Sukumar:అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో వచ్చిన చిత్రం పుష్ప (Pushpa). రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా.. అనసూయ (Anasuya), సునీల్ (Sunil), ఫహద్ ఫాజిల్ (Fahad fazil)తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు అందించింది ఈ సినిమా. అంతేకాదు ఈ సినిమాతో అల్లు అర్జున్ కి నార్త్ ఇండియాలో కూడా భారీ పాపులారిటీ లభించింది. ఇక ఈ సినిమా తర్వాత ‘పుష్ప 2’ గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించిన విజయాన్ని సంఘం చేసుకుంది. అంతేకాదు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా రెండవ స్థానాన్ని దక్కించుకుంది.
పుష్ప 3 పనులు మొదలు..
ఇకపోతే పుష్ప 2 క్లైమాక్స్లో పుష్ప 3 : ది ర్యాంపేజ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందులో భాగంగానే పుష్ప -3 కి లీడ్స్ వదిలారు కానీ కథ మాత్రం సిద్ధంగా లేదు. ముఖ్యంగా లీడ్స్ అయితే ఇచ్చారు కానీ ఎలా మొదలు పెట్టాలి ? ఎలా ముగించాలి? అన్న విషయంపై క్లారిటీ లేదు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ – సుకుమార్ స్వయంగా వెల్లడించారు కూడా. ఈ నేపథ్యంలోనే ఇప్పట్లో పుష్ప 3 ఉండదని అంతా ఒక అంచనాకు వచ్చారు. దీనికి తోడు అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ (Atlee) దర్శకత్వంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లెవెల్ లో సినిమా చేస్తున్నారు. పైగా ఈ సినిమాకు మరో రెండు మూడు సంవత్సరాలు టైం పట్టేలాగా ఉంది. దీనికి తోడు అల్లు అర్జున్ త్రివిక్రమ్ (Trivikram) తో సినిమా చేయాల్సి ఉంది. కాబట్టి ఇప్పట్లో పుష్ప 3 వుండదని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ సడన్ ట్విస్ట్ ఏంటంటే.. ప్రస్తుతం సుకుమార్ పుష్ప 3 స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలిసి అటు ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
డైలమాలో పడ్డ సుకుమార్..
అంతేకాదు తమ అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం పుష్ప 3 స్క్రిప్ట్ పనులు సుకుమార్ మొదలు పెట్టినట్లు సమాచారం. ఇప్పట్నుంచి మొదలు పెడితే తప్ప స్క్రిప్ట్ సిద్ధం చేయడం వీలుపడదని, నెమ్మదిగా కలం పట్టినట్లు తెలుస్తోంది. అసలే సుకుమార్ చాలా గందరగోళం మనిషి అని, స్క్రిప్ట్ ఓకే అయిన తర్వాత వాటికి సీన్స్ పరంగా రకరకాల వెర్షన్స్ కూడా రాస్తూ ఉంటారని, వాటిలో ఒకదాన్ని ఎంచుకోవడంలో చాలా గందరగోళానికి గురవుతుంటారని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన రైటింగ్ టీం సహకారం తీసుకొని ఫైనల్ చేస్తున్నారట. మరొకవైపు రామ్ చరణ్ (Ram Charan) తో తన 17వ చిత్రం కూడా డైలమాలో పడినట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమా ఇప్పట్లో వచ్చేలా కనిపించలేదు కాబట్టి మనసు మార్చుకుని పుష్ప 3 పనులు మొదలుపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి పుష్ప 3 తో ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాలి.
also read:NTR – Prashant Neel: ఎన్టీఆర్ బర్త్డే ట్రీట్.. ఫాన్స్ కి నిరాశ తప్పదా..?