా తనపై దాడి చేశారన్న జేమ్స్
సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో… pic.twitter.com/NPdYbAtMSO
— BIG TV Breaking News (@bigtvtelugu) May 17, 2025